Extramarital Affair Murder| వివాహేతర సంబంధాల మత్తులో లోకాన్ని నిర్లక్ష్యం చేసే ప్రేమికులు చివరికి జీవితాలు నాశనం చేసుకుంటారు. తాజాగా అలాంటి ఒక షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇద్దరు ప్రేమికులు ఇంట్లో శృంగారం చేసుకుంటుండగా.. ఒక పగ బట్టిన వ్యక్తి వారిని నిలువనా గొడ్డలితో నరికేశాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జాలోన్ జిల్లా టిక్రీ గ్రామానికి చెందిన కువర్ సింగ్ అనే యువకుడు (33) ఢిల్లీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 10 నెలల క్రితం తన తల్లిదండ్రలు ఇష్టానుసారంగా పొరుగు గ్రామం యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన కొత్తలో భార్యభర్తల మధ్య అంతా బాగానే ఉండేది. ఇద్దరూ హనీమూన్ కి కూడా వెళ్లారు.
Also Read: టీనేజర్‌పై గ్యాంగ్ రేప్.. సవతి తల్లే డబ్బులు తీసుకొని..
ఆ తరువాత కువర్ సింగ్ ఉద్యోగ రీత్యా ఢిల్లీకి వెళ్లిపోయాడు. అయినా ఫోన్ లో అతని భార్య ప్రేమగానే మాట్లాడేది. నెల రోజుల క్రితం నుంచి కువర్ సింగ్ తన భార్యకు ఫోన్ చేస్తే ఆమె సరిగా మాట్లాడేది కాదు. తాను ఏదో పనిలో ఉండానని చెప్పి తప్పించుకునేది. ఢిల్లీలో కువర్ సింగ్ తో పాటు అతని గ్రామానికి చెందిన మరో యువకుడు కూడా పనిచేసేవాడు. అతను కువర్ సింగ్ కు ఒక షాకింగ్ వార్త చెప్పాడు. కువర్ సింగ్ భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించేదని.. ఆమె ఇప్పుడు కూడా తన పుట్టింటికి వెళ్లినప్పుడు అతనితో కలిసి తిరుగుతోందని. ఇదంతా విని కువర్ సింగ్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరా తీశాడు. అతని భార్య పుట్టింటికి వెళ్లిందని వాళ్లు చెప్పారు.
తన భార్య తనకు ద్రోహం చేస్తోందని తెలిసి కువర్ సింగ్ నమ్మలేకపోయాడు. అందుకే కళ్లారా చూద్దామని.. ఎవరికీ చెప్పకుండా ఉద్యోగానికి సెలవు పెట్టి గ్రామానికి వెళ్లాడు. ఏకంగా తన భార్య పుట్టింటికి వెళ్లాడు. అక్కడ అందరూ చూస్తుండగా.. తన భార్య ఉన్న గదిలోకి దూరాడు. అక్కడ కువర్ సింగ్ భార్య తన ప్రియుడితో ఉందని కువర్ సింగ్‌కి ముందే తెలుసు. కువర సింగ్ గదిలోకి వెళ్లి చూసినప్పుడు అతని భార్య తన ప్రియుడితో శృంగారంలో ఉంది. అది చూసిన కువర్ సింగ్ గది లోపలి నుంచి లాక్ చేశాడు. తన వెంట తీసుకెళ్లిన గొడ్డలితో ఇద్దరినీ నరకడం ప్రారంభించాడు. ప్రేమికులిద్దరూ ఆ దాడికి గట్టిగా కేకలు వేయగా.. ఇరుగు పొరుగు వారంతా అక్కడికి చేరుకున్నారు. కువర్ సింగ్ భార్య తల్లిదండ్రులు బయట నుంచి అరుపులు వేస్తున్నా.. కువర్ సింగ్ కనికరం చూపలేదు. ప్రేమికులిద్దరినీ చంపేంతవరకు గొడ్డలిని ఆపలేదు.
ఆ తరువాత బయటికి వచ్చి కువర్ సింగ్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి హత్యల గురించి సమాచారం అందించాడు. కువర్ తనే హత్యలు చేశానని తన నేరం అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. ప్రస్తుతం కోర్టులో కువర్ సింగ్ పై డబుల్ మర్డర్ కేసు విచారణ సాగుతోంది.