BigTV English

Nindu Noorella Saavasam Serial Today December 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:    పిల్లలను ఫారెస్ట్‌ లోకి తీసుకెళ్లిన రౌడీలు – ట్రాకర్‌ ఆగిపోవడంతో అయోమయంలో అమర్‌

Nindu Noorella Saavasam Serial Today December 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:    పిల్లలను ఫారెస్ట్‌ లోకి తీసుకెళ్లిన రౌడీలు – ట్రాకర్‌ ఆగిపోవడంతో అయోమయంలో అమర్‌

Nindu Noorella Saavasam Serial Today Episode :  రౌడీలను చూసి పిల్లలందరూ భయపడుతుంటే.. అంజు మాత్రం గన్స్‌ చూసి ఎంజాయ్‌ చేస్తుంది. నీకు భయం కావడం లేదా..? అని అమ్ము అడిగితే ఏం లేదని నేను ఎవరు ది గ్రేట్‌ అమరేంద్ర కూతురుని అంటుంది. మరోవైపు అరవింద్ ఒక దగ్గర కారు ఆపుకుని గన్స్‌ తీసుకుని వెళ్లిపోతాడు. బస్సులో వెళ్తున్న అమ్ము బాధపడుతుంది. మిస్సమ్మను గుర్తు చేసుకుని ఎక్స్‌ కర్షన్‌ వద్దని చెప్పిన మాటలను గుర్తు చేసకుని మిస్సమ్మ ఎంత చెప్పినా వినకుండా వచ్చాము మాకు కావాల్సిందే అని మనసులో అనుకుంటుంది. అవునక్కా మనం మిస్సమ్మను అపార్థం చేసుకున్నాము అంటాడు ఆకాష్‌.


అవునక్కా మనం మిస్సమ్మ మాట విని ఉంటే మనం ఇప్పుడు సేఫ్‌గా ఉండేవాళ్లం అంటాడు ఆనంద్‌. దీంతో ఏయ్‌ ఆపండి నా ముందు మిస్సమ్మను పొగడటం నాకు ఇష్టం ఉండదని తెలియదా..? అంటూ కోప్పడుతుంది అంజు. ఇంకోసారి మిస్సమ్మను గుర్తు చేసుకుంటే బాగుండదు అంటుంది. ఇంతలో బంటిని పిలిచి నీకా గన్‌ కావాలా..? ఒకసారి అడుగు అంటుంది. బంటి భయంతో వణికిపోతుంటాడు. మరోవైపు అనుచరులతో కలిసి ఫారెస్టులో వెళ్తుంటాడు అరవింద్‌. వాళ్లకు అటవీ శాఖ వారి పాములున్నాయి జాగ్రత్త అనే బోర్డు కనిపిస్తుంది. అన్న అటూ చూడు ఆ బోర్డు మీద ఏం రాసిందో చూడు అన్న అంటాడు.

ఏంట్రా ఆ బోర్డు చూడగానే భయపడిపోయావా..? ఆ బోర్డు చూశావా..? ఎంత పాతది అయిపోయిందో.. ఆ పాటికి పాములన్నీ ముసలివి అయిపోయి చచ్చిపోయి ఉంటాయి పదండిరా..? అని లోపలికి వెళ్లిపోతారు. కారులో వెళ్తున్న మిస్సమ్మ ఏడుస్తుంది. పాపం పిల్లలు ఎంత బాధపడుతున్నారో ఏదైనా చేసి త్వరగా వాళ్లను పట్టుకోవాలి అంటుంది. మరోవైపు పాత బంగ్లా దగ్గరకు వెళ్లిన అరవింద్‌ తన మనుషులకు బంగ్లా చుట్టూ బాంబులు పాతమని చెప్తాడు. అనుచరులందరూ సరేనని బాంబులు పాతుతుంటారు. బస్సు చెక్‌పోస్టు దగ్గరకు వెళ్తుంది. ట్రాక్‌ చేస్తున్న అమర్‌కు లాప్‌టాప్‌లో కనిపిస్తుంది. వాళ్లు షార్ట్‌ కట్‌లో ఫారెస్ట్‌ లోకి ఎంటర్‌ అవ్వాలని చూస్తున్నారు అని అమర్‌ చెప్పగానే అయితే వెంటనే చెక్‌పోస్ట్‌ కు ఫోన్‌ చేసి బస్సును ఆపమని చెప్పండి అని మిస్సమ్మ చెప్తుంది.


సరేనని అమర్‌ అంటాడు. మరోవైపు బస్సు చెక్‌ పోస్ట్‌ దగ్గరకు వస్తుందని ఎవరైనా అల్లరి చేశారనుకోండి బాంబు పేలుస్తాను అంటాడు డ్రైవర్‌. ఇంతలో బస్సు చెక్‌ పోస్ట్‌ వద్దకు వస్తుంది. ఫారెస్టు  ఆఫీసర్లు బస్సును చెక్ చేసి జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. ఇంతలో అమర్‌  అక్కడికి వస్తాడు. ఫారెస్టు వాళ్లను డీటెయిల్స్‌ అడిగి డ్రైవర్‌ ఫోటో చూపిస్తాడు. వీడే డ్రైవర్‌ అని చెప్తాడు ఆఫీసర్‌. మిస్సమ్మ భయపడుతుంది. ఇంతలో ట్రాకర్‌ ఆగిపోతుంది. నాగులగుట్ట దగ్గర ట్రాకర్‌ ఆగిపోయిందని మనం అక్కడకు వెళ్దాం అని అందరూ అక్కడికి బయలుదేరుతారు.  మరోవైపు బస్సును ఒక దగ్గర ఆపిన డ్రైవర్‌ ఇక్కడితో రోడ్‌ పినిష్‌ అయిపోయింది. ఇక నడుచుకుంటూ వెళ్దాం అని దిగి వెళ్లిపోతుంటారు.

అరవింద్‌ రాకీకి ఫోన్‌ చేసి బంగ్లా చుట్టూ ల్యాండ్‌మైన్స్‌, బాంబులు ఉన్నాయని జాగ్రత్తగా రమ్మని చెప్తాడు. సరేనని రాకీ ప్రిన్సిపాల్‌ ను పిలిచి ఇక్కడ బాంబులు ఉన్నాయని అందరూ నా వెనకాలే నడవాలని తేడా జరిగితే అందరం చనిపోతామని చెప్తాడు. సరేనని ప్రిన్సిపాల్ పిల్లలకు చెప్తుంది. అందరూ కలిసి నడుస్తుంటారు. దూరం నుంచి పిల్లలను గమనించిన అరవింద్‌ తన అనుచరుణ్ని పిలిచి పిల్లలను తీసుకొస్తున్నారు. నవ్వు వెళ్లి వాళ్లను బంధించడానికి ఏర్పాట్లు చేయ్‌ అని చెప్తాడు.

మరోవైపు గుప్త వేసిన బంధంలోంచి ఆరు బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండిపోతుంది. గుప్త వచ్చి ఆరును రెచ్చగొడతాడు. అక్కడ నీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు నువ్వు వెళ్లి కాపాడుకో వెళ్లు అంటాడు. దీంతో గుప్త గారు ఫ్లీజ్‌ మీరేం మట్లాడకండి.. మీరిదంతా కావాలని చేస్తున్నారని నాకు తెలుసు అంటుంది ఆరు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Nindu Noorella Saavasam Serial Today September 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ  

Brahmamudi Serial Today September 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన రాజ్‌

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Big Stories

×