Curd For Skin: చలికాలం ప్రారంభం కాగానే చర్మం గరుకుగా, పొడిగా, నిర్జీవంగా కనిపించడం ప్రారంభమవుతుంది. వాస్తవానికి పొడి గాలుల కారణంగా చర్మం యొక్క తేమ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది చర్మంపై దురద , గీతలు వంటి తెల్ల చుండ్రు రూపాన్ని కలిగిస్తుంది. చలికాలం ప్రారంభమైన వెంటనే పొడి చర్మం సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, మీ బ్యూటీ రొటీన్‌లో ఖచ్చితంగా పెరుగు ఫేస్ మాస్క్‌ను చేర్చుకోండి.
పెరుగు ఆరోగ్యానికే కాదు, చర్మానికి అమృతం లాంటిది. జిడ్డు నుండి పొడి చర్మం వరకు అనేక రకాల చర్మానికి పెరుగు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని అనేక రకాలుగా తయారు చేసి ముఖంపై అప్లై చేయవచ్చు. చలికాలంలో ముఖంపై తేమతో పాటు పింక్ గ్లో మెయింటైన్ చేయడానికి పెరుగు ఫేస్ మాస్క్‌ను ఎలా తయారు చేసుకుని అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగుతో ఫేస్ మాస్క్:
కావలసిన పదార్థాలు
తాజా పెరుగు- 2 టేబుల్ స్పూన్లు
తేనె- 1 ఒక చెంచా
కొబ్బరి నూనె- ఒక చెంచా
అరటిపండు గుజ్జు- 1 టేబుల్ స్పూన్
పెరుగు ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలి ?
పెరుగు ఫేస్ మాస్క్ చేయడానికి, ముందుగా పెరుగు , తేనెను కలిపి ఒక గిన్నెలో వేసి మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి. పెరుగును ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం మృదువుగా ,హైడ్రేట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొబ్బరి నూనె , అరటిపండును గుజ్జును వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమం స్మూత్‌గా మారుతుంది. ఇప్పుడు, సిద్ధం చేసిన ఫేస్ మాస్క్‌ను ముఖంపై మందపాటి పొర లాగా వేయండి. తర్వాత దీనిని ముఖంపై 20 నిమిషాలు ఉంచండి. పూర్తిగా ఆరిపోయినప్పుడు గోరువెచ్చని నీటితో ముఖాన్ని వాష్ చేయండి. దీని తర్వాత ముఖానికి మంచి మాయిశ్చరైజర్ రాయండి.
Also Read: టీ పౌడర్ ఇలా వాడారంటే.. తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది
పెరుగు మాస్క్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఈ ఫేస్ మాస్క్ ముఖంలోని మురికిని తొలగించడమే కాకుండా మృత చర్మ కణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుతాయి. అంతే కాకుండా కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
పెరుగు ఫేస్ మాస్క్ ముఖంపై మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఇది ప్రభావవతంగా పనిచేస్తుంది. చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు పెరుగును వాడటం వల్ల అద్భుత లాభాలు ఉంటాయి. ఖరీధైన స్కిన్ కేర్ ప్రొడక్ట్ లను వాడకుండా పెరుగులో కొన్ని రకాల పదార్థాలను కలిపి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెరుగు ఫేస్ మాస్క్ ముఖాన్ని కాంతివంతగా మార్చుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.