BigTV English

Bigg Boss 8 Telugu: ఆ ముగ్గురే నా గేమ్‌లో విలన్స్.. వెళ్లిపోతూ అసలు విషయం చెప్పిన రోహిణి

Bigg Boss 8 Telugu: ఆ ముగ్గురే నా గేమ్‌లో విలన్స్.. వెళ్లిపోతూ అసలు విషయం చెప్పిన రోహిణి

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో ఫినాలే వీక్ దగ్గరపడుతుండడంతో ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరగనుందని సడెన్‌గా చెప్పి షాకిచ్చారు నాగార్జున. ఈవారం కంటెస్టెంట్స్ అంతా ఎలా ఆడారు అని వారితో చర్చించిన తర్వాత ఎలిమినేట్ అయ్యేది ఎవరో ప్రకటించారు. అలా ప్రకటించే ముందు అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నావని అవినాష్‌ను అడిగారు. అంటే హౌస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండి రోహిణి ఒక్కసారి కూడా నామినేషన్స్‌లోకి రాలేదని, మొదటిసారి వచ్చింది కాబట్టి తను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు. అలా అవినాష్ చెప్పినట్టుగా రోహిణి ఎలిమినేట్ అయ్యింది. స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత తన గేమ్‌లో విలన్స్ ఎవరో బయటపెట్టింది.


చప్పట్లు కొట్టి పంపించారు

ఒకప్పుడు బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా వచ్చింది రోహిణి. అప్పుడు తను కంటెస్టెంట్‌గా ప్రేక్షకుల మైండ్‌లో రెజిస్టర్ అవ్వక ముందే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. ఈసారి అలా జరగకూడదని బలంగా మైండ్‌లో ఫిక్స్ అయ్యి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండి తన పర్సనాలిటీని బట్టి సరిగ్గా టాస్కుల్లో పాల్గొనలేదని ఎన్నో అవమానాలు ఎదుర్కుంది. అయినా పట్టు వదలకుండా ఆడి చివరి మెగా చీఫ్ అయ్యింది. తన జర్నీ చాలామంది అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్ అని కంటెస్టెంట్స్ అంతా తనను చప్పట్లు కొట్టి బయటికి పంపించారు. తాను ఎలిమినేట్ అయినందుకు బాధ లేదని, తాను విన్నర్‌గానే బయటికి వెళ్తున్నానని సంతోషం వ్యక్తం చేసింది రోహిణి.


Also Read: రోహిణి ఎలిమినేట్..8 వారాలకు ఎంత రెమ్యునరేషన్ అందుకుందంటే..?

వాళ్లే హీరోస్

హౌస్ నుండి స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్‌లో ముగ్గురు హీరోలు ఎవరు, ముగ్గురు విలన్స్ ఎవరు అని అడిగారు నాగార్జున. హీరోల లిస్ట్‌లో అందరూ ఊహించినట్టుగానే అవినాష్ పేరు చెప్పింది రోహిణి. ఇంతకు ముందు తను అవినాష్‌తో అంత క్లోజ్ కాదని, హౌస్‌లోకి వచ్చాకే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని చెప్పింది. ఆ తర్వాత ఆ లిస్ట్‌లో గౌతమ్ పేరు యాడ్ చేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాగానే రెండో వారానికే గౌతమ్ వెళ్లిపోతాడని అనుకున్నానని కానీ ఆ తర్వాత వారం నుండి తన అసలు ఆట ఏంటో చూపించాడని ప్రశంసించింది. సోలో బాయ్‌గా ఉండకుండా అందరితో కలవమని సలహా ఇచ్చింది. చివరిగా హీరోస్ లిస్ట్‌లో ప్రేరణ పేరు యాడ్ చేసింది రోహిణి.

వాళ్లే విలన్స్

అబ్బాయిలతో పోటీగా దాదాపు ప్రతీ ఆట గెలుస్తూ వస్తుందని ప్రేరణను ప్రశంసించింది రోహిణి. విలన్స్ విషయానికొస్తే.. విష్ణుప్రియా, నబీల్, నిఖిల్ పేర్లు చెప్పింది. విష్ణుప్రియా సరదాగా అన్న మాటల వల్ల అవతలి వాళ్లు హర్ట్ అవుతారని, అందుకే ఆ మాటలు కంట్రోల్ చేసుకుంటే బెటర్ అని సలహా ఇచ్చింది. నబీల్ గురించి చెప్తూ.. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చి ఇంత బజ్ క్రియేట్ చేయడం గ్రేట్ అని, ఆడే విధానం కూడా సరిచేసుకోమని చెప్పింది. నిఖిల్ టాస్కుల విషయంలో సూపర్ కానీ హౌస్‌లో మాట్లాడే విషయానికొస్తే చాలా ఆలోచిస్తాడని, ఒక హౌస్‌మేట్‌గా తనకు అనిపించింది చెప్పే హక్కు ఉందని, ఇకనైనా మనసులో మాటలు చెప్పమని తెలిపింది రోహిణి.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×