E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్ కు వార్నింగ్ ఇచ్చిన కరుణ 

Nindu Noorella Saavasam Serial Today February 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్ కు వార్నింగ్ ఇచ్చిన కరుణ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

ఆశ్రమంలో కరుణ, రాథోడ్, మిస్సమ్మ ఆలోచిస్తుంటారు. రాథోడ్‌ కోపంగా నాకు ఎందుకో టెన్షన్‌గా ఉంది మిస్సమ్మ.. ఆ మనోహరిని తక్కువ అంచనా వేయడాని వీల్లేదు.. ఎందుకైనా మంచిది రేపు జరిగే హోమాన్ని ఆపేద్దాం.. అనగానే.. లేదు రాథోడ్‌ రేపు మృత్యుంజయ హోమం జరగాలి.. ఆయన పిల్లలతో కూర్చుని హోమం చేయాలి. అది పిల్లలకు మంచిది అని చెప్పగానే.. కరుణ కోపంగా లేచి హోమం వంకతో ఆ మనోహరి మీ ఆయనతో తాళి కట్టించుకోవడానికి రెడీ అయిందని రాథోడ్‌ చెప్తున్నాడు కదా..? అంటుంది. దీంతో మిస్సమ్మ.. అలా ఎలా తాళి కట్టించుకుంటుంది  అని అడగ్గానే.. ఆ మనోహరి తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తుంది మిస్సమ్మ.. మీరు రాక ముందు నుంచే నాకు మనోహరి గురించి బాగా తెలుసు..అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది అంటాడు రాథోడ్‌.

దీంతో మిస్సమ్మ కోపంగా అది ఏం చేస్తుందో నేను చూస్తాను అంటుంది. దీంతో కరుణ కోపంగా ఏం చూస్తవే నువ్వు దాని పెళ్లి చూస్తవా..? నీకైమైనా పాగలా..? అనగానే.. మిస్సమ్మ కోపంగా చెప్పాను కదా కరుణ ఆయన మీద నాకు నమ్మకం ఉంది. మనోహరి తాళి కట్టమంటే ఆయన కడతారా..? ఏంటి..? అని మిస్సమ్మ చెప్పగానే.. రాథోడ్‌ భయంగా తప్పనిసరిగా తాళి కట్టే పరిస్థితి తను తీసుకురావచ్చు కదా మిస్సమ్మ..? అప్పుడు మీరు కదాదు కదా..? సారు కూడా ఏమీ చేయలేరు..? అని రాథోడ్‌ చెప్పగానే.. కరుణ కూడా అవునే నా మాట విను.. రాథోడ్‌ చెప్పినట్టు హోమం ఆపడమే బెటర్‌ అని చెప్పగానే.. మిస్సమ్మ వద్దు కరుణ హోమం జరగాలి. ఆ మనోహరి మూమెంట్‌ ఏంటో మనకు తెలియాలి. శత్రవు ఎలాంటి ఎత్తు వేస్తున్నాడో..?  మనం తెలుసుకున్నప్పుడే ఆ ఎత్తుకు పై ఎత్తు వేయోచ్చు అని చెప్పగానే..

Advertisement

రాథోడ్‌… మిస్సమ్మ ఒకసారి బాగా ఆలోచించు.. జరగరానిది ఏదైనా జరిగితే జీవితాంతం బాధపడాలి అంటూ రాథోడ్‌ చెప్పగానే..మిస్సమ్మ మాత్రం కొన్ని సార్లు రిస్క్‌ తీసుకోవాలి. రేపు మేము కూడా గుడికి వస్తాము.. ఆ మనోహరి ఏం చేస్తుందో చూస్తాం.. అని చెప్పగానే.. రాథోడ్‌ ఆశ్చర్యంగా మీరు గుడికి వస్తారా..? మరి సారు చూస్తే.. అని అడగ్గానే.. మిస్సమ్మ మాత్రం ఆయన చూడకుండా మేనేజ్‌ చేస్తాను.. నువ్వేం టెన్షన్‌ పడకు అంతా నేను చూసుకుంటాను అని మిస్సమ్మ చెప్పగానే.. నీది కాన్ఫిడెంన్సో.. ఒవర్‌ కాన్ఫిడెంన్సో నాకు సమజ్‌ అయితలేదే..? ఆ మనోహరి గురించి నీకు తెలిసి కూడా ఆటలాడుతున్నావు.. అని చెప్పగానే.. స్వార్థంలో చెడు చేయాలనుకుంటున్న మనోహరికే అంత తెగింపు ఉంటే.. నాకెంత తెగింపు ఉండాలి కరుణ..  ఎప్పటికైనా గెలిచేది మంచే.. అని చెప్పగానే.. రాథోడ్‌ ఓకే మిస్సమ్మ మరి నేను బయటుదేరుతాను.. రేపు నువ్వు జాగ్రత్త అంటూ రాథోడ్‌ వెళ్లిపోతుంటే..

మిస్సమ్మ ఒక్క నిమిషం రాథోడ్‌, మనోహరికి నీ మీద డౌటు రాలేదు కదా..? అని అడగ్గానే.. బొత్తిగా డౌటు రాలేదు అని చెప్పలేను.. కానీ కొద్దిగా వచ్చింది మిస్సమ్మ..  అని చెప్పగానే.. కరుణ కోపంగా మనిషివేనా నువ్వు కడుపుకు రైస్‌ తింటున్నావా..? గ్రాస్‌ తింటున్నావా..? నువ్వు అరే ఈ పిచ్చిది నిన్ను నమ్మి ఏజెంట్‌గా పెట్టుకుంటే.. ఓవర్‌ యాక్షన్ చేసి మనోహరికి దొరికిపోతవా..? నీకు కొంచెమైనా దిమాక్‌ పని చేస్తుందా..? అనగానే.. రాథోడ్‌ బాధగా ఏంటి మిస్సమ్మ తను ఇలా తిడుతుంది అనగానే.. తిట్టకపోతే నువ్వు చేసే చారన యాక్టింగ్‌కు దండేసి దండం పెట్టాలా..? ఆ సైతాన్‌ ఆవలిస్తే పేగులు లెక్కపెడతదని ముందే చెప్పిన విన్నావా..? అంటుంది కరుణ.. దీంతో రాథోడ్‌ అయ్యో ఆవిడకు నా మీద పూర్తిగా డౌటు రాలేదని చెప్తున్నాను కదా తల్లి.. అయినా ఇలా తిడతావేంటి అని అడగ్గానే.. కరుణ కోపంగా రేపు గానీ నువ్ఉవ పూర్తిగా దానికి దొరికిపోయినవే అనుకో బొక్కలు విరిచి బొందల గడ్డల పెడతా అంటుంది. దీంతో మిస్సమ్మ కరుణను కూల్‌ చేసి రాథోడ్‌ను అక్కడి నుంచి వెళ్లమని చెప్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×