E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రోడ్డు మీద మిస్సమ్మను చూసిన అమర్ 

Nindu Noorella Saavasam Serial Today February 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రోడ్డు మీద మిస్సమ్మను చూసిన అమర్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:

మిస్సమ్మ రాథోడ్‌కు ఫోన్‌ చేసి బుజ్జమ్మను తీసుకుని రమ్మని అడుగుతుంది. దీంతో రాథోడ్‌.. బుజ్జమ్మ ఇక్కడ పిల్లలతో ఆడుకుంటూ హ్యాపీగా ఉంది మిస్సమ్మ.. తనేం నిన్ను మిస్‌ అవ్వడం లేదులే అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ కానీ నేను మిస్‌ అవుతున్నాను రాథోడ్‌. ఐదేళ్ల పాటు ఆయనకు పిల్లలకు దూరంగా ఉన్న నాకు బుజ్జమ్మే తోడుగా ఉంది. తను నా పక్కన లేకపోతే ఏదోలా ఉంది రాథోడ్‌. బుజ్జమ్మకు అక్కడ అందరూ ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను.. ఏదో తెలియని బాధ మనసును మెలిపెడుతుంది అని ఎమోషనల్‌ అవుతుంటే.. బాధపడకు మిస్సమ్మ తొందరలోనే మీరు సారు అందరూ కలిసిపోతారు. మళ్లీ ఒక్కటిగా ఈ ఇంట్లో సంతోషంగా ఉంటారు అని చెప్పగానే.. మిస్సమ్మ నేను ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను రాథోడ్‌ మాకు పట్టిన గ్రహణం వీడిపోయి ఎప్పుడెప్పుడు అక్కడకు వస్తానా అని ఎదురుచూస్తున్నాను.. అంటూ బాధపడగానే..

రాథోడ్‌ సరే మిస్సమ్మ నేను సారుకు చెప్పి బుజ్జమ్మను తీసుకుని వస్తాను అంటూ కాల్‌ కట్‌ చేసి దీని అంతటికీ కారణం ఈ ఇంటికి పట్టిన ఆ మనోహరే.. ఆ శని గ్రహం దుష్టగ్రహం ఎప్పుడు వీడతాయో.. అనుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు. మరోవైపు బుజ్జమ్మ కోసం బాధపడుతున్న మిస్సమ్మను ఓదారుస్తుంది కరుణ. బుజ్జమ్మను ఆడికి పంపించింది నువ్వే.. మళ్లీ తిరిగి ఈడికి తీసుకురమ్మేది నువ్వే ఏందో ఇది.. అనగానే.. మిస్సమ్మ కన్నపేగే  తట్టుకోలేకపోతున్నాను.. ఇప్పటి వరకు బుజ్జమ్మను విడిచి ఒక్కరోజు కూడా ఉన్నది లేదు.. పేరుకు తను నాకు కూతురే కానీ నాకు మా అక్కతో సమానం. అప్పుడు అక్కను చాలా మిస్‌ అయ్యాను. ఇప్పుడు బుజ్జమ్మను మిస్‌ అవ్వాలంటే ఏడుపు వస్తుంది అంటూ మిస్సమ్మ ఏడుస్తుంది. దీంతో కరుణ ఏందే ఇది బుజ్జమ్మ అమెరికాలో లేదే ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. వాళ్ల నాన్న దగ్గరే ఉందే.. వాళ్ల అన్నయ్యలు, అక్కల దగ్గరే ఉంది. ఈ మాత్రం దానికే ఏడుస్తావా..? అనగానే..

Advertisement

మిస్సమ్మ ఏడుస్తూనే.. బుజ్జమ్మ లేకుండా నేను ఉండలేనే..తనే నా బలం.. తనే నా బలహీనత అంటుంది.  దీంతో కరుణ ఒక్క రెందు దినాలు బుజ్జమ్మ నీతోన లేకుంటేనే ఇంత బాధపడుతున్నావు.. అసువంటిది.. ఐదేళ్ల సంది మీ ఆయనకు నువ్వు బుజ్జమ్మ దూరం అయిండ్రే.. ఆయన ఎంత బాధపడింటాడు.. అంటూ కరుణ ప్రశ్నించగానే.. మిస్సమ్మ ఏడుస్తూనే.. ఆ విషయం నేను ఆలోచించని రోజు లేదు కరుణ.. నేను ఆడదాన్ని కాబట్టి బయటకు ఏడుస్తున్నాను.. పాపం ఆయన మనసులో ఎంత ఏడిసి ఉంటారో.. నేను చాలా పెద్ద తప్పు చేశాను.. అంటుంది. దీంతో కరుణ సరేలే ఊరుకోవే.. ఏడిస్తే పోయింది తిరిగి వస్తుందా..? చెప్పు.. ఈ కష్టాలు కన్నీలు ఎన్నాళ్లు ఉంటాయో చెప్పు.. జల్దిగానే బంద్‌ అయితవిలే.. గుళ్ల అమ్మవారి వేషం వేసినవులే..? ఆ అమ్మవారే నిన్ను కాపాడుతది.. ఇక నేను పోయి రానా..? అనగానే.. మిస్సమ్మ అదొలా చూస్తూంది, దీంతో ఏందో అట్లా చూస్తున్నావు.. ఓ బుజ్జమ్మ వచ్చేదాకా ఉండాలా..? ఒంటరిగా ఉంటానని బాధపడుతున్నావా..? కదా..? సరేలే ఉంటాలే..అనగానే.. నాకేం నీ తోడు అవసరం లేదు.. అంటుంది మిస్సమ్మ.. దీంతో కరుణ అవును అవును ఇప్పుడు నీకు కావాల్సింది. మీ ఆయన తోడు కదా..? సార్‌ తొందరలోనే నా కాడికి వస్తాడులే.. అప్పుడు మీరు ఖుషీగా ఉంటారులే.. అనగానే.. మిస్సమ్మ పోవే అంటుంది.. ఆ పోతాలే అంటూ కరుణ వెళ్లిపోతుంది.

తర్వాత అమర్‌, రాథోడ్‌తో కలిసి కారులో మార్కెట్‌ దగ్గరకు వెళ్తాడు. ఇక్కడ ఎందుకు వెయిట్‌ చేస్తున్నారు సార్‌ అని రాథోడ్‌ అడగ్గానే.. ఇంతకు ముందు కరుణ ఓసారి భాగీ ఇక్కడే చూశాను అని చెప్పింది కదా..? అందుకే ఇక్కడే  వెయిట్‌ చేద్దాం అంటాడు. రాథోడ్‌ కంగారు పడుతుంటాడు. మరోవైపు అమర్‌ కారు వెనకాలే మనోహరి కూడా మిస్సమ్మ కోసం వెయిట్‌ చేస్తుంది. అప్పుడే మిస్సమ్మ ముసుగు వేసుకుని మార్కెట్‌కు వస్తుంది. మిస్సమ్మను గమనించిన అమర్‌ అదిగో రాథోడ్‌ ముసుగు వేసుకుని వస్తుంది చూడు.. ఇంతకు ముందు ఓసారి ముసుగు వేసుకుని ఇంటిదాకా వచ్చి కరుణ ఫ్రెండ్‌ అని చెప్పి తప్పించుకుంది. ఇప్పుడు మళ్లీ ముసుగులో వస్తుంది చూడు అని కారు దిగి రోడ్డుకు అవతలి వైపు వెళ్తున్న మిస్సమ్మ దగ్గరకు వెళ్తుంటాడు. మనోహరి కూడా మిస్సమ్మను చూసి కారులోనే వెళ్తుంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×