E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి నిజం చెప్పిన కరుణ  

Nindu Noorella Saavasam Serial Today February 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి నిజం చెప్పిన కరుణ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

కరుణ వెళ్లి మనోహరి గురించి మిస్సమ్మకు చెప్పగానే.. మిస్సమ్మ భయంతో ఏంటే నువ్వు చెప్పేది అని అడుగుతుంది. దీంతో కరుణ అవునే ఆ మాయల మరాఠీ కొత్త ఎత్తు ఏదో వేసింది. నాకు కాల్‌ చేసి భార్యాభర్తలను కలపడం ఫ్రెండ్స్‌గా మన బాధ్యత అంటూ నీ అడ్రస్‌ చెప్పించడానికి మహానటిలా జీవించేసిందే..? నేను మాత్రం తక్కువ తిన్నానా..?  అది రెండు ఆకులు చదివితే నేను పది ఆకులు చదివిన అది మహానటి  అయితే నేను అంతకు మించి నటించినా నీ గురించి నాకేం తెలియదని చెప్పిన అనగానే.. మిస్సమ్మ కోపంగా దానికి ఫోన్‌ చేయ్‌ అంటుంది. దీంతో కరుణ ఎందుకే అంటుంది. దానికి ఫోన్‌ చేసి నేను చెప్పినట్టు చెప్పు అంటూ తన ప్లాన్‌ చెప్తుంది మిస్సమ్మ..

దీంతో కరుణ ఇప్పుడు ఇదంతా అవసరమావే.. అనగానే.. ఆట దానికే తెలుసని కాదు.. నాకు తెలుసని దానికి తెలియాలి అనగానే.. అది ప్రమాదకరమైన ఆటే. అది పాము లాంటిది. దాంతో చెలగాటాలు ఎందుకు చెప్పు.. అనగానే.. దాని కోరలు పీకి పడగ చితక్కొట్టాలే నువ్వు ఫోన్‌  చేయ్‌ అనగానే.. కరుణ, మనోహరికి ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ లిప్ట్‌ చేసిన మనోహరి చెప్పు కరుణ అంటుంది. దీంతో కరుణ సారీ మనోహరి అంటుంది. మనోహరి దేనికి అంటుంది మనోహరి. భాగీ గురించి తెల్వదు అని నీతో అబద్దం చెప్పినందుకు అంటుంది. దీంతో మనోహరి భాగీ ఎక్కడుందో నీకు తెలుసా..? అని అడుగుతుంది. దీంతో కరుణ అవును ఎక్కడ ఉంటదో తెల్వదు కానీ రోజూ పది గంటలకు కూరగాయలు కొనడానికి మోండా మార్కెట్‌కు వస్తుంది. అని చెప్పగానే.. మార్కెట్‌కు వస్తుందా..? అని అడుగుతుంది. దీంతో కరుణ అవును రెండు మూడు సార్లు దాన్ని గాన్నే చూసిన కానీ తను నన్ను చూడలేదు.. నేను కూడా దాన్ని కలవలేదు.. అని చెప్పగానే..

Advertisement

మనోహరి… నిజంగానే భాగీ రోజూ అక్కడకు వస్తుందా..?  అని అడగ్గానే.. అవును భార్యాభర్తలను కలపాలని నువ్వు నాకు చెప్పావు కదా..? అందుకే నీకు చెప్తున్నాను.. ఈ విషయం నేను అమరేంద్ర సార్‌కు కూడా చెప్పలేదు అంటుంది కరుణ. నాకు చెప్పావు కదా ఇక నేను చూసుకుంటానులే థాంక్స్‌ కరుణ అంటుంది మనోహరి. దీంతో కరుణ ఇట్స్‌ ఓకే మనోహరి నువ్వు ఆ భార్యాభర్తలను కలుపుతాను అన్నావు కదా..? ఆ భార్యాభర్తలు కలిస్తే నాకు అంతే చాలు ఆ అయ్యో ఆల్రెడీ టైం అయిపోతుంది. టెన్‌ కల్లా అక్కడ ఉండాల. లేదంటే భాగీ వెళ్లిపోతుంది అంటూ కాల్‌ కట్‌ చేసి ఇప్పుడేంటే నువ్వు అక్కడకు వెళ్తావా ఏంటి..? అని మిస్సమ్మను అడుగుతుంది కరుణ. పామును పట్టుకోవాలంటే వెళ్లాలి కదా అంటుంది మిస్సమ్మ.. మరోవైపు మనోహరి కూడా కోపంగా ఓసేయ్‌ భాగీ దొరికావే.. చెప్తా నీ సంగతి అనుకుంటుంది. ఇటువైపు కరుణ ఓసేయ్‌ దానితోన కొంచెం జాగ్రత్తనే అంటుంది.

మిస్సమ్మ మాత్రం ఇప్పుడు అది నా తోన జాగ్రత్తగా ఉండాలి అంటుంది. మరోవైపు మనోహరి ఇన్నాళ్లు నువ్వు దూరంగా ఉన్నావని ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటుంది. ఇటువైపు మిస్సమ్మ నన్ను దూరం పెట్టిన దానికి ప్రశాంతత లేకుండా చేస్తాను.. అంటుంది. మనోహరి మాత్రం నువ్ఉవ మళ్లీ దగ్గరకు వచ్చావు నాకు మళ్లీ ప్రాబ్లమ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి.. అనుకుంటే మిస్సమ్మ దాన్ని పాతాళానికి తొక్కి పడేస్తాను అంటే మనోహరి మాత్రం ఈసారి నిన్ను దూరంగా పంపించడం కాదే ఏకంగా పైకే పంపిస్తాను అనుకుంటుంది. మిస్సమ్మ మాత్రం దాన్ని ఆ ఇంటి నుంచి దూరంగా తరిమికొడతాను.. నా ఇంటికి నా భర్త, పిల్లలకు దగ్గర అవుతాను.. అంటే.. మనోహరి ఈరోజు నీకు చావేనే అనుకుంటుంది. మిస్సమ్మ కాసేపట్లో దానికి మూడింది అంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×