Karnataka News: ఈ మధ్యకాలంలో వివాహం తర్వాత చాలామంది మహిళలు తాము కోరుకున్న ప్రియుడితో వెళ్లిపోతున్నారు. కొందరు అడ్డంగా ఉన్న భర్తని చంపేస్తున్నారు. మరికొందరు మూడో కంటికి తెలియకుండా సైలెంట్‌గా వెళ్లిపోతున్నారు. కర్ణాటకలో అలాంటి ఘటన జరిగింది. కాకపోతే తాను చనిపోయానని డ్రామా చేసింది సదరు మహిళ. చివరకు ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికిపోయింది.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఊహించిన ఘటన
కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్‌కు చెందిన 22 ఏళ్ల ప్రియాంకకు చిక్క మంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఇది జరిగి రెండేళ్లు అయ్యింది. వివాహానికి ముందు ప్రియాంక మరొక వ్యక్తి డేవిడ్‌ని ప్రేమించింది. అతడితో జీవితం పంచుకోవాలని భావించింది. భర్త నుంచి వెళ్లిపోవాలని భావించింది. అందుకు తగ్గట్టుగా పక్కాగా ప్లాన్ చేసింది. ఎక్కడా హత్యలకు తావు లేకుండా చేసింది.
భర్తను వదిలించుకుని ప్రియుడితో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టాలని డిసైజ్ అయ్యింది ప్రియాంక. దుండగులు తనను హత్య చేసినట్టు ప్లాన్ చేసింది. ఘటన తర్వాత అందరూ నమ్మితే కొన్నాళ్లకు సర్దుకుంటుందని భావించింది. అందుకు తన ఫ్రెండ్ వివాహాన్ని అనువుగా మార్చుకునే ప్రయత్నం చేసింది.
ప్రియుడి కోసం.. చనిపోయినట్టు డ్రామా చేసిన మహిళ
శుక్రవారం హాసన తాలుకా కల్కెరలో జరుగుతున్న ఫ్రెండ్ పెళ్లికి హాజరైంది ప్రియాంక. వివాహం హడావుడిలో అందరూ ఉండగా స్థానికంగా ఉండే కాల్వగట్టున దుస్తులు, పాదరక్షలు, ఇతర సామగ్రిని వదిలేసి పరారైంది ప్రియాంక. వెళ్లేటప్పుడు ప్రియాంక ఒంటిపై రూ.30 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి.
బంగారం కోసం ఆమెని హత్య చేసి ఉంటారని అంచనా వేసింది. ఉన్నట్లుండి వివాహంలో భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె భర్త. లభించిన ఆధారాలతో లోతుగా విచారణ చేశారు పోలీసులు. తాను చనిపోయినట్టుగా ఓ సీన్ క్రియేట్ చేసింది. ఆమెని చంపి నదిలో పడవేసి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి.
ALSO READ: దొంగతనంలో ఫాస్ట్ ట్రాక్.. బీరువానే ముద్దు అనుకున్న వింత దొంగలు!
బేలూరు బస్టాండ్ వద్ద సీసీకెమెరా ఫుటేజ్‌లో ఆమెని గుర్తించారు. దీంతో ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆమె కునిగల్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. అక్కడ ఓ లాడ్జిలో ఉంటున్నట్లు గుర్తించారు. చివరకు ప్రియాంక, ఆమె ప్రియుడు డేవిడ్ అదుపులోకి తీసుకున్నారు. దీంతో వివాహ వ్యవహారం సేఫ్‌గా ముగింపు లభించింది.