E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమానికి వచ్చిన అమర్   

Nindu Noorella Saavasam Serial Today February 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమానికి వచ్చిన అమర్   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:

 బుజ్జమ్మ సేఫ్‌గా తిరిగి రావడంతో మిస్సమ్మకు మనోహరి మీద డౌటు వస్తుంది.  అప్పట్లో తమ ఇంటి చుట్టు మంత్రగత్తే వేషధారణలో తిరిగిన చంభాను గుర్తు చేసుకుంటుంది మిస్సమ్మ. ఇప్పుడు నాకు మొత్తం అర్థం అయిపోయింది. జాతకాన్ని అడ్డు పెట్టుకుని ఆ మనోహరి నాతో గేమ్ ఆడింది. అయిదేళ్లు ఆ ఇంటికి ఆయనకు పిల్లలకు నన్ను బుజ్జమ్మను దూరం చేసింది. మా అక్కను చంపిన మనోహరికి మంత్రగాళ్లతో పరిచయం ఉండటం పెద్ద విషయం ఏమీ కాదు. ఎవరో మంత్రగాడిని పట్టుకుని అమ్ముపై కుక్కలతో గద్దలతో అటాక్‌ చేయించి నన్ను భయపెట్టింది. పిల్లల మీద నాకున్న వీక్‌ నెస్‌ను అలా క్యాష్‌ చేసుకుంది అని తిడుతుంటే.. పక్కనే ఉన్న కరుణ అదే కదా నేను ముందు నుంచి చెప్తుంది. నువ్వే పట్టించుకోలేదు అంటుంది.

దీంతో మిస్సమ్మ నిన్న ఇవాళ జరిగింది చూశాక నేను నమ్ముతానే.. మనోహరి అమ్మును మేడ పై నుంచి తోసేయాలని చూసి తన గోతిలో తనే పడింది. ఇప్పుడు బుజ్జమ్మపై గద్దతో దాడి చేయించి మళ్లీ తనే ఓడిపోయింది. దానికి బ్యాడ్‌ డేస్‌ నాకు గుడ్‌ డేస్‌ మొదలయ్యాయని నాకు అర్థం అయింది అని మిస్సమ్మ చెప్పగానే.. కరుణ నవ్వుతూ.. అవును భాగీ ఆ ఇంకొక గద్ద యాడికెళ్లి వచ్చింది. సడెన్‌ గా వచ్చి ఆ రాక్షసి గద్దను చండలు చండలు చేసింది. అని అడగ్గానే.. మిస్సమ్మ నాకు తెలియదే.. కానీ నా వెనక ఏదో శక్తి ఉంటుందని మాత్రం నాకు అర్థం అవుతుంది. ఆ శక్తే నన్ను కాపాడుతుంది. ఆ శక్తే బుజ్జమ్మను ఆ ఇంటి దాకా తీసుకెళ్లి ఆయనకు పిల్లలకు దగ్గర చేసింది. నిన్న అమ్ము ఈరోజు బుజ్జమ్మను ఆ శక్తే కాపాడింది. ఆ శక్తి నా వెనక ఉండగా ఇక నేను ఎవ్వరికీ దేనికి భయపడన అనగానే.. కరుణ ఆతృతగా అయితే నీ నెక్స్ట్‌ స్టెప్ ఏంటే బుజ్జమ్మను తీసుకుని మీ ఇంటికి పోతావా..? అని అడగ్గానే..

Advertisement

లేదే ఆయనకు ఇంకా నా మీద కోపం తగ్గలేదు.. నేను ఇప్పుడు వెళ్లి జాతకాల వల్ల దూరం అయ్యానని చెబితే ఇంకా కోప్పడతారు. ఇప్పుడిప్పుడే ఆయన బుజ్జమ్మకు దగ్గర అవుతున్నారే..? బుజ్జమ్మ ఎవరో తెలిస్తే బుజ్జమ్మ కూడా మళ్లొచ్చు. అది తట్టుకోలేను అని చెప్పగానే.. కరుణ కోపంగా అట్ల ఎందుకు అయితదే..? మీ ఆయన నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోడా ఏంటి..? అంటుంది. దీంతో మిస్సమ్మ అర్థం చేసుకుంటారు కానీ అంతకు ముందు మనోహరి దుర్మార్గాల గురించి ఆయనకు తెలియాలి. అక్క మీద గౌరవంతో ఆయన మనోహరిని భరిస్తున్నారు. మనోహరి చెడ్డ తనాన్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ.. ఆయనే మనోహరిని ఇంట్లోంచి గెంటేస్తారు అని చెప్పగానే..

కరుణ కోపంతో ఆ సైతాన్‌ మీ అక్కను చంపేసింది కదా..? గా సాక్ష్యం చాలదా..? అని అడుగుతుంది. సరిపోతుందే కానీ ఆయనకు మనోహరి దుర్మార్గాల గురించి మాటలతో చెప్పకూడదు. సరైన సాక్ష్యాలు చూపించాలి. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టించాలి. అని చెప్పగానే.. కరుణ అయితే ఇప్పుడు ఏం చేస్తావే అని అడగ్గానే.. ఇంకొన్నాళ్లు ఆయనకు దూరంగా బయటే ఉండి ఆ మనోహరి మీద యుద్దం చేస్తాను. నేను కోల్పోయిన ఈ అదేళ్ల కాలాన్ని నా బాధలను కష్టాలను అన లెక్కలేసి ఆ మనోహరికి అంతకు మించిన నరకం చూపిస్తాను అంటూ కోపంగా చెప్తుంది మిస్సమ్మ.  దీంతో కరుణ నువ్వు సూపర్‌ భాగీ నీలో ఇప్పుడు మునుపుటి భాగీని చూస్తున్నాను…అంటూ నవ్వుతుంది.

Advertisement

తర్వాత బుజ్జమ్మను స్కూల్‌కు రెడీ చేసిన మిస్సమ్మ నువ్వు ఈ రోజు అమరేంద్ర సార్‌ వాళ్ల ఇంటికి వెళ్తున్నావు కదా..? కాసేపట్లో తాతయ్య వస్తారు.. నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్తారు అని చెప్పగానే.. బుజ్జమ్మ తాతయ్య తీసుకెళ్లడం ఎందుకు నాకోసం నిన్న ఆయన వచ్చారు.. కదా..? ఈరోజు ఆయన వస్తారు అని చెప్పగానే.. రోజూ ఎందుకు వస్తారు అని మిస్సమ్మ అడగ్గానే.. ఏమో వస్తారు అనిపిస్తుంది. అంటూ బుజ్జమ్మ చెప్పగానే.. అవునా అయితే సరే నీకు పాలు తీసుకొస్తాను ఉండు అంటూ మిస్సమ్మ లోపలికి వెళ్తుంది. ఇంతలో అమర్‌ వస్తాడు. హాయ్‌ బుజ్జమ్మ అని పలకరించగానే.. బుజ్జమ్మ అమర్‌ను చూసి హాయ్‌ అంటూ మెల్లగా నాకు మిల్క్ తెస్తానని మేడం లోపలికి వెళ్లింది. బయటకు వచ్చి మిమ్మల్ని చూస్తే సర్‌ఫ్రైజ్‌ అవుతుంది.  మీరు పక్కన దాక్కోండి అని చెప్తుంది బుజ్జమ్మ దీంతో అమర్‌ పక్కన దాక్కుంటాడు. ఇంతలో మిస్సమ్మ పాలు తీసుకుని బయటకు వస్తుంది. అప్పుడే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×