E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి దగ్గరకు వెళ్లిన అంజు –  అంజును ఫాలో చేసిన ఘోర

Nindu Noorella Saavasam Serial Today January 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి దగ్గరకు వెళ్లిన అంజు –  అంజును ఫాలో చేసిన ఘోర
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : రాథోడ్‌ అంజును గుర్తు చేయగానే.. అందరూ అంజు కోసం వెతుకుతూ తలా ఒకవైపు వెళ్తారు. నిర్మల, శివరాం కంగారు పడుతుంటారు. మరోవైపు రామ్మూర్తి, ఆరు ఫోటో చూస్తూ బాధపడుతుంటాడు. ఎందుకమ్మా ఆ భగవంతుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు అయినా తప్పంతా నాదేనమ్మా.. ఆరోజు నేను మీ నాన్నమ్మ మాట వినకుంటే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు అంటూ ఏడుస్తుంటాడు. భగవంతుడా ఎందుకయ్యా నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు.. బతికి ఉండగానే చంపేశావు కదయ్యా అంటూ నిట్టూరుస్తాడు.

ఇంతలో అంజులో ఉన్న ఆరు వస్తుంది. తాతయ్యా అని పిలుస్తుంది. అంజును చూసి రామ్మూర్తి షాక్‌ అవుతాడు. వెంటనే ఫోటో దాచేస్తాడు. అంజు పాప నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా అని అడగ్గానే.. ఇందాక డాడీతో వచ్చాను అని చెప్తుంది. మరి నువ్వు డాడీతో వెళ్లలేదా అని రామ్మూర్తి అడగ్గానే.. లేదు నీతో ఉండాలని వెళ్లలేదు.. అంటూ రామ్మూర్తిని హగ్‌ చేసుకుంటుంది అంజు. రామ్మూర్తి షాక్ అవుతాడు. ఆరునే హగ్‌ చేసుకున్నట్టు ఫీల్‌ అవుతాడు. ఇప్పటికే చాలా ఏడ్చారు.. ఇంక ఏడ్వకండి.. నేను ఎక్కడికి వెళ్తాను.. మీ పక్కనే ఉన్నాను నాన్నా అంటుంది అంజు. ఆ మాటకు రామ్మూర్తి షాక్‌ అవుతాడు.

Advertisement

ఇంతలో అంజు ఏమైంది తాతయ్యా ఎంటలా చూస్తున్నారు అని అడుగుతుంది. మీ అమ్మలా అనిపిస్తే చూస్తున్నాను అంటాడు. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే.. చెప్పాలని ఉంది తాతయ్య అనగానే ఇదే మాట నా పెద్దకూతురు నోట వినాలని ఉంది అమ్మా కానీ ఎలా అని మనసులో అనుకుంటాడు రామ్మూర్తి. ఇంతలో అంజు మీరు మైండ్‌ లో ఉన్నదంతా పక్కన పెట్టి ఇవాళంతా నేను చెప్పేది వినాలి అంటుంది అంజు. దీంతో సరేలే అమ్మా ముందు ఇంటికి వెళ్దాం పద అని రామ్మూర్తి అనగానే నేను చెప్పినట్టు వినమని చెప్పా అంటూ రేపు కాశీకి వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా ఫాదర్‌ లాంటి వాళ్లు కాబట్టి మా అమ్మకు ఒక చీర కొని ఫోటో దగ్గర పెడతారా..? ఏంటి తాతయ్యా మా అమ్మకు చీర కొనరా..? అని అడుగుతుంది.

ఎందుకు కొననమ్మా కొంటాను.. మంచి చీర కొంటాను.. నా కష్టార్జితంతో కొంటాను అని రామ్మూర్తి చెప్పగానే.. సరే వెళ్దాం పదండి అని రామ్మూర్తిని తీసుకుని ఇంటికి వెళ్తుంది. బయట రోడ్డు మీద ముసుగు వేసుకుని ఘోర చూస్తుంటాడు. ఆత్మను ఎలాగైనా పట్టుకోవాలని వెనకాల ఫాలో అవుతుంటాడు. మరోవైపు గుప్త భయంగా ఆరు గురించి ఆలోచిస్తుంటాడు. మరోవైపు మనోహరి, ఘోరకు ఫోన్‌ చేసి అంజును నువ్వు కిడ్నాప్‌ చేశావా..? అని అడుగుతుంది. ఎందుకు అడుగుతున్నావు మనోహరి అంటాడు ఘోర.  ఎందుకంటే అంజు ఇంట్లో లేదు.. కనిపించడం లేదు అని మనోహరి చెప్తుంది.

Advertisement

అంతమంది ఉన్న ఇంట్లోకి అందరి కళ్లు కప్పి వచ్చి నేను తీసుకెళ్లగలను అనుకుంటావా..? అంటాడు ఘోర. కరెక్టే అమర్‌ కూడా పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నాడు.. మరి అంజలి ఎక్కడుంది అంటుంది మను. ఎక్కడైనా ఉండొచ్చు.. ఇంట్లో ఉండొచ్చు.. బయట ఉండొచ్చు..  నా కళ్ల ముందు కూడా ఉండొచ్చు అంటాడు ఘోర.. దీంతో ఏం మాట్లాడుతున్నావు ఘోర నువ్వు అంజలిని కిడ్నాప్‌ చేశావు కదూ.. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా..? నువ్వు తన పిల్లలను ముట్టుకున్న ప్రతిసారి అమర్‌ నిన్ను ఎలా వెంటాడాడో మర్చిపోయావా..? అంటూ హెచ్చరిస్తుంది.

దీంతో నువ్వేం కంగారు పడిపోకు మనోహరి .. నేను ఇంకా అంజలిని కిడ్నాప్‌ చేయలేదు.. అలా అని సంబరపడిపోకు ఇంకాసేపట్లో అంజలిని కిడ్నాప్‌ చేయబోతున్నాను.. మూడడుగుల దూరంలో ముచ్చటగా ఉంది నా ఆత్మ టైం వేస్ట్‌ చేసేంత టైం లేదు మనోహరి అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది.  రామ్మూర్తి, అంజును తీసుకుని బేకరికీ వెళ్లి స్వీట్లు కొనిస్తాడు. తర్వాత బట్టల షాపుకు తీసుకెళ్లి చీర కొంటుటాడు. మరోవైపు ఇంట్లో అంతా వెతికి ఎక్కడా లేదని అందరూ టెన్షన్‌ పడుతుంటారు. అంజలి ఎక్కడికి వెళ్లలేదు. నేను అంజలిని జాగ్రత్తగా తీసుకుని వస్తాను అంటు అమర్‌, రాథోడ్ బయటకు వెళ్తారు. మరోవైపు బట్టల షాపు బయట ఘోర కాచుకుని ఉంటాడు.

ఇంకోవైపు గుప్త టెన్షన్‌ పడుతుంటాడు. మిస్సమ్మ.. రామ్మూర్తికి ఫోన్‌ చేసి అంజు కనిపించడం లేదని చెప్తుంది. నా దగ్గరే ఉందని రామ్మూర్తి చెప్తాడు. మేము ఇంటి దగ్గర లేమని బట్టల షాపులో ఉన్నామని చెప్తాడు. మరోవైపు అమర్‌ పొద్దునే నేను తిట్టాను అది మనసులో పెట్టుకుని అంటూ అమర్‌ డౌట్‌ పడుతుంటే.. మిస్సమ్మ ఫోన్‌ చేసి అంజు గురించి చెప్తుంది. దీంతో అమర్‌ నేను షాపు దగ్గరకు వెళ్లి తీసుకొస్తాను అంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×