E-Paper
Advertisement

Horoscope today January 15th: ఆ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి

Horoscope today January 15th: ఆ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 15న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. రాజకీయ వర్గాల వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

మిధున రాశి : ఈ రాశి వారు ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సానుకూలమవుతాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలను ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులు మందగిస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఇంటా బయట కొందరు మాటలు మానసికంగా కలచి వేస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×