Anupama Parameswan: ఇండస్ట్రీలోని హీరోయిన్లకు లవ్, ఏఫైర్స్ కామన్.. సినిమాల వల్ల జంటల మధ్య ప్రేమ పుడుతుంది. ఇక ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతారు. కొంతమంది తమ రిలేషన్ ను ఇంకా స్ట్రాంగ్ గా మార్చుకోవడం కోసం పెళ్లి పీటలు ఎక్కుతారు. మరికొంత మంది కొద్ది రోజులు ప్రేమలో ఉండి ఎంజాయ్ చేసి మనస్పర్థలు రావడంతో దూరం అవ్వడం. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఇక హీరోయిన్లు ప్రేమలో విఫలమైన తర్వాత సోషల్ మీడియా వేదికగా వారి సంబంధించిన విషయాలను పంచుకుంటూ రకరకాల ఎమోజీలను పెడుతూ ఉంటారు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తాజాగా అనుపమా పరమేశ్వరన్ ఒక మ్యాగజిన్ ఫోటోషూట్ లో మాట్లాడిన తీరు వింటే మాత్రం ఆమె ప్రేమలో విఫలమైందని అర్థం చేసుకోవచ్చు.. ఇంతకీ అనుపమ మాటలకు అర్థమేంటో తెలుసుకుందాం..
మాళయాలి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలియని వాళ్ళు ఉండరు.. తెలుగు అమ్మాయిల పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి అనుపమ ఈ మధ్యకాలంలో ప్లేట్ ఫిరాయించి బోల్డ్ పాత్రల్లో కూడా నటిస్తోంది. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమాలో ఈమె చేసిన రొమాన్స్ చూసి ఆమె ఫ్యాన్స్ తో పాటుగా ఇండస్ట్రీలోని వాళ్ళు షాక్ అయ్యారు. ఎప్పుడు ఇలా చూడలేదు అంటూ షాక్ అవుతున్నారు. ఇలాంటి పాత్రలు చెయ్యడం చూడలేక పోతున్నాం అంటూ ఫీల్ అవుతున్నారు. ఆ మూవీ వచ్చి చాలా రోజులే అయిన అనుపమ చేసిన పాత్ర పై ఇప్పటికి విమర్శలు ఆగడం లేదు..
ఇదిలా ఉండగా అనుపమ తాజాగా ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ కి వెళ్లి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఈ ఈవెంట్ లో ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావన రావడంతో నేను ఎప్పటికీ ప్రేమిస్తాను అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధం.. నా జీవితం లో అలాంటిది ఎప్పుడు జరగదు.. టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నవారు ఏమీ ఆలోచించకండి వెంటనే పారిపోండి.. అంటూ చెప్పింది. ఇది విన్నటువంటి ఆమె అభిమానులంతా అనుపమ హార్ట్ ను ఎవరో బ్రేక్ చేశారని అందుకే ఈ విధంగా మాట్లాడుతోందని ప్రేమపై పూర్తిగా నమ్మకం పోయిందని చెప్పింది. అయితే గతంలో మాత్రం తాను ఎవ్వరిని ప్రేమించను అని చెప్పింది. ఇక ఈ మధ్య ఈమె గ్లామర్ డోస్ పెంచుతుంది. ఫోటోలను షేర్ చెయ్యడం తో పాటు సినిమాలు కూడా అలాంటివే చెయ్యడంతో ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. ఇక ఈ మధ్య హాట్ లుక్ లో కనిపించడానికే రెడీ అయ్యింది.. ఎలాంటి పాత్రనైనా చేస్తానని చెప్పింది. ప్రస్తుతం ఈమె ఏవో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక టిల్లు క్యూబ్ లో కూడా నటిస్తుందని టాక్.. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియా లో అనుపమ పరమేశ్వరన్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.