E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 3rd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   ఆశ్రమంలో నిజం తెలుసుకున్న రామ్మూర్తి – రెండు రోజుల్లో తెగిపోనున్న ఆరు, అమర్‌ బంధం

Nindu Noorella Saavasam Serial Today January 3rd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   ఆశ్రమంలో నిజం తెలుసుకున్న రామ్మూర్తి – రెండు రోజుల్లో తెగిపోనున్న ఆరు, అమర్‌ బంధం
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  ఆస్తికలు అంజుకు ఇచ్చిన అమర్‌ నాక్కూడా అమ్మను పంపడం అస్సలు ఇష్టం లేదు. కానీ నీకు జ్వరం వస్తే పక్కన లేనని బాధపడుతుంది. నువ్వు సరిగ్గా చదువుకోకపోతే నిన్ను చదివించలేకపోతున్నాను అనుకుని బాధపడుతుంది. అదే ఆస్థికలు కాశీలో కలిపితే అమ్మ తనకు ఇష్టమైన దేవుడి దగ్గరకు వెళ్తుంది. దేవుడితో మాట్లాడి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని దేవుడిని అడుగుతుంది. అమ్మ మంచిది కదా..? అందుకే దేవుడు అమ్మ మాటను కాదనడు. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పగానే అంజు ఆస్థికలు తీసి అమర్‌ తీసుకోండి డాడీ అని ఇస్తుంది. అమ్మను దేవుడి దగ్గరకు పంపి హ్యాపీగా ఉంచుదాము డాడ్‌.. అంటుంది అంజు.

తర్వాత గార్డెన్‌ లో కూర్చున్న ఆరు తనలో తానే నవ్వుకుంటుంది. ఎందుకు బాలిక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అని గుప్త అడగ్గానే.. ఇన్ని రోజుల పడిన కష్టాలు ఒక లెక్క విధి మరీ పుట్‌బాల్‌ అడేసుకుంది అని ఆరు చెప్తుంటే… నువ్వుంటే మానవ జన్మ ఎత్తితి కాబట్టి నువ్వు కర్మ అనుభవించాలి. కానీ నేను ఏం పాపము చేసితిని అంటూ ఆలోచిస్తూ.. జ్ఞప్తికి వచ్చింది. అంటూ ఆరు చేసిన పనులు గుర్తు చేయగానే ఆరు మీకు జ్ఞాపకశక్తి బాగా ఎక్కువగా ఉంది. సరే ఇక్కడ ఉండే మూడు రోజులు బాగా చిల్‌ అవ్వండి తర్వాత ఆలోచిద్దురు అంటుంది ఆరు.

Advertisement

వెంటనే పరుగెత్తుకుని డోర్‌ దగ్గరకు వెళ్తుంది ఆరు. వెనకే గుప్త పరుగెత్తుకొచ్చి చూస్తుంటాడు. మనోహరి వస్తుంది. పైనుంచి అమర్‌ ఆస్తికలు తీసుకుని వస్తాడు. అవి చూసిన మనోహరి ఆస్థికలు అమర్‌ చేతిలో ఉన్నాయేంటి ఎవరు తీసుకున్నారు అని మనసులో అనుకుని దగ్గరకు వెళ్లి అమర్‌ ఆస్తికలు పోయాయి అన్నారు కదా..? ఎవరు తీసుకున్నారు అని అడగ్గానే.. పోలేదు మనోహరి ఇంట్లోనే ఉన్నాయి. అంజు తీసుకుంది అని అమర్‌ చెప్తాడు. అంజు తీసుకుందా.. ఎందుకు అని అడగ్గానే ఎందుకని అలా అడుగతావేంటి మనోహరి. మళ్లీ ఇంకో సారి వాళ్ల అమ్మను దూరం చేసుకోలేకపోయింది.

ఆస్తికలు తన దగ్గర ఉంటే తన తల్లి తనతోనే ఉంటుందేమో అనుకుంది అని శివరాం చెప్తాడు. అవునా అమర్‌ అంటూ అడగ్గానే అవునని అమర్‌ చెప్తాడు. ఏదైతే అయిందిలే.. ఆస్తికలు దొరికాయి.. మూడు రోజులు జాగ్రత్తగా కాపాడితే మళ్లీ గంగలో కలిపేయవచ్చు. ఆరుకు ఘనంగా వీడ్కోలు పలకొచ్చు అంటుంది మనోహరి. సరే నాన్నా అమ్మాయి ఫోటో తీసుకొస్తాను పూజ చేద్దువు కానీ అంటుంది నిర్మల. మనోహరి టెన్షన్‌ పడుతుంది. ఇంతలో అమర్‌ వద్దు అమ్మా అంటాడు. ఎందుకు అమర్‌ అని శివరాం అడగ్గానే.. పిల్లలు బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆరు లేదనే బాధను దాటి బతుకుతున్నారు.

Advertisement

ఇప్పుడు ఆస్తికలు తీసుకొచ్చాక అంజు ఏం చేసిందో తెలుసు కదా.. అంటాడు అమర్‌. మిస్సమ్మ కూడా అవును మామయ్య అంటుంది. దీంతో నిర్మల సరే నాన్నా గదిలోనైనా ఫోటో పెట్టి  దీపం పెట్టు అని చెప్తుంది. అమర్‌ సరే అని ఆస్తికలు తీసుకుని పైకి వెళ్తాడు.   రూంలో ఆరు ఫోటో ముందు నిలబడి ఏడుస్తూ ఇంకో రెండు రోజుల్లో ఆరు అమర్‌ కథ ముగిసిపోతుంది. ఈ ఆరు తోడు లేకుండా అమర్‌ ఏం చేయగలడో తెలియడం లేదు ఆరు. పిల్లలు నేను నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం. నువ్వు ఎక్కడున్నా..? హ్యాపీగా ఉండాలి అంటూ ఎమోషనల్ అవుతాడు. పక్కనే వచ్చి నిలబడి అంతా చూస్తున్న ఆరు ఏడుస్తుంది.

అమ్మఒడి ఆశ్రమానికి వెళ్లిన రామ్మూర్తి పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంచుతుంటాడు. ఆశ్రమంలో ఉన్న ఆయా చూసి బాధపడుతుంది. అరుందతి గురించి ఏమీ చెప్పొద్దని అమర్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని సైలెంట్‌ గా ఉండిపోతుంది. ఆశ్రమంలో టీచర్‌ వచ్చి ఎందుకు మేడం అంత డల్లుగా ఉన్నారు అని అడగ్గానే..   ఆయన కూతురు గురించి తనకు తెలుసని.. కానీ ఆ విషయం ఈయనకు చెప్పొద్దని అమరేంద్రకు మాటిచ్చానని చెప్తుంటే రామ్మూర్తి వింటాడు. లోపలికి వచ్చి మీరు చెప్పేది నిజమా మేడం అంటూ ఎమోషనల్‌ అవుతుంటాడు. మా అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఎలా ఉంది..? ఏం చేస్తుంది అని అడిగినా వార్డెన్‌ చెప్పదు. దీంతో రామ్మూర్తి  కోపంగా అమర్‌ తోనే తేల్చుకుంటానని వెళ్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×