E-Paper
Advertisement

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?
Advertisement

 Sudigali Sudheer:టాలీవుడ్ లో హిట్ మెషిన్ గా గుర్తింపు తెచ్చుకొని ఓటమెరుగని దర్శకుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే అలాంటి డైరెక్టర్ కాలర్ పట్టుకొని సుడిగాలి సుధీర్ చెలరేగిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు సుడిగాలి సుధీర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకునేంత గొడవ ఏం జరిగింది? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్..

ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు బుల్లితెర ఆడియన్స్ ను అలరించడానికి టీవీ షోలో కూడా సందడి చేస్తున్నారు. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ అనే కామెడీ స్కిట్స్ ప్రోగ్రాం వస్తుంది. ఇందులో చిన్నపిల్లలతో స్కిట్స్ చేయిస్తూ ఉంటారు. పైగా ఈ షో కి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా.. అనిల్ రావిపూడి, రోజా, శ్రీకాంత్ జడ్జీలుగా కొనసాగుతున్నారు. ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ ఇస్తున్న ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగిందంటే?

Advertisement

ఇందులో ఒక సినిమా సన్నివేశానికి స్పూఫ్ స్కిట్ చేస్తూ.. సుధీర్.. మీ సినిమాలో ఒక వేషం ఇవ్వండి సార్ అని అనిల్ రావిపూడిని అడిగాడు. దానికి అనిల్ రావిపూడి..” సుధీర్ నువ్వు హీరోగా చేసావ్.. మళ్లీ ఫ్రెండ్ పాత్ర చేస్తావా ?”అంటూ షర్టు పట్టుకున్నాడు. అయితే ఇదంతా కామెడీగానే సాగింది.

also read:ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

ఆశ్చర్యంలో శ్రీకాంత్ , రోజా..

Advertisement

ఆ తర్వాత ఇద్దరూ తమ రోల్స్ ని రివర్స్ చేసుకుందామని సుధీర్ చెప్పాడు. సుధీర్ గెటప్ లో ఉన్న అనిల్.. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అనిల్ గెటప్ లో ఉన్న సుధీర్ ని అడిగాడు. దీంతో సుధీర్ చెలరేగిపోయి అనిల్ పై అరిచేసాడు. ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా పర్లేదు సార్ అనిల్ అడిగితే.. ఏయ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటూ డైరెక్ట్ గా అనిల్ రావిపూడి షర్ట్ పట్టుకున్నారు సుడిగాలి సుధీర్ . ఇక దాంతో ఒక్కసారిగా స్క్రీన్ బ్లాక్ అండ్ వైట్ లో చేంజ్ చేశారు. జడ్జ్ స్థానాల్లో ఉన్న శ్రీకాంత్ , రోజా కూడా బ్లాంక్ ఫేస్ తో ఆశ్చర్యపోయారు. అలా ప్రోమోని కాస్త కట్ చేశారు.

 

దీంతో అసలు ఏం జరిగింది అనే విషయం తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇకపోతే తాజాగా చేసిన ఈ స్కిట్ ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసింది. మొత్తానికైతే ఆడియన్స్ ను నవ్వించడానికి అనిల్ రావిపూడి, సుదీర్ గట్టిగానే ప్లాన్ చేశారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×