trinayani serial today Episode: వైకుంఠం పాలు తీసుకుని వెళ్తుంది. ఆ పాలు పాప తాగితే మీ పెద్దమ్మ చాప్టర్ క్లోజ్. పొరపాటున ఆ పాలు చేయి మారితే ఏం జరుగుతుందో చెప్పలేం అంటుంది తిలొత్తమ్మ. అయితే ఏం జరుగుతుందో చూద్దాం పద మమ్మీ అంటాడు వల్లభ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. బయట హాసిని గాయత్రి పాపను ఎత్తుకుని వస్తుంది. హాల్ లో దించి నువ్వు రోజు రోజుకు బరువు పెరుగుతున్నావు ఇలా అయితే నిన్ను మోయడం కష్టం అంటుంది. ఇంతలో వైకుంఠం పాలు తీసుకుని వచ్చి పాలు తాగు పాప అంటూ ఇస్తుంది. తాగనని సైగ చేస్తుంది గాయత్రి. ఎందుకు తాగవు పాప అంటూ వల్లభ అడుగుతాడు. అందులో పౌడర్ కలిపామని పిల్ల గుర్తు పట్టిందా ఏంటి అని మనసులో అనుకుంటాడు.
ఇంతలో నయని వచ్చి ఆకలిగా లేకపోతే పాలు కాదు కదా మంచి నీళ్లు కూడా తాగదు అంటుంది. ఇంతలో హాసిని నీ కూతురిని మోసి నాకు ఆకలిగా ఉంది. ఆ పాలు ఇటువ్వు నేను తాగుతాను అంటూ హాసిని పాలు తీసుకుని తాగుబోతుంటే.. నయని ఆగు అక్కా అంటూ ఆపుతుంది. ఎందుకు చెల్లి అని హాసిని అడగ్గానే.. ఆ పాలు తీసుకొచ్చిన వైకుంఠమే తాగాలి అంటుంది నయని. దీంతో వైకుంఠం భయంగా వల్లభ వైపు చూస్తుంది. నావైపు చూస్తావేంటి..? నాకు కొన్ని ఇస్తావా ఏంటి..? అంటాడు. ఇంతలో నయని పాలు ఎవరు తాగితే వాళ్లు వైకుంఠానికి పోతారు పిన్ని అని చెప్తుంది.
దీంతో విక్రాంత్ పాలలో ఏమైనా కల్తీ ఉందా…? అని అడుగుతాడు. ఏముంటుంది నా మీద అబాండం వేయాలని చూస్తుంది మీ వదిన అంటుంది వైకుంఠం. ఇంతలో నయని కోపంతో వైకుంఠం చెంప పగులగొడుతుంది. అదేంటి త్రినేత్రి నీ మేనత్తను ఎందుకు అలా కొడుతున్నావు అని అడుగుతుంది. దీంతో వల్లభ తాను త్రినేత్రి కాదు నయని అంటాడు వల్లభ. అలా ఎలా చెప్తున్నావురా అంటూ తిలొత్తమ్మ అడుగుతుంది. ఏం లేదు మమ్మీ ఆ పాలలో ఏదో కలిసిందని చెప్తుంది అంటే తను నయని అనేగా అర్తం అంటాడు. దీంతో అందరూ వైకుంఠాన్ని తిట్టి నిజం చెప్పమని అడుగుతారు.
దీంతో నయనికి శక్తి ఉందని చెప్పారు. అది చూద్దామని ఎలకల మందు కలిపి తీసుకొచ్చాను అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో రత్నాంభ నయనిని నువ్వు నాకెందుకు అబద్దం చెప్పావో అర్తం కావడం లేదు. కానీ ఇప్పుడేమో నా కూతురు వైకుంఠం మీదనే నువ్వు చేయి చేసుకున్నావు. కొట్టినందుకు తప్పు అనడం లేదు. కానీ అది తప్పు చేసినందుకు కొట్టావు అప్పుడు నాకు అర్తం అయింది. నువ్వు నా మనవరాలు త్రినేత్రివి కాదు. ఈ ఇంటి కోడలు నయనివి అని తెలిసింది. అంటూ ఏడుస్తుంది రత్నాంభ. అందరూ రత్నాంభను ఓదారుస్తుంటారు. ఇంతోల హాసిని మంచినీళ్లు ఇవ్వగానే.. రత్నాంభ కూల్ అవుతుంది.
వల్లభ, తిలొత్తమ్మ మాట్లాడుకుంటుంటే.. నయని వచ్చి తిడుతుంది. పాలలో విషం కలిపింది మీరేనని నాకు తెలుసు అంటుంది. నువ్వు మమ్మల్నే అనుమానిస్తావని మేము ముందే అనుకున్నాం అంటాడు వల్లభ. మమ్మల్ని అనవసరంగా బ్లేమ్ చేయకు.. పాలల్లో విషం కలిపింది ఆ వైకుంఠం అయితే మమ్మల్ని అంటావేంటి..? అని అడుగుతుంది. వైకుంఠం ఈ ఇంటికి వచ్చి మూడు రోజులు కూడా కాలేదు. ఇదంతా ఆవిడకు ఎలా తెలుస్తుంది..
అంటూ మీరు వైకుంఠాన్ని పావులా వాడుకుంటున్నారు అని నేను గ్రహించాను అనగానే వల్లభ మమ్మీ నో డౌట్ తనే పెద్ద మరదలు అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వగానే వల్లభ చేయి వెనక్కి తిప్పి పట్టుకుంటుంది. నొప్పితో వల్లభ అమ్మా అంటూ ఆరుస్తుంటాడు. ఏయ్ నయని వదులు అంటుంది తిలొత్తమ్మ. దీంతో నీ కొడుకు చెయ్యి నొప్పి పుడితేనే ఇలా మాట్లాడుతున్నావు.. ఇక నా కన్నబిడ్డ ప్రాణాలు పోతే నేను ఎలా బాధపడతాను అంటుంది నయని. ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?