E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today July 28th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను పూల్‌ను చేసిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today July 28th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను పూల్‌ను చేసిన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బెస్ట్‌ కపుల్‌ కాంటెస్ట్‌ దగ్గరకు వెళ్లాక మిస్సమ్మ చూస్తూ నిలబడిపోతుంది. అమర్‌ వెళ్దామా భాగీ అని అడగ్గానే.. మిస్సమ్మే టెన్షన్‌ పడుతూ వచ్చేశా అండి.. ఎవ్వరూ టెన్షన్‌ పడకండి. పెద్ద పెద్ద గేమ్స్‌ ఏమీ ఉండవు. చిన్న చిన్న గేమ్సే ఉంటాయి. మళ్లీ చెప్తున్నాను ఎవ్వరూ టెన్షన్‌ పడకండి అని చెప్తుంటే.. అమర్‌ కోపంగా చూస్తూ ఏయ్‌ లూజ్‌ నువ్వు తప్పా ఎవ్వరూ టెన్షన్‌ పడటం లేదు అంటాడు. దీంతో అవును మీరెందుకు టెన్షన్‌ పడటం లేదు అని మిస్సమ్మ అడుగుతుంది. దీంతో చిత్ర ఎందుకు టెన్షన్‌ భాగీ నువ్వే చెప్పావు కదా అన్ని చిన్న చిన్న గేమ్సే అని ఇంకెందుకు టెన్షన్‌ అటుంది చిత్ర. చెప్పాను కానీ మరీ అంత చిన్నగా.. మరీ అంత సున్నితంగా పెట్టరు కదా..? ఫ్రైజ్‌ మనీ గట్టిగా వచ్చేటప్పుడు కాంపిటీషన్‌ కూడా టఫ్‌గా ఉంటుంది కదా అంటుంది.

దీంతో చిత్ర బావగారు ఫ్లీజ్‌ ఏమీ అనుకోకండి ఇక్కడే ఉంటే భాగీ టెన్షన్‌ పడుతూనే మమ్మల్ని కూడా టెన్షన్‌ పెడుతుంది. నేను వినోద్‌ ముందు వెళ్తాం మీరు మాత్రం తర్వాత రండి. పద వినోద్‌ వెళ్దాం అంటూ ఇద్దరూ వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక మిస్సమ్మ లైట్‌గా టెన్షన్‌ పడుతున్నా అంతే కదండి.. చిత్రనే కదా ఓవర్‌గా రియాక్షన్‌ అవుతుంది. నిజంగా నాకేం అర్థం కావడం లేదండి నాకు నిజంగా టెన్షన్‌ వచ్చేస్తుంది. కాదండి నేను టెన్షన్‌ పడుతున్నానా..? అది కాదండి నాకు.. అంటూ మిస్సమ్మ ఏదో చెప్పబోతుంటే.. అమర్‌, మిస్సమ్మ చేయి పట్టుకుని ఇప్పుడు చెప్పు ఎందుకు టెన్షన్‌ పడుతున్నావు అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ ఈ కాంపిటీషన్‌లో మనం ఎలాగైనా గెలవాలండి. పిల్లలకు మనం హెల్ఫ్‌ చేయాలండి అనగానే మనం గెలుస్తున్నాం.. హెల్ప్ చేస్తున్నాం..అయినా మన మీద మనకు కాన్ఫిడెంట్‌ లేకపోతే ఎలా చెప్పు అంటాడు అమర్‌.

Advertisement

దీంతో మిస్సమ్మ నా మీద నాకు కాన్పిడెంట్‌ ఉందండి కానీ మీ మీదే లేదు అంటుంది. దీంతో అమర్‌ కోపంగా మిస్సమ్మ చేయి వదిలేస్తాడు. దీంతో అలా కాదండి.. నమ్మకం ఉందండి.. నిజంగా ఉందండి.. కానీ.. అని ఏదో చెప్పబోతుంటే అమర్‌ కోపంగా కానీ…ఏంటి..? అని అడుగుతాడు. దీంతో మీరు ఎప్పుడు యుద్దానికి సిద్దంగా ఉన్నట్టు ముఖం అలా పెట్టుకుని ఉంటారు. మిమ్మల్ని చూడగానే భయం వేస్తుంది. సారీ అండి ఏదో కంగారులో నిజాలన్నీ చెప్పేస్తున్నాను. అయినా ఇలా తిరగండి ఇలా ఉండండి.. ఇప్పుడు చూడండి ఎంత క్యూట్‌గా ఎంత అందంగా ఉన్నారో. అంటుంది మిస్సమ్మ. దీంతో అమర్‌ కోపంగా ఇక్కడికి నన్ను గేమ్స్‌ ఆడటానికి తీసుకొచ్చావా..? లేకపోతే నేను కోపిస్టి అని ఫ్రూప్‌ చేయడానికి పిలిపించావా..? అంటూ అమర్‌ అడగ్గానే.. మిస్సమ్మ నవ్వుతూ.. మీరు కోపిస్టి అని నేను ఫ్రూప్‌ చేయడం కాదండి రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు కదా..? అంటే మీరు కోపిస్టి ఏంటండి.. ఏయ్‌ ఎవరు ఎవరు చెప్పు మీరు ఎవరైనా అన్నారా..? సరే సారీ వెళ్దాం పదండి అంటూ అమర్‌ను తీసుకుని లోపలికి వెళ్తుంది మిస్సమ్మ.

లోపలికి వెళ్లిన చిత్ర మను ఇక్కడ ఎవరినో సెట్‌ చేస్తాను అని చెప్పింది ఎవరిని చేసిందబ్బా అని మనసులో ఆలోచిస్తుంది. ఇంతలో వినోద్‌ చిత్ర మనం ఈ కాంపిటీషన్‌ లో పార్టిసిపేట్‌ చేయాలంటావా..? అంటాడు. దీంతో చిత్ర కోపంగా వినోద్‌ ఫ్లీజ్‌ నాకు కోపం తెచ్చింపే మాటలు మాట్లాడకు.. ఒక పని చేయ్‌ మనం ఇక్కడి నుంచి వెళ్లే వరకు అవసరం అయితే తప్పా ఇంక ఏమీ మాట్లాడకు.. నాకు మాత్రం అసలు మాట్లాడకు అని చెప్తుంది. దీంతో వినోద్‌ అది కాదు చిత్ర అన్నయ్య వెనక నిలబడటం తప్పా ఇలా ఎదురు పోటీ పడటం నాకు ఎప్పుడు తెలియదు ఇదంతా నాకు కొత్తగా ఉంది అని చెప్పగానే.. అలా వెనక ఉన్నావు కాబట్టే ఇలా వెనకబడి పోయావు. ముందుకు వచ్చే టైం వచ్చింది.. టైం అంటే గుర్తుకు వచ్చింది.. కాంపిటీషన్‌ స్టార్ట్‌ అయ్యే టైం వచ్చింది. నేను మనుకు కాల్ చేసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఓకే.. అంటూ పక్కకు వెళ్లిపోతుంది చిత్ర. వినోద్‌ అయోమయంగా చూస్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Advertisement

 ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×