BigTV English

AP Govt: ఏపీ చూపంతా లగ్జరీ కార్ల కంపెనీ.. ఇంతకీ ఏ కంపెనీ, తెరవెనుక మంతనాలు

AP Govt: ఏపీ చూపంతా లగ్జరీ కార్ల కంపెనీ.. ఇంతకీ ఏ కంపెనీ, తెరవెనుక మంతనాలు

AP Govt: ఆంధ్రప్రదేశ్‌ని కార్ల పరిశ్రమకు కేరాఫ్‌గా చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా? ఈసారి ఆయన దృష్టి లగ్జరీ కార్లపై పడిందా? ఆ తరహా కార్లు కొనుగోలు చేసేవారు దేశంలో క్రమంగా పెరగడమే ఇందుకు కారణమా? అందుకే ఆయన రోల్స్‌రాయిస్‌ కంపెనీపై ఫోకస్ చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఏపీకి కేవలం సర్వీసు సెక్టార్‌కి మాత్రమే కాకుండా వివిధ పరిశ్రమకు హబ్‌గా మార్చాలని చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోంది. దీనికితోడు కేంద్రప్రభుత్వం నుంచి సపోర్టు ఉండడంతో మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు దృష్టి అంతా లగ్జరీ కార్లపై పడింది.

గత టీడీపీ హయాంలో కియా కార్ల కంపెనీని తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. ఎవరికీ తెలియకుండా తెరవెనుక మంతనాలు సాగించారు.  తాజాగా ఆయన చూపు రోల్స్‌రాయిస్‌ కార్ల కంపెనీ యూనిట్‌పై పడింది. ఏపీలో ఆ తరహా కంపెనీ యూనిట్ పెడితే బాగుంటుందని సీఎం చంద్రబాబు మనసులోకి వచ్చింది. దీని వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.


అసలు విషయానికి వద్దాం.. ఆరురోజుల టూర్‌లో భాగంగా సింగపూర్‌లో పర్యటిస్తోంది చంద్రబాబు టీమ్. ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులతో సమావేశాలు మొదలుపెట్టారు. డయాస్పోరా వేదికగా సీఎం చంద్రబాబుతో ఓ ప్రవాసాంధ్రురాలు ఓవిషయాన్ని బయటపెట్టారు.

ALSO READ: ఏపీలో లూలు మాల్స్ సందడి.. భూమి కేటాయించిన ప్రభుత్వం 

రోల్స్‌రాయిస్‌ కంపెనీలో సీనియర్‌ ఐటీ ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా పని చేస్తున్నానని, ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడటానికి సీఎం చంద్రబాబు కారణమన్నారు.  ఏఐలో క్లౌడ్‌ టీమ్‌ను లీడ్‌ చేస్తున్నట్టు వివరించడంతో ఆమెకు చప్పట్లు కొట్టి అభినందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

రోల్స్‌రాయిస్‌ కంపెనీని ఏపీకి తీసుకురావాలని, దానివల్ల స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ విషయంలో తన వంతు సహకారం చేస్తానని, వచ్చే నాలుగున కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి ఓ ప్రతినిధి రానున్నారు.ఈ విషయంపై ఆయనతో మాట్లాడుతానని ఆమె చెప్పారు. ఇవాళ తాను ఈ వేదికపై మాట్లాడుతున్నానంటే అందుకు సీఎం చంద్రబాబు కారణమని మనసులోని మాట బయటపెట్టారు ఆమె.

రోల్స్-రాయ్స్ అనేది ఓ లగ్జరీ కార్ల బ్రాండ్. ఇది బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ. దీనికితోడు BMW AG అనుబంధ సంస్థ కూడా. భారతదేశంలో రోల్స్-రాయ్స్ కార్లకు మంచి ఆదరణ ఉంది. అత్యంత విలాసవంతమైనవిగా వీటిని పరిగణిస్తారు. అత్యుత్తమ నాణ్యతతో తయారు చేస్తారు. రోల్స్-రాయ్స్ కారు చాలా ఖరీదైనవి కూడా.

దేశంలో రోల్స్-రాయ్స్ కల్లినన్, ఘోస్ట్, స్పెక్టర్, డాన్ వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి కూడా. ఈ కార్లకు కస్టమర్లు సైతం ఉన్నారు. ఏపీ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా ఉంటుంది కూడా. ప్రవాసాంధ్రురాలు ఈ విషయం చెప్పడంతో చంద్రబాబు టీమ్.. ఆ కంపెనీ ప్రతినిధులతో మంతనాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×