Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్, మనోహరిని బయటకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి వస్తాడు. దీంతో మిస్సమ్మ ఇరిటేట్ అవుతూ ఇద్దరు కలిసి ఎక్కడెక్కడ తిరిగారు అంటూ అడగ్గానే.. అమర్ మా విషయాలు మీకెందుకు అని చెప్పగానే.. మిస్సమ్మ కోపంగా అమర్‌ను తిట్టి పైకి వెళ్లిపోతుంది. అమర్ ప్లాన్ ప్రకారం రాథోడ్ చేత నిజం చెప్పించాలని చూస్తాడు. కానీ రాథోడ్ ఏమీ చెప్పకుండా వెళ్లిపోతాడు. అమర్ మాత్రం క్లారిటీగా మనోహరి, మిస్సమ్మల రహస్యం తెలుసుకోవాలని అనుకుంటాడు.
చంభా బయటకు వెళ్లి ఎవరో మంత్రగాడిని కలిసి వస్తుంది. బయటే గుప్త దగ్గర కూర్చుని మాట్లాడుతున్న బుజ్జమ్మకు గుప్త నిజం చెప్తాడు. ఇంట్లోకి వెళ్తున్న చంభాను బుజ్జమ్మ ఆగు చంభా.. ఎక్కడికి వెళ్లి వస్తున్నావు చంభా అనగానే.. చంభా భయంతో ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు బుజ్జమ్మ అని అడుగుతుంది. బుజ్జమ్మ మాత్రం యాదమ్మ అని పిలిచాను అని చెప్తుంది. దీంతో చంభా మనసులో నువ్వు నన్ను చంభా అని పిలిచావే.. నాకు తెలుసు. నా దగ్గర నీ టక్కుటమార వేషాలు అని అనుకుంటుంటే.. బుజ్జమ్మ కోపంగా మనసులో మాట్లాడుకోకు యాదమ్మ లోపల ఏముందో బయటకు కక్కేయ్ లేదంటే బీపీ షుగర్లు వచ్చి పోతావు అనగానే.. యాదమ్మ కోపంగా మనసులో ఇది పిల్లా పిడుగా..? ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అని అనుకుంటుంటే.. బుజ్జమ్మ కోపంగా మళ్లీ మనసులో మాట్లాడుకుంటుంన్నావా..? పైకి మాట్లాడమని చెప్పాను అనగానే.. యాదమ్మ ఏం మాట్లాడాలి అని అడుగుతుంది.
దీంతో బుజ్జమ్మ నువ్వు ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అడిగాను అని చెప్పగానే.. యాదమ్మ కోపంగా ఇదిగో బుజ్జమ్మ నేను మనిషిని కానా..? నాకు పనులు ఉండవా..? నేను ఎక్కడికి వెళ్లాను..? ఏం చేసి వస్తున్నాను అన్ని నీతో చెప్పాలా..? అనగానే.. బుజ్జమ్మ అనుమానంగా నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అనగానే.. యాదమ్మ కూడా నీ గురించి కూడా నాకు తెలిసిపోయిందిలే అంటుంది. దీంతో బుజ్జమ్మ ఏం తెలిసిపోయింది అని అడగ్గానే.. యాదమ్మ అప్పట్లో నువ్వు ఎవరో..? ఇప్పుడు ఎవరో నాకు అంతా తెలిసిపోయింది. నీ పని అయిపోయింది బుజ్జమ్మ అనగానే.. బుజ్జమ్మ నవ్వుతూ.. అప్పుడే ఏమీ చేయలేకపోయావు..? ఇప్పుడేం చేస్తావు..? అనగానే.. ఇప్పుడు చేసేది నేను కాదు నాకంటే పెద్ద వాడు వచ్చాడు. అని యాదమ్మ చెప్పగానే.. బుజ్జమ్మ ఎంత పెద్ద వాడు ఇంత పెద్ద వాడా..? అని అడుగుతుంది. దీంతో యాదమ్మ అక్కడ ఎవ్వరూ లేరు కదా..? అనగానే..
నీ లాంటి పాపిష్టి కళ్లకు ఇలాంటి వాళ్లు కనిపించరులే అని చెప్పగానే.. యాదమ్మ కోపంగా నన్నే పాపిష్టి అంటావా..? రేపు యముడు వస్తున్నాడు నీ పని ఉంటుందిలే అనగానే.. యముడి శిష్యుడే నా పక్కన ఉన్నాడు ఎవడొస్తాడో రమ్మను అంటూ బుజ్జమ్మ వార్నింగ్ ఇస్తుంది. దీంతో యాదమ్మ కోపంగా ఇదేగా నీ ధైర్యం రేపు ఎవరోస్తారు నువ్వే చూస్తావు అంటూ లోపలికి వెళ్లిపోతుంది. బుజ్జమ్మ కోపంగా చూస్తుంది. అప్పుడే గుప్త ఏమిటి బాలిక నీ ధైర్యం ఆ ప్రచండుడు ముంచుకొస్తుంటే.. ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు అని అడగ్గానే.. బుజ్జమ్మ మీరు ఉండగా నాకెందుకు భయం అని చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.