E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today June 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అనామిక బాడీలోంచి బయటకు వచ్చిన ఆరు

Nindu Noorella Saavasam Serial Today June 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అనామిక బాడీలోంచి బయటకు వచ్చిన ఆరు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అనామిక వెళ్లి అమర్ తో తాను జాబ్‌ మానేస్తున్నానని ఇక్కడి నుంచి వెల్లిపోతున్నాని చెప్తుంది. అందరికీ సెండాఫ్‌ ఇస్తుంది. పిల్లలు బాధపడుతుంటారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అనామిక పిల్లల దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది. అందరూ భాగీ మాట వినాలని చెప్తుంది. ఇంతలో మనోహరి కలగజేసుకుని అనామిక టైం అవుతుంది కదా ఇక బయలుదేరు అంటుంది. అనామిక మెల్లగా మిస్సమ్మ దగ్గరకు వెళ్లి హగ్‌ చేసుకుని థాంక్స్‌ భాగీ  థాంక్యూ సోమచ్‌ నువ్వు నాకోసం ఏం చేశావో నిజంగా నీకు తెలియదు. ఎప్పటికీ చెప్పుకోలేను కూడా.. థాంక్స్‌. ఒకే ఒక్కసారి అక్కా అని పిలవవా..? అని అడుగుతుంది.

దీంతో మిస్సమ్మ అక్కా అని పిలుస్తుంది. అనామిక ఎమోషనల్‌ అవుతుంది. ఈ జన్మలో కుదరలేదు కానీ వచ్చే జన్మలో కలిసి పుడదాం. నేను అక్క నువ్వు చెల్లి చివరిదాకా కలిసే ఉందాం.. చివరి దాకా అంటుంది. దీంతో మిస్సమ్మ సరే.. నువ్వు ఎందుకు వెళ్లిపోతున్నావో తెలియదు కానీ నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం అక్కా.. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీకో కుటుంబం ఉందని మర్చిపోకు అని మిస్సమ్మ చెప్పగానే.. అనామిక సరే.. జాగ్రత్త పిల్లలు.. ఉంటాను సార్‌ వెళ్లోస్తా భాగీ అంటూ చెప్పి అనామిక అలియాస్‌ ఆరు వెళ్లిపోతుంది. అందరూ భాపడుతుంటారు. మనోహరి మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

గార్డెన్‌లో ఆలోచిస్తూ ఉన్న గుప్తకు యముడు ఆకాశంలో కనిపిస్తూ విచిత్ర అంటూ పిలుస్తాడు. గుప్త కంగారుగా ప్రభువులకు ప్రణామములు  అంటూ పలుకుతాడు. యముడు వెంటనే పౌర్ణమి ఘడియలు మొదలు కానున్నాయి అని చెప్తాడు. దీంతో గుప్త బయలుదేరుతున్నాము ప్రభు బాలిక ఇంట్లోకి వెళ్లింది. వచ్చిన వెంటనే బయలుదేరుతాము అని చెప్తాడు. ఆ నిండు కుండ రత్తడు తిరిగి ఇంటికి వచ్చినాడా అని యముడు అడుగుతాడు. దీంతో గుప్త ఎందులకు ప్రభు అత గాడిని కూడా తీసుకురావలెనా..? అని అడగ్గానే.. యముడు కోపంగా విచిత్ర అంటాడు. భయంతో గుప్త క్షమించండి ప్రభు అతగాడు ఇంకనూ రాలేదు అని చెప్తాడు. యముడు అతగాడు వచ్చేలోపే ఆ బాలికను తీసుకుని బయట పడుము అని హెచ్చరిస్తాడు. గుప్త ఎందులకు ప్రభు అతగాడి రాకకు ఈ బాలికతో మా ప్రమాణమునకు ఏమైనా సంబంధం ఉన్నదా..? అని అడుగుతాడు. ఉన్నది అయినా నీకు చెప్పను మాటలు కట్టిపెట్టి త్వరగా బయలుదేరు అని చెప్పి యముడు వెళ్లిపోతాడు.

మరోవైపు అనామిక అలియాస్‌ ఆరు బయటకు రాగానే వెనకే వచ్చిన మనోహరి అనామిక ఆగు అంటూ దగ్గరకు వచ్చి అనామికను హగ్‌ చేసుకుని ఎన్ని సార్లు కౌగిలించుకున్నా ఇంకోసారి కౌగిలించుకోవాలి అనిపిస్తుంది. నీది ముగిసిపోయిన కథ ఆరు పులిస్టాప్‌ పడిపోయింది. ఇంకా నువ్వు ప్రయత్నించడంలో అర్థమే లేదు. హ్యపీగా పైకి వెళ్లిపో అమర్‌ను పెళ్లి చేసుకుంటున్నప్పుడు పై నుంచి మాత్రమే ఆశీర్వదించు సరేనా.. బై అంటూ వెల్లిపోతుంది మనోహరి అంతా గుప్త గమనిస్తుంటాడు. ఆరు డల్లుగా గుప్త దగ్గరకు వస్తుంది. అనామికకి ఈ ఇంట్లో టైం అయిపోయింది. అరుంధతికి ఈ భూమ్మీద టైం అయిపోయింది. పదండి గుప్త గారు వెళ్దాం అంటుంది ఆరు. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. పైకి వెళ్లి చూస్తున్న మనోహరి హ్యపీగా ఫీలవుతుంది. ఆరు, గుప్త గేటు దగ్గరకు వెళ్లగానే.. చిత్ర గేటు తెరుచుకుని వస్తుంది. ఆరును చూసి ఈ ఇంట్లోకి నా ఎంట్రీని పది రకాలుగా ఊహించుకున్నాను. కానీ ఇలా  నువ్వు దూరం అవుతుంటే.. నేను దగ్గర అవుతానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు అరుంధతి అని చెప్పగానే ఆరు షాక్‌ అవుతుంది.

Advertisement

ఏంటి అలా చూస్తున్నావు.. కమాన్‌ ఆరు మను నీ చావు గురించి నీ అవతారాలు గురించి చెప్పలేదు అనుకున్నావా..? ఎంతైనా మేము ఇప్పుడు తోడి కోడళ్లం అవుతున్నాం కదా అన్ని పంచుకుంటున్నాం.  చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం లేదు ఆరు. నీ మంచితనం అస్సలు నచ్చేది కాదు. అయినా కూడా నీతో ఎందుకు ఫ్రెండ్షిప్‌ చేశానో తెలుసా..? నేను ఎంత ఎదవను అయినా నీకు ఫ్రెండ్ ను కాబట్టి నువ్వు నన్ను కాపాడతావని.. నువ్వు పాపాత్ములు ఉండే ఈ భూమ్మీద ఉండటం కరెక్టు కాదు ఆరు. నువ్వేం బాధపడకు. మా పెళ్లిళ్లు అవ్వగానే నీ పిల్లలను మంచి హాస్టల్‌ చూసి వేస్తాం అని చెప్తుంది. పై నుంచి అంతా గమనిస్తున్న మనోహరి చిత్ర సెండాప్‌ ఇచ్చేసి త్వరగా రా అసలే మనకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పగానే.. చిత్ర వస్తున్నాను.. బై ఆరు అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత గుప్త ఆరును తీసుకుని ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్తాడు.

ఇంతలో యముడు వచ్చి విచిత్ర అని పిలుస్తాడు. గుప్త ప్రభువులకు ప్రణామములు అని చెప్పగానే యముడు వెంటనే ఆ బాలికను ఆ శరీరం నుంచి వేరు ఆత్మను తీసుకుని భూలోకం నుంచి రమ్ము అని చెప్తాడు. గుప్త ఆజ్ఞ  ప్రభు అంటూ బాలిక అని ఆరును పిలుస్తాడు. ఆరు నేను రెడీగా ఉన్నాను గుప్త గారు అని చెప్తుంది. దీంతో గుప్త తన చేతిలో ఉన్న నెమలి పించం మీద మంత్రించి ఆరును పట్టుకోమని చెప్తాడు. ఆరు పట్టుకోగానే అనామిక శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×