OTT Movie : కొచ్చిలోని చీకటి వీధుల్లో… ఒక సీరియల్ కిల్లర్ పోలీసు అధికారులనే టార్గెట్ చేసి, దారుణంగా హత్యలు చేస్తున్నాడు. ఒక క్రిమినాలజిస్ట్ రాత్రిపూట ఒక క్లూను పట్టుకుని ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనిపెడతాడు. అది ఒక భయంకరమైన ఆటకు సంకేతం. ఈ కిల్లర్ ఎవరు? అతని టార్గెట్ ఏంటి ? ఈ రహస్యం అతని జీవితాన్ని ఎలా మార్చబోతోంది? అనే విషయాలు తెలియాలంటే పదండి కథలోకి వెళ్దాం.
స్టోరీలోకి వెళ్తే…
అన్వర్ హుస్సేన్ (కుంచాకో బోబన్) ఒక సైకాలజిస్ట్ అండ్ కన్సల్టింగ్ క్రిమినాలజిస్ట్. కొచ్చి సిటీ పోలీసులతో చేరి, ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి సహాయం చేస్తాడు. ఈ కిల్లర్ పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని, వారి కళ్లు, గుండెలను పీకేసి అత్యంత దారుణంగా హత్యలు చేస్తాడు. అలాగే ఒక ఫిగరిన్ ను ఆ శవాల దగ్గర వదిలేస్తాడు. అన్వర్, తన స్నేహితుడు ACP అనిల్ మాధవన్ (జిను జోసెఫ్), DCP కేథరిన్ మరియా (ఉన్నిమాయ ప్రసాద్) తో కలిసి ఈ కిష్టమైన క్లూలను విశ్లేషిస్తాడు.
ఈ ఇన్వెస్టిగేషన్ లో చనిపోయిన పోలీసుల హత్యలు సైమన్, అరవిందన్ అనే ఇద్దరు సైకోపాథ్‌లతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తుంది. కానీ వాళ్ళు అప్పటికే చనిపోయినట్లు రికార్డులు చెబుతాయి. అన్వర్ ఈ కేసును ఛేదించే కొద్దీ, హత్యలు ఒక వ్యక్తి పర్సనల్ పగ, గతంలోని దుర్మార్గపు సంఘటనలతో సంబంధం కలిగి ఉన్నాయని తెలుసుకుంటాడు. ఈ విచారణ అతన్ని ఒక చీకటి రహస్యంలోకి తీసుకెళ్తుంది.
ఇక్కడ పోలీసు విభాగంలోని అంతర్గత రహస్యాలు, కిల్లర్ సైకోలాజికల్ గేమ్‌లు అతన్ని సవాలు చేస్తాయి. అన్వర్ తనకున్న భయాలను ఎదుర్కొంటూ, ఈ కిల్లర్ ను ఆపడానికి ప్రాణాలను పణంగా పెడతాడు. కానీ పోలీసుల కంటే కిల్లర్ ఎప్పుడూ ఒక అడుగు ముందుంటాడు. ఈ థ్రిల్లర్ సైకోపాత్ మూవీ సైకలాజికల్, సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో అదిరిపోయే ఫీల్ ఇస్తుంది. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు? పోలీసులనే ఎందుకు చంపుతున్నాడు? అతని గతం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మలయాళ థ్రిల్లర్ ను చూడాల్సిందే.
Read Also : పనివాడితో ఓనర్ భార్య… ఐలాండ్ లో ఒంటరిగా ఇదేం పని ?
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు ‘Anjaam Pathiraa’. 2020లో రిలీజ్ అయిన ఈ మూవీ Ahaలో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దానికి ‘Midnight Murders’ అనే టైటిల్ ను పెట్టారు. IMDbలో కూడా ఈ మలయాళ సైకో కిల్లర్ మూవీ 7.9 రేటింగ్ తో అదరగొట్టింది. కుంచాకో బోబన్, షరాఫ్ యూ ధీన్, శ్రీనాథ్ భాసి, ఉన్నిమాయ ప్రసాద్, జిను జోసెఫ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మిధున్ మాన్యుయల్ థామస్ దర్శకత్వం వహించారు.