E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి క్లాస్ తీసుకున్న మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today march 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి క్లాస్ తీసుకున్న మిస్సమ్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మను అమర్‌ హగ్‌ చేసుకోవడం చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అంతా చూసిన యాదమ్మ కూడా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వే నమ్మలేదు. ఇప్పుడు చూడు భాగీ వచ్చింది నీకు అమరేంద్రకు పెళ్లి చేయడానికి కాదు.. అమరేంద్రను మళ్లీ తన వైపుకు తిప్పుకోవడానికి అని చెప్పగానే.. అంతే అంటావా..? అంటుంది మనోహరి. దీంతో యాదమ్మ అంతే అంటాను నీకు డౌటుగా ఉంటే వెళ్లి తననే అడిగి చూడు అంటుంది. అయితే ఇప్పుడే వెళ్లి అడుగుతాను నువ్వు కూడా నాతో రా అంటూ ఇద్దరూ కలిసి రూంలో ఉన్న మిస్సమ్మ దగ్గరకు వెళ్తారు. మనోహరి కోపంగా ఏం చేస్తున్నావు భాగీ నువ్వు అని అడగ్గానే.. మిస్సమ్మ కూల్ గా తల దువ్వుకుంటున్నాను అని చెప్పగానే..

ఇప్పుడు కాదు మేడం ఇందాక ఏం చేశారు అని చెప్పగానే.. నేనేం చేశాను అంటుంది మిస్సమ్మ దీంతో మనోహరి కోపంగా అమర్‌తో రాసుకుని పూసుకుని తిరుగుతున్నావేంటి..? అని అడగ్గానే.. మిస్సమ్మ ఆశ్చర్యంగా నేనా..? అంటుంది. దీంతో చంభా మీరు పడిపోవడం.. సారు పట్టుకోవడం మేము చూశాము అంటుంది.  మనోహరి కూడా నాకు ద్రోహం చేయాలనుకుంటున్నావా..? భాగీ.. నన్ను అమర్‌ను ఒకటి చేస్తానని చెప్పి నువ్వు చేసిన పని ఇదా..? అనగానే.. మిస్సమ్మ కోపంగా అంటే నన్నే అనుమానిస్తున్నావా..? మనోహరి.. నన్నే అనుమానిస్తున్నావా..? అనగానే.. మీరు అలా చేస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. మీరు మనోహరి గారిని బకరాను చేస్తున్నారు. పిచ్చి పుల్లమ్మను చేసి చెవిలో పువ్వు పెడుతున్నారు.. మనోహరి గారు వెర్రి వెంగళమ్మ అవుతున్నారు.. అంటుంది చంభా.. దీంతో మనోహరి కోపంగా నువ్వు ఆపుతావా..? భాగీ అలాంటివి ఏమీ చేయదు అనగానే..

Advertisement

చంభా కూడా అంతే కోపంగా మరి సారుతో ఎందుకు అంత చనువుగా ఉందో అడగండి అనగానే.. మనోహరి చెప్పు భాగీ అమర్‌ను నవ్వు ఎందుకు పట్టుకున్నావు అని అడుగుతుంది. మిస్సమ్మ నేను పట్టుకోలేదు ఆయనే నన్ను పట్టుకున్నారు.. అని చెప్పగానే.. మనోహరి కోపంగా అదే ఎందుకు..? అంటుంది. దీంతో మిస్సమ్మ ఎందుకంటే.. నేను అందంగా ఉంటాను.. ఆకర్షణీయగా ఉంటాను.. ముద్దు ఇస్తాను.. పైగా ఆయన భార్యను ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా..? అంటూ మిస్సమ్మ చెప్పగానే.. చంభా కోపంగా అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం మనోహరి గారు అందంగా ఉండరనా..? చెండాలంగా దరిద్రంగా అసహ్యంగా రేవులో తాటి చెట్టులా ఉంటారనా..? అనగానే.. మనోహరి కోపంగా యాదమ్మా.. భాగీ అన్ని మాటలు అనలేదు.. నువ్వు ఆపు.. భాగీ నువ్వు చెప్పు నాలో ఏం తక్కువ అయిందని.. నీకంటే బాగానే ఉంటాను కదా..? అనగానే..

మిస్సమ్మ పైకి కిందకు చూస్తూ… అని నువ్వు అనుకుంటే సరిపోతుందా..? అంటుంది. దీంతో మరి ఎవరు అనుకోవాలి అని మనోహరి అడగ్గానే.. ఆయన అనుకోవాలి కదా..? అంటుంది మిస్సమ్మ.. దీంతో మనోహరి బాధగా అంటే నేను అందంగా లేనా..? నాలో ఆకర్షణ లేదా..? అంటుంది. దీంతో మిస్సమ్మ నిజం చెప్పాలంటే నువ్వు సరిగ్గా మెయింటెన్ చేయడం లేదు మనోహరి అందం మీద కాంసంట్రేట్‌ చేయడం లేదు.. నన్ను చూడు ఒక బిడ్డకు తల్లిని అయినా ఇంత స్లిమ్‌గా ఎంత స్టైల్‌గా ఉన్నానో.. నువ్వేమో ఈ ముతక చీర కట్టి పాత ముసలమ్మలా ఉన్నావు.. ఇంక నిన్ను ఎవరు చూస్తారు చెప్పు అనగానే.. మనోహరి నేను ఫస్ట్‌ నుంచి ఇలాగే ఉన్నాను కదా ఇంకెలా ఉండాలి అని అడగ్గానే.. మిస్సమ్మ ఫ్యాషన్‌ గా ఉండాలి.. ట్రెండీగా ఉండాలి. మోడ్రన్‌ డ్రవెస్‌ వేసుకోవాలి. టిప్‌ టాప్‌ గా రెడీ అవ్వాలి అంటూ మిస్సమ్మ  చెప్పగానే..

Advertisement

మనోహరి డల్లుగా కానీ అమర్‌కు అలా ఉండటం నచ్చదు కదా అని అడుగుతుంది.  అని ఎవరు చెప్పారు అని మిస్సమ్మ అడగ్గానే.. అమర్‌కు శారీస్‌ అంటేనే ఇష్టం అంటుంది మనోహరి. దీంతో మిస్సమ్మ ఒక్కసారి మోడ్రన్‌గా రెడీ అయి ఆయనకు కనిపించి చూడు నచ్చుతావో లేదో తెలుస్తుంది అని చెప్పగానే.. మనోహరి అంతే అంటావా..? అని అడుగుతుంది. ట్రై చేయడంలో తప్పు లేదు మనోహరి ఇదంతా నేను నీ కోసమే చెప్తున్నాను.. ఆయన దృష్టి నా మీద నుంచి నీ మీదకు మళ్లాలి అంటే నీలో సమ్‌థింగ్ చేంజ్‌ ఉండాలి. నువ్వు స్పెషల్‌ గా ఉండాలి అన ఇచెప్పగానే.. సరే భాగీ నువ్వు అన్నట్టు నేను మోడ్రన్‌గా రెడీ అయి అమర్‌కు కనిపిస్తాను అంటూ మనోహరి వెళ్లిపోతుంది.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×