E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని కిడ్నాప్ చేసిన రణవీర్

Nindu Noorella Saavasam Serial Today march 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని కిడ్నాప్ చేసిన రణవీర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మ చెప్పడంతో మనోహరి మోడ్రన్‌ డ్రెస్‌ వేసుకుని వస్తుంది. యాదమ్మ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నానని అడుగుతుంది. మోడ్రన్‌ డ్రెస్‌లో మనోహరిని చూసిన యాదమ్మ కళ్లు తేలేస్తూ.. దిష్టి బొమ్మలా ఉన్నావని చెబితే ఏడిసి చస్తుందేమో..? అని మనసులో అనుకుంటుంది. దీంతో మనోహరి ఏంటి చంభా నా అందం చూసి నోట్లోంచి మాట రావడం లేదా..? అని అడగ్గానే.. చంభా ఇది అందం కాదు మందం అంటుంది. దీంతో మనోహరి కోపంగా ఏయ్‌ చంభా ఏం మాట్లాడుతున్నావు.. అని కోప్పడగానే.. చంభా నువ్వు పదిహేనేళ్ల క్రితం ఇలా తయారయి ఉంటే ముచ్చటగా ఉండేది. ఇప్పుడు ఎబ్బెట్టుగా  ఉంది మనోహరి అంటుంది.

దీంతో మనోహరి కోపంగా ఏయ్‌ గాడిదలకేం తెలుసు గంధపుచెక్కల వాసన అని ఎప్పుడూ స్మశానంలో తిరుగుతూ.. శవాలతో క్షుద్రపూజలు చేసుకునే నీకు నా అందం గురించి ఫ్యాషన్‌ గురించి ఏం తెలుస్తుదిలే అనగానే.. చంభా కోపంగా అలాంటప్పుడు నన్ను అడగడం దేనికో అంటుంది. బుద్ది తక్కువై అడిగాను అంటుంది మనోహరి. దీంతో చంభా మనసులో నిజమే ఈ మధ్య నీ బుద్ది గడ్డి తింటుంది అని అనుకుంటుంటే.. మనోహరి కోపంగా ఏంటి ఏమన్నావు.. అని అడగ్గానే.. చంభా ఏమీ లేదు వెళ్లి అమరేంద్రకు నీ అందం చూపించు.. అందుకేగా ఈ వేషం వేశావు.. అంటుంది. దీంతో మనోహరి సరే అంటూ కిందకు హాల్లోకి వెళ్తుంది.

Advertisement

అక్కడే ఫోన్‌ మాట్లాడుతూ ఉన్న రాథోడ్‌ మనోహరిని చూసి షాక్‌ అవుతాడు. ఎగిరి సోఫాలో పడి గిలా గిలా కొట్టకుంటుంటాడు.. మనోహరి భయంగా రాథోడ్‌ ఏమైంది రాథోడ్‌ అంటూ అడుగుతుంది. రాథోడ్‌ భయంగా భయపెట్టేశారుగా మేడం.. పిల్లలు స్కూల్‌కు వెళ్లారు కాబట్టి సరిపోయింది. అదే వాళ్లు ఇంట్లో ఉండి మిమ్మల్ని చూసి ఉంటే దెబ్బతో జడుసుకుని జ్వరం తెచ్చుకునేవాళ్లు.. అంటాడు.. దీంతో మనోహరి.. రాథోడ్‌ నేను మరీ అంత భయంగా ఉన్నానా..? అని అడుగుతుంది. దీంతో రాథోడ్‌ అది చాలా చిన్న మాట మేడం మీరు అంత కంటే ఎక్కువే ఉన్నారు.. ఎన్నడూ లేనిది ఈ పిచ్చాసుపత్రి వేషం ఏంటండి అని అడగ్గానే.. మనోహరి కోపంగా రాథోడ్‌ మాటలు జాగ్రత్త ఇది ట్రెండ్‌ లుక్‌ అయినా నీకు ఆ యాదమ్మకు అసలు టేస్టే లేదు.. ఇంతకీ అమర్‌ ఎక్కడున్నారు…? అని అడగ్గానే.. రాథోడ్‌ అటూ ఇటూ చూసి మనసులో సారు, మిస్సమ్మతో ఉన్నాడని చెబితే డిస్టర్బ్‌ చేస్తుందేమో. కాసేపు ఈ దిష్టి బొమ్మను ఊరేగిద్దాం.. అనుకుంటాడు..

ఇంతలో మనోహరి రాథోడ్‌ అమర్‌ పైన ఉన్నారా..? తను ఇంకా ఆఫీసుకు వెళ్లలేదు కదా..? అని అడగ్గానే.. రాథోడ్‌ నవ్వుతూ లేదండి సారు బయట ఉన్నారు.. ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నారు.. అని చెప్పగానే.. మనోహరి బయటకు వెళ్తుంది.  అప్పుడే రణవీర్‌ తన కారులో వచ్చి అమరేంద్ర గేటు దగ్గర ఆగుతాడు.. కారులోనే ఉన్న లాయరు.. ఈ టైంలో అమర్‌ ఇంట్లో ఉండడేమో..? ఆఫీసుకు వెళ్లి ఉంటాడేమో అని చెప్పగానే.. రణవీర్‌ కోపంగా చూస్తూ.. నాకు కావాల్సింది కూడా అదే ఆ అమరేంద్ర ఇంట్లో లేని టైంలోనే ఆ మనోహరి ఎత్తుకెళ్లగలం అని చెప్తాడు. మరోవైపు ఇంట్లోంచి బయటకు వచ్చిన మనోహరి అమర్‌ ఎక్కడ కనిపించడం లేదు.. బయట ఉన్నాడేమో అనుకుంటూ గేటు దాటి రోడ్డు మీదకు వెళ్తుంది.

Advertisement

మనోహరి రోడ్డు మీదకు రాగానే.. కారులో ఉన్న లాయరు మనోహరిని చూసి సార్‌ అటు చూడండి మనోహరి బయటకు వచ్చింది. అని చెప్పగానే.. రణవీర్‌ మనోహరిని చూసి షాక్‌ అవుతాడు.. చీ దీనికేం పోయే కాలం లాయరు ఇలాంటి డ్రెస్‌ వేసుకుంది అంటాడు.. దీంతో లాయరు కోపంగా మీరు జైళ్లో చిప్పకూడు తింటుంటే తను మాత్రం టింగురంగా అనుకుంటూ రెడీ అయి తిరుగుతుంది సార్‌ అని చెప్తాడు.. వెంటనే రణవీర్‌ కోపంగా చూస్తూ.. డ్రైవర్‌ కారు తన దగ్గర దాకా పోనివ్వు అంటూ దగ్గరకు వెళ్లి మనోహరిని కారులో కిడ్నాప్‌ చేసుకుని వెళ్లిపోతాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×