E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుతో మాట్లాడిన మిస్సమ్మ కడుపులో బేబీ

Nindu Noorella Saavasam Serial Today November 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుతో మాట్లాడిన మిస్సమ్మ కడుపులో బేబీ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:     

మిస్సమ్మ కడుపులో ఉన్న చెల్లి కోసం  అంజు టెడ్డి బేర్‌ తీసుకొచ్చి ఇవ్వడానికి వెళ్తుంది మిస్సమ్మ నిద్రపోతూ ఉంటుంది. అంజు చూసి అయ్యో మిస్సమ్మ నిద్ర పోతుందే.. పర్లేదులే ఈ కొత్త టెడ్డీ బేర్ తెచ్చింది చెల్లి కోసమే కదా..? తనకే ఇద్దాంలే.. బుజ్జి కన్నా అమ్మకుట్టి చూడు నీ కోసం ఏం తెచ్చాను. నువ్వు బయటకు వచ్చాక దీంతోనే ఆడుకోవాలి. నీకు బోలెడన్ని బొమ్మలు కొనిస్తాను. నువ్వు ఏం అడిగినా కొనిస్తాను.. ప్రస్తుతానికి దీంతో ఆడుకో అని చెప్పి టెడ్డిబేర్‌ అక్కడే పెట్టి అంజు వెళ్లిపోతుంటే మిస్సమ్మ కడుపులోని బేబీ అక్కా అని పిలుస్తుంది. ఆ పిలుపు విన్న తిరిగి మిస్సమ్మ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి ఎమోషనల్‌ అవుతుంది. చెల్లి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడావా ఈ విషయం అందరికీ చెప్పాలి అనుకుంటూ బయటకు పరుగెత్తుకుంటూ వెళ్ళి అమ్ము, ఆనంద్‌, ఆకాష్‌ త్వరగా రండి అని పిలుస్తుంది.

అమ్ము ఎక్కడికే అని అడుగుతుంది. రండి చెప్తాను అని అంజు అంటుంది. హోం వర్క్‌ చేసుకుంటున్నాము అంజు అని ఆనంద్ చెప్పగానే.. అది తర్వాత చేసుకోవచ్చు మీరు ఇది మిస్‌ అవ్వకూడదు రండి అని అంజు పిలుస్తుంది. ఏంది మిస్‌ అవ్వకూడదు అంజు అని ఆకాష్‌ అడగ్గానే.. అబ్బా ముందు రండి చెప్తాను అంటుంది అంజు. దీంతో అందరూ సరే పదా అంటూ వెళ్తారు. ముగ్గురిని మిస్సమ్మ రూంలోకి తీసుకెళ్తుంది అంజు.. చూడండి అని చెప్తుంది. మిస్సమ్మ నిద్రపోతుంది కదా… అంటుంది అమ్ము.. నాకు థాంక్స్‌ చెప్పింది అని అంజు అనగానే.. నిద్ర పోతున్న మిస్సమ్మ నీకెలా థాంక్స్‌ చెప్తుంది అని ఆనంద్‌ అడగ్గానే.. చెప్పిందిమిస్సమ్మ కాదు అటు చూడండి అని చూపించగానే.. ఏంటి ఆ టెడ్డి బేర్‌ థాంక్స్‌ చెప్పిందా అని ఆకాష్‌ అడగ్గానే.. ఆ బొమ్మ ఎలా మాట్లాడుతుంది అని అంజు అంటుంది.

Advertisement

అమ్ము.. మరి ఎవరు థాంక్స్‌ చెప్పారే.. అని అడగ్గానే.. మిస్సమ్మ కడుపులో ఉన్న చెల్లి అని అంజు చెప్పగానే.. ముగ్గురు పిల్లలు షాక్‌ అవుతారు. ఇంతలో మిస్సమ్మ నిద్ర లేచి మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. పిల్లలు ముగ్గురు నవ్వుతుంటే.. ఆగండి ఎందుకు అంజును చూసి నవ్వుతున్నారు అని మిస్సమ్మ అడగ్గానే.. అంజు కామెడీ చేస్తుంది మిస్సమ్మ అని అమ్ము చెప్పగానే.. అంజు కోపంగా  నేనే కామెడీ చేయడం లేదు అంటుంది. మిస్సమ్మ నీ కడుపులో ఉన్న బేడీ తనకు థాంక్స్‌ చెప్పిందట.. అని అమ్ము చెప్తుంది. తన ఫ్యాకెట్‌ మనీతో పుట్టబోయే బిడ్డకు కొత్త టెడ్డిబేర్‌ కొనిచ్చింది కదా అందుకే బిల్డప్‌ ఇచ్చింది అని ఆనంద్‌ అనగానే.. మా చెవిలో పూలేం లేవు అంజు..  ఈ జోక్స్‌ అన్ని మీ క్లాస్‌లో తొట్టిగ్యాంగ్‌కు చెప్పు అంటాడు ఆకాష్‌.. దీంతో మిస్సమ్మ ఆగండి అంజు నిజంగా చెల్లి నీతో మాట్లాడిందా..? అని అడగ్గానే.. అవును నిజంగానే మాట్లాడింది మిస్సమ్మ.. నేను టెడ్డిబేర్‌ తీసుకొచి ఇచ్చి వెళ్తుంటే.. థాంక్స్‌ అంజు అన్న బేబీ వాయిస్‌ వినిపించింది.. అది చెప్తుంటే వీళ్లు ఎవ్వరూ నమ్మటం లేదు.. పైగా నవ్వుతున్నారు అని అంజు చెప్పగానే..

మిస్సమ్మ కూడా తాను కింద పడబోతుంటే అమ్మ జాగ్రత్త అని వినిపించిన బేబీ వాయిస్‌ను గుర్తు చేసుకుంటుంది. నిన్న నేను చెప్పినా కూడా ఆయన నమ్మలేదు అని మనసులో అనుకుంటుంది మిస్సమ్మ. ఇంతలో అమ్ము నవ్వుతూ థాంక్స్‌ మాత్రమేనా..? లేక ఇంకేమైనా చెప్పిందా..? అని అడుగుతుంది.  కంగ్రాట్స్‌ కూడా చెప్పిందేమో..? ఎందుకంటే ఆ బేబీ పుట్టాక అంజుకు అక్కగా ప్రమోషన్‌ వస్తుంది కదా..? అంటాడు ఆనంద్‌.. ఇలాంటి స్టోరీస్‌ చెప్పడంలో నువ్వు ఫస్ట్‌ ఉంటావు అంజు అంటాడు ఆకాష్‌.. ఇంతలో అమర్‌ అక్కడికి వస్తాడు. అంజు మాత్రం కోపంగా మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు. అంతే కానీ మీరు నన్ను ఎగతాళి చేయకండి అంటూ తిడుతుంది అంజు. లేదు అంజు చెప్పింది నిజం కడుపులో బేబీ మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటుంది మిస్సమ్మ..

Advertisement

అమర్‌ దగ్గరకు వచ్చి ఏమైంది అంజు అంత సీరియస్‌గా ఉన్నావు అని అడగ్గానే.. అది సీరియస్‌గా కామెడీ చేస్తుంది డాడీ అని అమ్ము చెప్తుంది. మిస్సమ్మ కడుపులో బేబీ తనకు థాంక్స్‌ చెప్పిందట అంటూ ఆనంద్‌ చెప్పగానే.. పొట్ట పగిలే లాగా తెగ నవ్విస్తుంది డాడీ అని ఆకాష్‌ చెప్పగానే అందరూ నవ్వుకుంటారు. దీంతో అమర్‌ ఓ నిన్న మిస్సమ్మకు జాగ్రత్త చెప్పింది.. ఇవాళ అంజుకు థాంక్స్‌ చెప్పిందా..? అని అమర్‌ అడగ్గానే.. అమ్ము ఎవరు డాడీ అని అడుగుతుంది. ఇంకెవరు మన స్వీట్‌ బేబీ అని అమర్‌ చెప్తాడు.. దీంతో ఆనంద్ ఏంటి మిస్సమ్మ బేబీ నీతో కూడా మాట్లాడిందా..? అని అడగ్గానే.. ఇప్పుడు అందరూ బేబీకి హాయ్‌ చెప్పండి అనగానే అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×