E-Paper
Advertisement

Srikakulam Road Accident: లారీని ఢీకొన్న తుఫాన్ వాహనం, ఎగిరిపడిన ప్రయాణికులు, శ్రీకాకుళం జిల్లాలో

Srikakulam Road Accident: లారీని ఢీకొన్న తుఫాన్ వాహనం, ఎగిరిపడిన ప్రయాణికులు, శ్రీకాకుళం జిల్లాలో
Advertisement

Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని తుఫాన్ వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్ లో నలుగురు మృత్యువాతపడ్డారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కి చెందినవారు. శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఎలా జరిగింది?

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలంలోని ఎత్తురాళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తుఫాన్ వాహనం  నుజ్జు నుజ్జు అయ్యింది. ఆ వాహనంలోని ఉన్నవారు మధ్యప్రదేశ్ కి చెందినవారు. వారంతా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఘటన జరిగిన ప్రాంతంలో నలుగురు మృత్యువాతపడ్డారు. చాలామంది గాయపడ్డారు. మృతులు సింగ్ పవార్ (60), విజయ్ సింగ్ తోమర్(65), కుసాల్ సింగ్ (62), సంతోషిభాయ్(62) లుగా గుర్తించారు.  మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Advertisement

లారీని ఢీ కొన్ని తుఫాన్ వాహనం, స్పాట్‌లో నలుగురు మృతి

వాహనాలను పక్కన పెట్టారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా క్లియర్ ఇచ్చారు.  అంబులెన్సులో క్షతగాత్రులను కోటబొమ్మాళి ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనికితోడు పొగమంచు కారణంగా చెబుతున్నారు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.  గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఘటన సమయంలో తుఫాన్ వాహనంలో దాదాపు 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: బయోడీజిల్ బంక్ లో బ్లాస్టర్.. ఇద్దరు స్పాట్‌లో

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×