E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:    మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – మిస్సమ్మ కు అమర్ వార్నింగ్ 

Nindu Noorella Saavasam Serial Today November 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:    మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – మిస్సమ్మ కు అమర్ వార్నింగ్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :   దేవుడిరూంకి వేసిన కర్టెన్‌ చూసిన అమర్‌ కోపంగా ఇది ఎవరు చేశారని అడుగుతాడు. ఎంతో ఎగ్జైంటింగ్ గా నేనే చేశానని మిస్సమ్మ చెప్పి.. ఫస్ట్‌ టైం మనోహరి ఓ మంచి పని చేసింది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో అమర్‌ కోపంగా మిస్సమ్మను తిడుతూ కొట్టబోయి కంట్రోల్‌ అవుతాడు. ఇది ఆరు చీర నా దగ్గర ఉన్న తన జ్ఞాపకం అంటూ ఎమోషనల్‌ అవుతాడు. అందరూ షాక్‌ అవుతారు. ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతారు. అప్పుడే అక్కడకు మనోహరి వస్తుంది.

అయ్యయ్యో ఏం చేశావు మిస్సమ్మ. ఆరు చీరను ఇలా మార్చడానికి నీకు మనసెలా వచ్చింది. అసలు నువ్వు ఆరు చీరను ఎందుకు ముట్టుకున్నావు. అమర్‌ ఆరు వస్తువుల్ని ప్రాణంగా చూసుకుంటాడు. అలాంటిది ఇవాళ నువ్వు ఆరు ప్రాణాలనే ముక్కలు చేశావు కదా మిస్సమ్మ అంటూ ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతుంది. మనోహరి మాటలకు మిస్సమ్మ షాక్‌ అవుతుంది. ఇదే కావాలని తనను ట్రాప్‌లో వేసిందని అర్థం చేసుకుంటుంది. మనోహరి మాట్లాడుతుండగానే శివరాం అడ్డుగా వచ్చి నువ్వు ఆగమ్మా..

Advertisement

అసలే వాడు కోపంగా ఉంటే నువ్వు ఇలా మాట్లాడి వాడి కోపాన్ని ఇంకా పెంచుతావా..? అమర్‌.. మిస్సమ్మ  ఇది తెలియక చేసింది. నిజంగా తెలిస్తే ఇలా చేయదు అని శివరాం సర్ది చెప్పబోతుంటే.. మిస్సమ్మ కూడా సారీ అండి నిజంగా ఇది ఆరు అక్క చీర అని నాకు తెలియదు అని చెప్తుంటే.. అమర్‌ కోపంగా నువ్వు  మాట్లాడకు మిస్సమ్మ నువ్వు చెప్పే ఏ ఎక్సిప్లేషన్‌ నా బాధను, నా కోపాన్ని తగ్గించలేవు. తప్పు చేశావు మిస్సమ్మ చాలా పెద్ద తప్పు చేశావు. సరిదిద్దుకోలేని తప్పు చేశావు. ఈ బాధ విలువ నీకు చెప్పినా అర్థం చేసుకోలేవు అంటూ ఏమోషనల్‌ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు అమర్‌. ఆ చీరను అక్కడి నుంచి తీసేయమని శివరాం, రాథోడ్‌ కు చెప్తాడు. సరేనని ఆ చీరను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాథోడ్‌.

మిస్సమ్మ ఆ చీర తీసుకునే ముందు ఒకసారి నన్ను అడగాలి కదమ్మా.. అంటుంది నిర్మల. సరేలేవే అయిందేదో అయిపోయింది. మిస్సమ్మ ఇదేది మనసులో పెట్టుకోకు. అమర్‌ కోపం నీటి మీద బుడగ లాంటిది అని చెప్పి అక్కడి నుంచి నిర్మల, శివరాం కూడా వెళ్లిపోతారు. ఇక అక్కడే ఉన్న మనోహరి కోపంగా మిస్సమ్మను చూస్తూ.. ఏంటి..? నేనే నీకు ఆ కర్టెన్‌ ఇచ్చానని అమర్‌ కు చెబుదామనుకుంటున్నావా..? చెప్తే నీ తప్పును కప్పిపుచ్చుకుంటున్నావని అనుకుంటాడు కానీ నిజం చెప్తున్నావని అసలు అనుకోడు. ఇంక నీ సామన్లు సర్దేసుకో మిస్మమ్మ. ఈ ఇంట్లో నుంచి అమర్‌ జీవితంలో నుంచి బయటకు వెళ్లాల్సిన టైం వచ్చింది అని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది మనోహరి. ఏడుస్తూ అక్కడే నిల్చున్న మిస్సమ్మ మనోహరి చేసిన మోసాలు గుర్తు చేసుకుంటుంది.

Advertisement

ఇంట్లో జరిగిన సంఘటన చూసిన ఆరు కోపంగా అటూ ఇటూ తిరుగుతూ అసలు ఆ మనోహరి మనిషేనా గుప్త గారు. పాపం మిస్సమ్మను ఆయనతో తిటించింది. ఆయినా ఆయన్ని కాదు ముందు మిస్సమ్మను అనాలి. ఇదంతా మనోహరి పని అని ఒక్కమాట ఆయనకు  చెప్పాలి కదా..? అంటుంది. దీంతో నీ పతిదేవుడు నిజం చెప్పినా.. నమ్మునా..? తను ప్రేమించుచున్న వారి బాధకు తనే కారణం అయినానని ఆ బాలిక ఎంత బాధపడుతుందో తెలుసా..? అంటాడు గుప్త.

దీంతో ఆరు నిట్టూరుస్తూ… ఈ మంచోళ్లు ఉన్నారే.. వీళ్లేప్పుడు ఇంతే గుప్త గారు ముంచే వాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉంటారు. ఇలా నా వల్ల కాదు. మీరు నన్ను వెంటనే పైకి తీసుకెళ్లిపోండి. నేనే చెప్తున్నాను మీరు ఈ మాట కోసమే కదా? నా చుట్టూ తిరిగారు. నేనే చెప్తున్నాను నన్ను పైకి తీసుకెళ్లండి. షాకింగ్‌ గా ఆరునే చూస్తున్న గుప్త నేను ఇప్పుడు తీసుకెళ్లలేననే కదా? నువ్వు అడిగేది. దివ్యమైన గడియల్లో తప్పా నేను నిన్ను పైకి తీసుకెళ్లలేను అని గుప్త అనగానే మరి అన్ని తెలిసి ఆ ఆరును ఎందుకు అడ్డుకోలేపోతున్నాను గుప్తగారు అంటూ బాధపడుతుంది ఆరు.

రాథోడ్‌ ఆరు చీరను తీసుకుని  స్టోర్‌ రూం దగ్గరకు వెళ్లగానే మిస్సమ్మ వచ్చి ఆ చీరను తన చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ.. నిజంగా ఇది ఆరు అక్క చీర అని తెలియదు. ఆ మనోహరి నన్ను నమ్మించి ఇలా మోసం చేసింది అంటూ జరిగిన నిజం రాథోడ్ కు చెప్తుంది మిస్సమ్మ.  రాథోడ్‌ కోపంగా ఆ మనోహరి చేస్తున్న తప్పులకు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తుందని అంటాడు. అనుభవించడం కాదు రాథోడ్‌.. నేను ఆ మనోహరికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాను అంటుంది.

స్కూల్‌ లో పిల్లలు లంచ్‌  చేయడానికి రామ్మూర్తి దగ్గరకు వెళ్లకుండా సెపరేట్‌ గా ఉంటే రామ్మూర్తి వచ్చి ఇవాళ ఎందుకు నా దగ్గరకు రాలేదని అడుగుతాడు. పిల్లలు ఎవ్వరూ పలకరు కోపంగా రామ్మూర్తిని చూస్తుంటారు. రామ్మూర్తి మాత్రం అదేమీ పట్టించుకోకుండా వారితో కలిసి భోజనం చేయడానికి కూర్చోబోతుంటే.. పిల్లలు లేచి అక్కడి నుంచి వెళ్లబోతుంటారు. ఇంతలో రామ్మూర్తి మీరు ఇక్కడే కూర్చోండి నేనే పక్కకు వెళ్తాను అని పక్కకు వెళ్తుంటే బంటి వచ్చి రామ్మూర్తి లంచ్‌ బాక్స్‌ కిందపడేలా చేస్తాడు. రామ్మూర్తి అన్నం మొత్తం కిందపడిపోతుంది. అది చూసిన పిల్లలు కోపంగా బంటి దగ్గరకు వస్తారు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే – నటరాజ్ మాస్టర్!

బిగ్ బాస్ 10పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటరాజ్ మాస్టర్!

కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. వీడియో వైరల్!

బిగ్ బాస్10 చైత్ర రాయ్ ఎలిమినేటెడ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Ninnu Kori Today Episodes: చంద్రకు షాకిచ్చిన డాక్టర్.. గుడ్ న్యూస్ చెప్పిన క్రాంతి.. జగదీశ్వరి ఒప్పుకుంటుందా..?

Karthika Deepam 2Today Episodes:  దీప దెబ్బ అదుర్స్.. జ్యో మాటతో సూరజ్ షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×