BigTV English

KA movie Collection : ‘క’ మూవీ బాక్సాఫీస్ ఊచకోత..ఐదు రోజుల కలెక్షన్స్..?

KA movie Collection : ‘క’ మూవీ బాక్సాఫీస్ ఊచకోత..ఐదు రోజుల కలెక్షన్స్..?

KaKA movie Collection : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా నటించిన మూవీ ‘క ‘.. సస్పెన్స్ పీరియాడిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. రోజు రోజుకు సినిమాకు క్రేజ్ తో పాటుగా కలెక్షన్స్ కూడా భారీగానే పెరుగుతున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన మూవీకి సుజీత్, సందీప్ లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. ఇక ఐదు రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


కిరణ్ అబ్బవరం కేరీర్ లో వరుస ప్లాప్ సినిమాలే ఎక్కువగా పలకరించాయి. ఒక్క ఎస్ఆర్ కల్యాణ మండపం మూవీ ఒకటే పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. ఇక దీపావళి కానుకగా విడుదలైన క మూవీ అతనికి మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఈ దీపావళి అతనికి మంచి వెలుగులు తెచ్చింది. బాక్సాఫీస్ వద్ద క మూవీ కలెక్షన్స్ ను కొల్ల కొడుతుంది. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరోకు క మూవీ భారీ విజయాన్ని అందించింది. డే వన్ నుంచి బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటున్న క మూవీ రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. దీపావళి పండుగ సందర్బంగా విడుదలైన ఇతర సినిమాలతో పోల్చితే.. క మూవీ షోల సంఖ్య చాలా తక్కువ. కానీ, పాజిటివ్ టాక్ రావడం, మౌత్ టాక్ కూడా కలిసిరావడంతో రీసెంట్ గా థియేటర్లను భారీగా పెంచారు. ప్రస్తుతం 500 లకు పైగా స్క్రీన్స్ లలో సినిమా ప్రదర్శించబడుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఐదు రోజులకు గాను ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..

ఇక ఈ మూవీ తొలి రోజు ఇండియన్ బ్యాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల కలెక్ట్ చేయగా.. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టడంతో మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. రెండో రోజు ఇండియన్ బ్యాక్సాఫీస్ రూ.3 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరల్ గా రూ. 6.19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వరల్డ్ వైడ్‌గా సాధించినట్లు సమాచారం. వీకెండ్ కావడంతో ‘క’ మూవీ 3వ రోజు కలెక్షన్ పెరుగుదల కనిపించింది. ఊహించని రేంజ్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.75 కోట్లు కలెక్ట్ చేసి.. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది. ఇక నాలుగో రోజు అదే జోరు కనిపించింది. మరో 4 కోట్లు రాబట్టింది..ఇక ఐదో రోజు కూడా 3 కోట్లకు పైగా రాబట్టింది. దాంతో సినిమా మొత్తంగా 30 కోట్ల గ్రాస్ ను అందుకుందని తెలుస్తుంది సినిమా బాగుందనే టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు సినిమా నెల లోపే వంద కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×