Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థు మర్డర్ జరగడానికి ముందు రోజు రాథోడ్, మిస్సమ్మ కలిసి అనౌన్ నెంబర్ నుంచి అమర్‌కు కాల్ చేసిన విషయం పోలీసులు తెలుసుకుంటారు. అదే విషయం వైజయంతికి చెబితే షాక్ అవుతుంది. రాథోడ్ ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగితే.. ఎవరైనా బెదిరించి చేయించారేమో మేడం అని కానిస్టేబుల్ చెప్తాడు. అలా జరిగి ఉంటే అమర్ కానీ భాగీకి కానీ చెప్పి ఉండాలి కదా అనుకుంటూ వైజయంతి మిస్సమ్మను అనుమానిస్తుంది. ఈ కేసులో నేను ఏదో మిస్ అవుతున్నాను. ఇప్పటి వరకు మనోహరి కోణంలోంచే ఆలోచించాను కానీ మరో కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు అనిపిస్తుంది. రాథోడ్‌ను నేను ఎంక్వైరీ చేస్తాను మీరు మాత్రం నేను చెప్పినట్టు చేయండి అంటూ పోలీసులకు వైజయంతి చెప్తుంటే..
అప్పుడే రాథోడ్ కాల్ చేస్తాడు. అదేంటి నేను రాథోడ్ గురించి ఆలోచిస్తుంటే రాథోడే కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి రాథోడ్ చెప్పు అని అడుగుతుంది. మనోహరి కోల్‌కతా వెళ్తున్న విషయం చెప్తాడు రాథోడ్. కోల్ కతా నుంచి నన్స్ వచ్చారని వాళ్లు మనోహరిని కోల్ కతా తీసుకెళ్తామంటే అమర్ కూడా ఒప్పుకున్నట్టు చెప్తాడు. అయితే మనోహరి విషయం పక్కనకు పెట్టు ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని వైజయంతి అడిగితే.. అమర్ సార్ ఇంట్లోనే ఉన్నానని రాథోడ్ చెప్తాడు. అయితే నువ్వు అక్కడే ఉండు నేను వస్తున్నాను నీతో మాట్లాడాలి అంటూ కాల్ కట్ చేస్తుంది వైజయంతి. రాథోడ్ ఆశ్చర్యపోతాడు. మనోహరి గురించి చెబితే నాతో మాట్లాడాలి అంటుందేంటి అని మనసులో అనుకుంటాడు రాథోడ్.
మనోహరి, నన్స్ తో కలిసి కోల్ కతా వెళ్లేందుకు రెడీ అయి కిందకు వస్తుంది. మనోహరిని తమతో పంపిస్తున్నందుకు అమర్‌కు థాంక్స్ చెప్తారు నన్స్. అమర్, మనోహరికి జాగ్రత్తలు చెప్తాడు. జరిగిన దాని పదే పదే గుర్తు చేసుకుని బాధపడకు ఈ చేదు జ్ఞాపకాలను తుడిచేసుకుని కొత్త జీవితం వైపు అడుగుతు వేయి.. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయ్ అంటూ అమర్ చెప్పగానే.. తప్పకుండా వస్తాను అమర్ ఇది నా ఇల్లు కదా ఎప్పుడైనా వస్తాను అంటుంది. అందుకు భాగీ కౌంటర్‌గా అవును మనోహరి నువ్వు ఈ ఇంటికి ఆడపడుచు లాంటి దానివి నువ్వు ఎప్పుడైనా రావొచ్చు అంటుంది. మనోహరి రీ కౌంటర్‌గా పిల్లలను బాగా చూసుకో నేను లేని లోటు రానివ్వకు అంటే తప్పకుండా మనోహరి అసలు నీ గురించి గుర్తు చేసుకునే విషయమే మర్చిపోయేలా చూసుకుంటాను అంటుంది. తర్వాత మనోహరి అందరికీ బై చెప్పి వెళ్లిపోతుంటే.. చంభా ఏడుస్తుంది. నువ్వు వెళ్లిపోతే ఇల్లు చిన్నబోతుందని మీరు వెళ్లిపోతే ఇల్లు కళ తప్పిపోతుందని అంటే.. అయితే నువ్వు మనోహరికి తోడుగా వెళ్లు యాదమ్మ అంటాడు రాథోడ్. తాను వెళ్తే ఇంట్లో పనులు పిల్లల పనులు ఎవరు చూసుకుంటారు రాథోడ్ అంటుంది చంభా.
అందరికీ బై చెప్పి బయటకు వెళ్లిన మనోహరి ఇంటిని తేరిపారి చూసి త్వరలోనే ఈ కేసు ముగిసిపోవాలి. నేను కేసు నుంచి బయటపడాలి. తిరిగి ఈ ఇంటికి రావాలి. భాగీని తప్పించి అమర్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అనుకుంటూ సిస్టర్ వెళ్దామా అంటే సరే అంటూ నన్ చెప్పగానే.. మనోహరి కారు ఎక్కబోతుంటే.. బయటి నుంచి కారు వస్తుంది. అందులోంచి వైజయంతి దిగుతుంది. వైజయంతిని చూసిన మనోహరి షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం