E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ప్రచండ దగ్గర బంధీలుగా ఉన్న పిల్లుల అదరూ భయపడుతుంటారు. అంజు మాత్రం హనుమాన్‌ నిన్ను బుజ్జమ్మ తీసుకుని వస్తానంటే నేనే వద్దన్నాను సారీ ఇప్పుడు మేము ప్రమాదంలో ఉన్నాము నువ్వే కాపాడాలి అని మొక్కుతుంది. అప్పుడే అమర్‌ ఇంట్లో ఉన్న హనుమాన్‌ విగ్రహంలోంచి మెరుపు వస్తుంది. అది ఫారెస్ట్‌లోకి వెళ్తుంది. ఆ మెరుపులోంచి ఒక కోతి బయటకు వస్తుంది. పిల్లలను బంధించిన బంగ్లా దగ్గర బయట కూర్చుని ఉంటుంది. అప్పుడే మనోహరి అక్కడకు వెళ్తుంది.

బంధీలుగా ఉన్న పిల్లలను మిస్సమ్మను చూస్తుంది. హమ్మయ్య ప్రచండ తన పని మొదలు పెట్టాడు. ఇక నేను కూడా ఆ భాగీని చంపేసి అమర్‌ వచ్చే లోపు ఇక్కడి నుంచి వెళ్లిపోతే నా కోరిక తీరుతుంది అని మనసులో అనుకుంటుంది. అప్పుడే దూరంగా అమర్‌ రావడం గమనిస్తుంది. ఎలాగైనా అమర్‌ ఈ బంగ్లా చూడకుండా డైవర్ట్‌ చేయాలి అనుకుని దగ్గరకు వెళ్తుంది. మనోహరిని చూసిన అమర్‌ పిల్లల జాడ తెలిసిందా అటువైపు అని అడిగితే.. లేదు అమర్‌ అటువైపు కొండలు తుప్పలు తప్ప ఏం లేదు.. నువ్వు ఇటు వైపు వెళ్లు నేను అటువైపు వెళ్లాను అని చెప్పగానే.. అమర్‌ సరే అంటూ మనోహరి చెప్పిన వైపు వెళ్తాడు. అమర్‌ వెళ్లగానే.. మనోహరి హ్యాపీగా హమ్మయ్య అమర్‌ను డైవర్ట్‌ చేశాను. ఇక వెళ్లి త్వరగా భాగీని చంపాలి అనుకుంటూ వెళ్లబోతుంటే.. కోతి అడ్డుగా వస్తుంది. మనోహరిని బెదిరిస్తూ.. ఫారెస్ట్‌లోకి తరిమేస్తుంది. కోతి దెబ్బకు పరెగెత్తుతూ మనోహరి ముళ్ల పొదల్లోకి వెళ్లి ఇరుక్కుపోతుంది. అక్కడి నుంచి బయటకు రాలేక మనోహరి ఇబ్బందిపడుతుంది.

Advertisement

ఇక కోతి బంగ్లాలోకి వెళ్తుంది. కోతి బంగ్లాలోకి రావడం చూసిన అంజు సంతోషంగా మిస్సమ్మ హనుమాన్‌ వచ్చాడు.. మన కోసం బుజ్జమ్మను కాపాడటం కోసం అని చెప్పగానే.. అందరూ కోతిని చూసి నమస్కరిస్తారు. మిస్సమ్మ హనుమాన్‌ శ్లోకం చెప్తుంటే అందరూ కోరస్‌ పాడుతుంటారు. అందరూ శ్లోకం పాడటం విని కాద్రా బయటకు వస్తాడు. ఎందుకు అరుస్తున్నారు అంటూ తిడుతూ కోతిని చూసి భయంతో ప్రచండ పూజ చేస్తున్న దగ్గరకు వెళ్తాడు. హనుమంతుడు వచ్చాడని బుజ్జమ్మను తీసుకెళ్తాడని చెప్పగానే.. తనకు బేతాళుడు ఇచ్చిన వరం ఉందని తాను గీసిన సర్కిల్‌ లోకి మనుషులే కాదు దేవుడు కూడా వెళ్లలేడని కాబట్టి ఇంకొద్ది సేసట్లో బుజ్జమ్మ శక్తులు వశం చేసుకోబోతున్నానని చెప్తాడు ప్రచండ.

బుజ్జమ్మ రూంలోకి వెళ్లిన కోతిని చూసి బుజ్జమ్మ హ్యాపీగా హాయ్‌ హనుమాన్‌ వచ్చేశా..? నాకోసం వచ్చేశావా అంటుంది. కోతి బుజ్జమ్మ దగ్గరకు వెళ్లబోతుంటే సర్కిల్‌ లోంచి మంటలు వస్తాయి. దాంతో కోతి కూడా బుజ్జమ్మ దగ్గరకు వెళ్లలేక ఆగిపోతుంది. బుజ్జమ్మ భయంగా ఏమైంది హనుమాన్‌ నా దగ్గరకు రా హనుమాన్‌ నన్ను కాపాడు హనుమాన్‌ అంటూ ఏడుస్తూ అడుగుతుంది.  కోతి ఏమీ చేయలేక అలాగే ఉండిపోతుంది.

Advertisement

ప్రచండ మంత్రాలు చదివి బేతాళ అదృష్య శక్తి, దృశ్య యామి ఆత్మ ఆగమయామి అంటూ మంత్రాలు చదవగానే బుజ్జమ్మలోని ఆరు ఆత్మ బయటకు వెళ్తుంది. బుజ్జమ్మ పడిపోతుంది.  అడవిలో ఉన్న అమర్‌ ఏదో జరిగింది నా మనసు ఎందుకు బాధపడుతుంది అనుకుంటాడు. ఆరు ఆత్మ ప్రచండ పూజ చేస్తున్న దగ్గరకు వెళ్తుంది. ఆ ఆత్మను చూసిన ప్రచండ సాధించాను సర్వశక్తిని నా వశం చేసుకుంటాను అంటూ గట్టిగా అరుస్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Podarillu Today Episode : జయంతి తమ్ముడు అవమానం.. చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. జయంతి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×