Podarillu Manisha : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ సీరియల్లో ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్లు వచ్చేసాయి.. ఈ సీరియల్ లో ఇప్పటివరకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. అందులో మనిషా అనే ఒక క్యారెక్టర్ మాత్రం జనాలని బాగా ఆకట్టుకుంటుంది. వచ్చి రాణి తెలుగులో ఆమె మాట్లాడే మాటలు అందరిని అలరిస్తున్నాయి.. ఒకప్పుడు కేవలం సీరియల్స్ అంటే తెలుగు వాళ్ళు కనిపించేవారు కానీ ఈ మధ్య తెలుగు వాళ్ళ కన్నా వేరే భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులే తెలుగులో కనిపిస్తున్నారు. అలా తెలుగు సీరియల్స్లలో పరిచయం అవుతున్న హీరోయిన్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. పొదిరిల్లు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన మనీషా అలియాస్ సుస్మిత గురించి రోజుకు వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అదేగా ఈ అమ్మడి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో జనాలు అవాక్కవుతున్నారు.. అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి ఎటువంటి వార్తలు వినిపిస్తున్నాయో కాస్త వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ లో ఇటీవల మాధవ్ కి జోడిగా వచ్చిన ముద్దుగుమ్మ మనిషా గురించి ఇప్పుడు ఓ వార్త షికారు చేస్తుంది. మనిషా బెంగాలీ నుంచి వచ్చిన అమ్మాయి. బన్సీ బాయ్ కి స్వయానా చెల్లెలు.. వీరిద్దరి చూపులు చూస్తుంటే త్వరలోనే ప్రేమలో పడేలా కనిపిస్తున్నారు.. ఈ పాత్రలో నటిస్తున్న మనిషా అసలు పేరు సుస్మిత.. ఈ అమ్మాయి బెంగాలీ నుంచి వచ్చింది. మోడల్ గా తన కెరీర్ నీ ప్రారంభించిన సుష్మిత ఆ తర్వాత సీరియల్స్లలో నటించే అవకాశాన్ని అందుకుంటూ వచ్చింది. అయితే నటనపై ఇంట్రెస్ట్ ఉన్న ఈ అమ్మడు తన ఆస్తులు ఉన్నా కూడా సీరియల్స్ లో వచ్చిన రెమ్యూనరేషన్ తీసుకుంటూ వస్తుంది. ఈమెకు పశ్చిమ బెంగాల్లో ఈమెకు రెండు సొంత ఇల్లు తో పాటుగా రెండు లగ్జరీ కార్లు.. అలాగే పలు వ్యాపారాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా డబ్బు బంగారం బాగానే ఉన్నాయి అంటూ తెలుస్తుంది. మరి ఈమెకు ఎన్ని ఆస్తులు ఉన్నా సరే ఎందుకు సీరియల్స్ లలో నటిస్తుంది అన్న అనుమానాలు కూడా కొంతమందికి వస్తున్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా నటన మీద ఉన్న ఆసక్తితో చాలా మంది డబ్బున్న ఇంటి నుంచి వచ్చి యాక్టర్స్ గా చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిలతో పోలిస్తే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంతేకాదు వాళ్ళకి రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.. పాత హీరోయిన్లతో పోలిస్తే కొత్త హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వాళ్లు అడిగినదానికంటే ఎక్కువగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ నుంచి అలాగే బెంగాలీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ముద్దుగుమ్మలు ఎక్కువగానే ఉన్నారు. ప్రతిరోజు వీళ్ళకి దాదాపూగా 45 వేల నుంచి 60 వేల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.. ఈ లెక్కను చూస్తే మనీషా కి రోజుకి 40 వేలకు పైగాని రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.. మరి నెలకు లక్షల్లోనే ఈమె సంపాదన ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?