BigTV English

Nindu Noorella Saavasam Serial Today September 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్, మిస్సమ్మ మధ్య రొమాన్స్‌ – మిస్సమ్మను అనుమానించిన ఆరు

Nindu Noorella Saavasam Serial Today September 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్, మిస్సమ్మ మధ్య రొమాన్స్‌ – మిస్సమ్మను అనుమానించిన ఆరు

Nindu Noorella Saavasam Serial Today September 20th: నా ఉంగరం నాకు ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకుంటే నువ్వు ఎప్పటికి ఇక్కడే ఉండేదానికి కదా? ఇప్పుడు నన్ను ఎలా నమ్మావు అని గుప్త, ఆరును అడగ్గానే.. మీరు నాకు బ్రదర్‌ లాంటి వాళ్లు.. నెనెప్పుడూ మిమ్మల్ని నా తొడబుట్టిన అన్నలాగే చూస్తున్నాను. అటువంటి అన్నను ఎవరైనా అనుమానిస్తారా? అంటూ చెప్పి వెళ్లిపోతుంది. ఆరు. దీంతో గుప్త షాక్‌ అవుతాడు. నన్ను సోదరుడిగా భావించి నా మనసును కదిలించావు బాలికా.  అయినా నేను నిన్ను ఈ పౌర్ణమికి మోసం చేయబోతున్నాను. హతవిధి ఎలాంటి సందిగ్ధంలో పడేశావు తండ్రి అంటూ గుప్త బాదపడతాడు.


గుండీతో గుండెల్లోకి దూరతాను

అమర్‌ డ్యూటీకి వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. షర్ట్‌ గుండీ పోయి ఉంటుంది. వెంటనే మిస్సమ్మను పిలుస్తాడు. అట్లకాడ పట్టుకుని వచ్చిన మిస్మమ్మ   ఏం జరిగిందని అడుగుతుంది. తన యూనిఫామ్‌ కు ఉన్న బటన్‌ పోయింది. అమర్‌ చెప్తాడు. అయితే ఇప్పుడే కుట్టి ఇస్తాను మీరు ఆగండి అని పక్కకు తిరిగి దేవుడికి దండం పెడుతూ వినాయకుడికి తాను పూజ చేసింది గుర్తు చేసుకుని దేవుడా? రెండు రోజులు పూజ చేసి ఒక్క కొబ్బరి కాయ కొడితేనే ఇంత మంచి వరం ఇచ్చావా స్వామి. అయినా నువ్వు ఇంత త్వరగా కరుణిస్తావని తెలిస్తే ఈ పని ఎప్పుడో చేసేదాన్ని కదయ్యా.. ఆయన గుండెలపై ఉన్న  గుండీ ఊడేలా చేసి నన్ను ఆయన గుండెల్లో పర్మినెంట్‌ గా సెటిల్‌ చేయాలనే కదా? స్వామి నీ ప్లానూ.. ఇప్పుడు చూడు ఎలా చేస్తానో  అని మనసులో  అనుకుంటూ సంతోషపడుతుంటే.. అమర్‌ వెల్లబోతాడు.


అమర్‌, మిస్సమ్మ మధ్య రొమాన్స్‌

ఆగండి అంటూ గట్టిగా అరుస్తూ.. అమర్‌ ఆపుతుంది మిస్సమ్మ. దీంతో అమర్‌ కోపంగా ఏయ్‌ లూజ్‌ ఎందుకు అంత గట్టిగా అరిచావు అంటూ కోప్పడతాడు. దీంతో మీరు ఎవరు..? ఒక సోల్జర్‌. ఒక లెఫ్టినెంట్‌, ఒక సీనియర్‌, మిమ్మల్ని చూసి జూనియర్స్‌ నేర్చుకుంటారు. పోయింది బటనే కదండి రెండు నిమిషాల్లో  కుట్టేస్తా.. చిటికెలో వెళ్లి చిటికెలో వచ్చేస్తా..  అంటూ వెళ్లి సూది దారం తీసుకుని వచ్చి గుండీ కుడుతుంటే మిస్సమ్మ చేతికి సూది గుచ్చుకుంటుంది. దీంతో అమర్‌ ఏయ్‌ లూజు ఇందుకే వద్దన్నాను అంటాడు. దీంతో ఇదేం కత్తి కాదు మొగుడు గారు. అంటూ మిస్సమ్మ గుండీ కుడుతుంటే.. అమర్‌ రొమాంటిక్‌ గా ఫీలవుతుంటాడు. అప్పుడే రాథోడ్‌ వచ్చి అమర్‌, మిస్సమ్మలను సిగ్గుపడుతుంటాడు. ఇంతలో తేరుకుని టైం అయింది సార్‌ అని చెప్పి వెళ్లిపోతాడు. రాథోడ్‌ మాటలకు అమర్‌, మిస్సమ్మ నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు.

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కలలో కూడా కావ్యని మర్చిపోని రాజ్‌ – స్వరాజ్‌ కు పోటీగా సామంత్‌ ను దింపిన అనామిక

ఘోరను కలిసిన మనోహరి

మనోహరి వెళ్లి ఘోరను కలుస్తుంది. ఇన్ని రోజులు ఏమైపోయావు, ఎక్కడికి వెళ్లావు. ఒక్క కబురు లేదు. మనిషివి లేవు.. అంటూ అడగ్గానే.. ఆ ఆత్మను బంధించడానికి కావాల్సిన కొన్ని శక్తులు సాధించడానికి వెళ్లాను. ఆ ఆత్మ విషయంలో నాకు ఎదురవుతున్న ఎడబాట్లు..  తగులుతున్న ఎదురుదెబ్బలు, మిగులుతున్న  ఓటమి నుంచి ముందుకు అడుగు వేయడానిక సిద్దమవుతున్నాను అంటూ ఘోర చెప్పగానే నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు ఘోర అంటుంది మనోహరి. ఆ ఆత్మను బంధించడానికి ఏర్పాట్లు చేస్తు్‌న్నాను అని చెప్పడంతో మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఇన్ని సార్లు ఓడిపోయాక కూడా మళ్ళీ ప్రయత్నిస్తున్నావా? ఘోర అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో అవును మనోహరి నువ్వు అమరేంద్ర విషయంలో పట్టువదలకుండా ఎలా ప్రయత్నిస్తున్నావో నేను ఆ ఆత్మ విషయంలో అలాగే ఉన్నాను. నీకు అమరేంద్రతో పెళ్లి కావాలి. నాకు ఆ ఆత్మ కావాలి అంటూ ఘోర చెప్తుంటే.. అవును కానీ త్వరలోనే పౌర్ణమి రాబోతుంది. అది ఎవరి శరీరంలోకి వెళ్తుందోనని భయంగా ఉంది అంటుంది మనోహరి. ఎవరి శరీరంలోకో కాదు మనోహరి అది నీ శరీరంలోకి ప్రవేశించాలి. అలా నువ్వే చేయాలి. అప్పుడు దాన్ని బంధించడానికి నాకు ఈజీ అవుతుంది అంటాడు ఘోర. సరే అంటుంది మనోహరి.

రొమాన్స్‌ మూడ్‌ లో దొరికిపోయిన మిస్సమ్మ

మిస్సమ్మ మెలికలు తిరగుతూ.. మురిసిపోతూ కిందకు వస్తుంది. కిటికీలోంచి ఆరు చూసి మిస్సమ్మ ఏంటి ఇలా తిరుగుతుంది అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన నిర్మల, శివరాం కూడా భాగీని  చూసి షాక్‌ అవుతారు. ఎందుకు ఇలా తిరుగుతుందని అనుకుంటారు. ఇద్దరూ కలిసి ఎంత పిలిచినా పలకకుండా భాగీ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్లి ఖాళీ పాత్రల్లో వడ్డించుకుంటుంది.  బయట నుంచి చూస్తున్న ఆరు దగ్గరకు వచ్చి ఎప్పుడూ ఈ గవాక్షం దగ్గరకు వచ్చి అక్కడ ఏమి జరుగుతుందో చూడటమేనా బాలిక అంటాడు గుప్త. అది కాదు గుప్త గారు మిస్సమ్మ ను చూడండి అంటుంది ఆరు. ఇంతలో శివరాం గట్టిగా మిస్సమ్మా అని కేక వేయడంతో భాగీ ఉలిక్కిపడుతుంది.  వెంటనే తేరుకుని ఏంటో చెప్పండి మామయ్యా అని అడుగుతుంది. అదేంటమ్మా అలా మెలికలు తిరిగావు ఏమైంది అని నిర్మల, శివరాం అడగ్గానే అది సరే మామయ్యా మీరు ఎందుకో పిలిచారు టిఫిన్‌ చేస్తారా? అని మిస్సమ్మ అడగ్గానే ఏం లేదు అమ్మా పౌర్ణమి వస్తుంది కదా నువ్వు అమర్‌ గుడికి వెళ్లి పూజ చేస్తారేమోనని నిర్మల చెప్పగానే అయ్యో అత్తయ్యా నాకు పౌర్ణమిని మళ్లీ మళ్లీ గుర్తు చేయకండి అత్తయ్యా అంటూ నిట్టూరుస్తుంది మిస్సమ్మ.    బయట నుంచి గమనిస్తున్న ఆరు పౌర్ణమి అనే మాట వినగానే ఉలిక్కి పడుతుంది. ఈ పౌర్ణమికి ఏదైనా కీడు జరుగుతుందా? గుప్తగారు అంటూ అడుగుతుంది. ఇంతటితో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ ఎండ్‌ అవుతుంది.

Related News

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big Stories

×