BigTV English
Advertisement

Trinayani Serial Today September 20th: ‘త్రినయని’ సీరియల్‌: విశాలాక్షిపై కెమికల్‌ వాటర్‌ చల్లిన తిలొత్తమ్మ భుజంగమణి గురించి గజగండకు చెప్పిన వల్లభ

Trinayani Serial Today September 20th: ‘త్రినయని’ సీరియల్‌: విశాలాక్షిపై కెమికల్‌ వాటర్‌ చల్లిన తిలొత్తమ్మ భుజంగమణి గురించి గజగండకు చెప్పిన వల్లభ

Trinayani Serial Today September 20th: విశాలాక్షి ధ్యానం చేసుకుంటూ కూర్చుని ఉంటుంది. ఇంతలో తిలొత్తమ్మ, సుమన వచ్చి ఓమ్‌ నమః శివాయ అంటూ విశాలాక్షి దగ్గర నిలబడతారు. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. వల్లభ ఏంటి మమ్మీ సడెన్‌ గా భక్తి గుర్తుకువచ్చింది అంటాడు. నేను అడగాల్సింది నువ్వే అడిగావు బ్రో అంటాడు విక్రాంత్‌. ఎవరు అడిగినా నేనే కదా ఆన్సర్‌ చెప్పాల్సింది అని తిలొత్తమ్మ నేను సుమన శివాలయానికి వెళ్లాము అని చెప్తుంది. నన్ను పిలిస్తే నేను కూడా వచ్చేదాన్ని కదా చెల్లి అంటుంది నయని. నువ్వు ఇంటి పనుల్లో బిజీగా ఉన్నావు అంటుంది సుమన. పర్వాలేదమ్మా ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిలా నయని ఇంట్లో ఉంటే పరమేశ్వరుని అనుగ్రహం కోసం గుడికి వెళ్లారు అంటాడు విశాల్‌.


విశాలాక్షి కోసం మోక్ష రసం

ఇంతలో వాళ్లు ఏం తీసుకొచ్చారో అడగండి నాన్నా అంటుంది విశాలాక్షి. తీర్థం తీసుకొచ్చారనుకుంటా? కొంచెం చేతిలో వెయ్యండి వదిన అని దురంధర అడగ్గానే ఇది తీర్థం కాదని మోక్ష రసం అని తిలొత్తమ్మ చెప్పగానే గుడిలో స్వామి పూజ చేశారు. ఇది కుటుంబ సభ్యుల మీద వేస్తే మోక్షం వస్తుందట అని సుమన చెప్పగానే తిలొత్తమ్మ ఇంట్లో ఒక్కోక్కరి మీద మోక్ష రసం వేస్తుంది. విశాలాక్షి మీద కూడా వేయండి అత్తయ్యా అంటూ నయని చెప్పగానే సరే అంటుంది. ఇంతలో విశాలక్షి కోసం తీసుకొచ్చిన కెమికల్‌ వాటర్‌ను దురందర తీసుకుని గాయత్రి పాప మీద చల్లండి అని తీసుకుంటుంది. అది గాయత్రి కోసం కాదు విశాలాక్షి కోసం అని తిలోత్తమ్మ చెప్పగానే..అందరూ విశాలాక్షికి స్పెషలా అంటూ అడుగుతారు. అవునని తిలొత్తమ్మ, విశాలాక్షి మీద చల్లుతుంది. కానీ ఆ వాటర్‌ విశాలాక్షి మీద పడకుండా వల్లభ, సుమన, తిలోత్తమ్మ ల మీద రక్తపు మరకలు పడ్డట్టు పడుతుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో విక్రాంత్‌ అమ్మా విశాలాక్షి ఇది నీ గారడీ కాదు కదా? అని అడగ్గానే లేదని చెప్తుంది. వాళ్లే ఏదో చెడు ఆలోచనలు చేశారు కాబట్టే ఇలా జరిగింది అంటుంది విశాలాక్షి. ఓం నమఃశివాయ అనుకున్నందుకు  ఇంకా ఏం కాలేదు. అంటూ వాళ్లకు చెప్తూ.. నయనికి కుంకుమ ఇస్తుంది. ఇది అవసరానికి ఉపయోగపడుతుంది అని చెప్తుంది విశాలాక్షి.


విక్రాంత్‌, సుమన మధ్య గొడవ

తర్వాత విక్రాంత్‌ ఒంటిరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తుంటే సుమన వస్తుంది. సుమను చూసిన విక్రాంత్‌ ఉలిక్కిపడతాడు. దీంతో ఏమైందని అడుగుతుంది సుమన. సడెన్‌ గా చూస్తే భయం వేసింది అంటాడు విక్రాంత్‌. దీంతో బయట నుంచి వచ్చే ఆ గారడి పిల్ల ఎగతాళి చేస్తుందనుకుంటే ఇంట్లో వాళ్లు కూడా ఇలా ఎగతాళి చేస్తున్నారు. ఏం చేస్తాం అంటుంది సుమన. స్వచ్చమైన మనసుతో వచ్చే విశాలాక్షిని మీరు యాక్సెప్ట్‌ చేయనంత కాలం మీకు ఇలాగే జరుగుతుంది. అదే నయని వదిన చూడు ఎంత మేలు జరుగుతుందో అంటూ విక్రాంత్‌ చెప్పగానే తమరి దృష్టిలో మా అక్క మొగుడి చేయి పడిపోవడం మేలు.. ఆ గజగండ పంకమణిని కొట్టేయడం మేలు కదా అంటూ ప్రశ్నిస్తుంది సుమన. అమ్మవారి కుంకుమ ఆపద రాకుండా ఉంటుందని విశాలాక్షి ఇచ్చింది అంటూ విక్రాంత్‌ చెప్తూ నీలా.. మా అమ్మలా ఏం జరిగినా ఉండదు అంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.

Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్, మిస్సమ్మ మధ్య రొమాన్స్‌ – మిస్సమ్మను అనుమానించిన ఆరు

విశాల్‌ కు విశాలాక్షి బొట్టు పెట్టిన నయని

తర్వాత విశాల్‌ సూర్యుణ్ని చూస్తూ ఆలోచిస్తుంటారు. ఇంతలో నయని వచ్చి బాబు గారు ఎక్కడికి వెళ్లారు అనుకున్నాను. ఇక్కడ ఉన్నారా? అని అడుగుతుంది. దీంతో సూర్య నమస్కారాలు చేయడం అలవాడు కదా? ఇప్పుడు ఒక్క చేతితో ఎలా చేయాలి అంటాడు. దీంతో విశాల్‌ కు  విశాలాక్షి ఇచ్చిన బొట్టు పెడుతుంది నయని. బొట్టు పెట్టుకుంటే మీరు ఎంత అందంగా ఉన్నారో చూడండి అంటూ నవ్వుతుంది. తర్వాత విశాల్‌ చేత సూర్యుడికి నమస్కారం చేయిస్తుంది నయని. విశాల్‌ ఎమోషనల్‌ అవుతాడు. నయని నా వెనకాల ఇలా నువ్వుండి సూర్య నమస్కారం చేయిస్తుంటే నాకేం కాలేదన్న నమ్మకం వస్తుంది అంటాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందని.. ఇది కేవలం దిష్టి తగిలి మీ పనులకు బ్రేక్‌ పడింది అనుకోవాలి అంతే. భుజంగమణిని తీసుకొచ్చాకా మళ్లీ మీరు మోస్ట్‌ పవర్‌ఫుల్‌ విశాల్‌ బాబుగారిలా మారిపోతారు అని ధైర్యం చెప్తుంది విశాల్‌ కు.

భుజంగమణి గురించి గజగండకు చెప్పిన వల్లభ

మరోవైపు గజగండ, వల్లభ, తిలొత్తమ్మ ఏదో మాట్లాడటానికి కలుస్తారు. ఇంట్లో ఏం జరిగిందో గజగండకు కూడా తెలియదు అంటాడు వల్లభ. దీంతో నాకు అంతా తెలుసు.. ఇవాళ ఉదయం నువ్వు ఏం టిఫిన్‌ చేశావో కూడా చెప్పగలను అంటాడు గజగండ. దీంతో నీకేమీ తెలియదని నాకు తెలుసు అంటాడు వల్లభ. అదేంటో చెబితే మాకేంటి లాభం అంటాడు వల్లభ. ఇంతలో తిలొత్తమ్మ భుజంగమణి గురించి చెప్పగానే గజగండ షాక్‌ అవుతాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Nagababu: మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. బాబాయ్ కల నెరవేర్చారుగా!

TV: పెళ్లైన 5 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి.. ఎవరంటే?

Illu Illalu Pillalu Today Episode: నర్మదపై వేదవతి కోపం.. లంచం తీసుకుంటు దొరికిన నర్మద.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

Brahmamudi Serial Today November 7th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని కొట్టిన రాహుల్‌ – వీడియో తీసిన రంజిత్‌   

Nindu Noorella Saavasam Serial Today November 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్‌  

GudiGantalu Today episode: ఘనంగా సుశీల బర్త్ డే వేడుక.. ప్రభావతి పై బాలు సెటైర్.. సుశీల సర్ప్రైజ్ గిఫ్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన మీనాక్షి.. కమల్ దెబ్బకు పల్లవికి మైండ్ బ్లాక్.. అవనికి తండ్రి ఎవరో తెలుస్తుందా..?

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

×