BigTV English

Brahmamudi Serial Today September 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కలలో కూడా కావ్యని మర్చిపోని రాజ్‌ – స్వరాజ్‌ కు పోటీగా సామంత్‌ ను దింపిన అనామిక

Brahmamudi Serial Today September 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కలలో కూడా కావ్యని మర్చిపోని రాజ్‌  – స్వరాజ్‌ కు పోటీగా సామంత్‌ ను దింపిన అనామిక

Brahmamudi serial today Episode :  రాజ్‌  అంతరాత్మ బయటకు వచ్చి వెంటనే వెళ్లి కావ్యను క్షమించమని అడిగి ఇంటికి తీసుకురా అని రాజ్ కు చెప్తుంది. అయితే నేను వెళ్లనని దానికి ఎంత పొగరుందో నీకు తెలియదని రాజ్‌ చెప్తాడు. నీలా పెళ్లానికి  కిరాయి ఇస్తానన్నవాడితో అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడుతుందని.. నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పేనని అంతరాత్మ చెప్తుంది. దీంతో నేను చేసింది తప్పైనా మా అమ్మ విషయంలో తాను చేసింది ఏంటి? అని ప్రశ్నిస్తాడు రాజ్‌. అంతే కానీ కళావతికి సారీ చెప్పి తీసుకురానంటావు కదా? సరే నీ ఇష్టం అంటూ అంతరాత్మ రాజ్‌ లోపలికి వెళ్లిపోతుంది.


పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కావ్య

 బెడ్‌ రూంను క్లీన్‌ చేసుకుంటున్న కావ్య తన పెళ్లి ఫోటో తీసుకుని తదేకంగా చూస్తూ రాజ్‌ తో తను గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ గా ఫీలవుతుంది. ఇంతలో రాజ్‌ తనను తిట్టి.. తాను ఇల్లు దాటి బయటకు వచ్చి విషయం గుర్తు చేసుకుని ఏడుస్తుంది. ఇంతలో అక్కడికి కనకం వచ్చి అమ్మా కావ్య అని పిలుస్తుంది. తన తల్లిని గమనించిన కావ్య కన్నీళ్లు తుడుచుకుని ఫోటో కనకానికి కనబడకుండా బెడ్‌ మీద పెడుతుంది. కనకం దగ్గరకు వచ్చి అమ్మా నాన్న వచ్చేశాడా? భోజనం రెడీ చేశాను అమ్మా నాన్నను రమ్మను అందరం కలిసి భోజనం చేద్దాం. అమ్మా ఏంటి అలా చూస్తున్నావు. నాన్న ఆకలికి అస్సలు తట్టుకోలేరు త్వరగా రమ్మని చెప్పు అంటూ కావ్య భోజనం దగ్గరకు వెళ్తుంది.


కలలో కూడా కావ్యను మర్చిపోని రాజ్‌

బెడ్‌ రూంలో గుర్రక పెడుతూ పడుకున్న రాజ్‌ కు కాఫీ తీసుకుని వస్తూ.. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనిమిటి గారు నిద్ర లేవండి. అని కావ్య లేపగానే నిద్రలోంచి లేచిన రాజ్‌, కావ్యన చూసి నువ్వా అంటూ షాక్‌ అవుతాడు. అవును నేనే ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్న భర్త గారు కాఫీ తీసుకోండి అని చెప్తుంది. అది సరే కానీ నువ్వే వచ్చావా..? ఎలా వచ్చావు. అని అడుగుతాడు. నేనా షేర్‌ ఆటోలో వచ్చాను అంటూ వెటకారంగా సమాధానం ఇస్తుంది కావ్య.  ఓహో నిన్న నేను మాట్లాడిన మాటలకు భయపడి, బాధపడి, బెదిరిపోయి, హడలిపోయి వచ్చావన్నమాట. ఇంతకీ ఆ పొగరు తగ్గిందా? అంటాడు రాజ్‌. దీంతో నేను వచ్చింది నా చార్జర్‌, తెగిపోయిన రెండు చెప్పులు తీసుకెళ్లడానికి మీకోసం కాదు అంటుంది కావ్య. అయితే ఉండి పోవడానికి రాలేదా? అని రాజ్‌ అడగ్గానే  ఎవరో బలవంతం చేస్తే నా మీద చెయ్యి వేసే మొగుడి గారి దగ్గర నేను ఎలా ఉంటాను. ఆ వేసిన చెయ్యిని చూస్తే నాకు గొంగళి పురుగు పాకినట్లు అనిపిస్తుంది అని కావ్య చెప్పగానే మరి నాకు కాఫీ ఎందుకు తెచ్చావు అంటూ రాజ్‌ ప్రశ్నిస్తాడు. మీరు కాఫీ తాగితేనే ప్రెషప్‌ అవుతారు. ప్రెషప్‌ అయితేనే నన్ను మళ్లీ మా ఇంట్లో డ్రాప్‌ చేయడానికి వస్తారు కదా. అంటుంది కావ్య. అంత లేదు కానీ ఎలాగూ వచ్చావు కదా ఇక్కడే ఉండిపో  నేను కూడా ఏమీ అననులే అంటాడు రాజ్‌. అవునా ఎలా ఉండాలి. మీ భార్యగా ఉండాలా? పనిమనిషిలా ఉండాలా? అని కావ్య అడుగుతుంది. నువ్వు నా భార్యవే కదా? అలాగే ఉండు అంటాడు రాజ్‌. నేను అలా ఉండాలంటే ముందు మీరు దిగి రావాలి. నా కండీషన్స్‌ అన్నింటికీ ఒప్పుకున్నట్లు బాండ్‌ పేపర్‌ రాసివ్వాలి అని అడుగుతుంది కావ్య. నేను దిగి రాను బాండ్ పేపరు రాసివ్వను కానీ ముందు కాఫీ ఇటువ్వు అంటూ రాజ్‌  బెడ్‌ మీద పడుకుని కలవరిస్తుంటాడు. పనిమనిషి కాఫీ పట్టుకుని బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ గట్టిగా అరవగానే రాజ్‌ ఉలిక్కి పడి నిద్ర లేస్తాడు. ఇదంతా కలా అనుకుని అయినా నేను కళావతికి ఇంత అడిక్ట్‌ అయ్యానా అనుకుంటాడు.

సామంతో కలిసి అనామిక రీ ఎంట్రీ

 కూరగాయలు తీసుకుని మార్కెట్‌ నుంచి వస్తూ.. కళ్యాణ్‌, అప్పులు కూరగాయల   రేట్ల గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో అనామిక కారులోంచి దిగి కళ్యాణ్‌, అప్పులను పలకరిస్తుంది. ఇంతలో కారులోంచి సామంత్‌ కూడా దిగుతాడు. దుగ్గిరాల వారసుడేంటి  ఇలా రోడ్డున్న పడ్డాడు అంటూ ఇంసల్ట్‌ గా మాట్లాడుతుంది. కారు కూడా లేనట్టుంది. అయ్యో పాపం అంటుంది. దీంతో అప్పు కోపంగా నీలాగా పరాయివాళ్ల కారులో తిరిగే అలవాటు లేదు అంటుంది. పరాయివాళ్లు ఎవరున్నారు ఇక్కడ. ఇతను నా పియాన్సీ.. పేరు సామంత్‌. సామంత్‌ గ్రూప్‌ ఆఫ్‌ జ్యూవలరీస్‌ చైర్మన్‌. దుగ్గిరాల వారి స్వరాజ్‌ గ్రూప్‌కు నిజమైన ప్రత్యర్థి. తొందరలోనే స్వరాజ్‌ జ్యువలరీని పడగొట్టి సామంత్‌ కంపెనీ నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదుగుతుంది అంటుంది అనామిక. దీంతో కళ్యాణ్, అప్పు నవ్వుతారు. ఎందుకు అలా నవ్వుతున్నారు వెటకారంగా ఉందా? అని అడుగుతుంది అనామిక. ఏం లేదు. ఒక చీమ, ఏనుగు కుంభస్థలం మీద నిలబడి పాతాళానికి తొక్కేస్తా అన్న సామెత గుర్తు కొచ్చింది అంటాడు కళ్యాణ్‌. దీంతో సామంత్‌ నా గురించి నీకు తెలియదు అంటాడు. అయితే నీ గురించి మాకు తెల్వదు కానీ నీ పక్కన ఉన్నదాని గురించి మాకు బాగా తెలుసు. అది నిన్ను రోడ్డున పడేయకుండా చూసుకో అంటుంది. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Tags

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×