E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను రిసార్ట్స్‌ కు తీసుకెళ్లిన అమర్ – లోకేషన్‌ షేర్‌ చేసిన బాబ్జీ

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను రిసార్ట్స్‌ కు తీసుకెళ్లిన అమర్ – లోకేషన్‌ షేర్‌ చేసిన బాబ్జీ
Advertisement

 

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌తో బయటకు వెళ్లడానికి మిస్సమ్మ శారీలో కాకుండా డ్రెస్‌ వేసుకుని కిందకు వస్తుంది. డ్రెస్‌ లో మిస్సమ్మను చూసిన అమర్‌ స్టన్నయిపోతాడు. షాకింగ్‌ గా అలానే మిస్సమ్మను చూస్తుండిపోతాడు. మిస్సమ్మ మెల్లగా మెట్లు దిగుతూ అమర్ దగ్గకు వస్తుంది. అమర్‌.. మిస్సమ్మను రొమాంటిక్‌గా చూస్తూనే మీ అక్కలాగే ఉన్నావు మిస్సమ్మ అంటాడు. పక్కనే ఉన్న మనోహరి, మిస్సమ్మ షాక్‌ అవుతారు. వెంటనే మిస్సమ్మ మా అక్కలాగా ఉండటమేంటి..? అని అడుగుతుంది.

Advertisement

ఇంతలో తేరుకున్న అమర్‌. అదే అరుంధతిని నువ్వు అక్క అంటావు కదా అందుకే నువ్వు మీ అక్కలాగే ఉన్నావు అన్నాను అంటాడు. ఈ డ్రెస్‌ లో నీకు కంపర్ట్‌ గా ఉందా? అదే పరెగెత్తడానికి.. అనగానే మిస్సమ్మ ఏంటండి నన్ను బయటకు తీసుకెళ్తున్నారా? లేదా మిలటరీ క్యాంపుకు తీసుకెళ్తున్నారా? అసలు ఏదైనా తప్పు చేశానని పనిష్‌మెంట్‌ ఇవ్వడానికి తీసుకెళ్తున్నారా? అంటూ మిస్సమ్మ కంగారుపడుతుంది. దీంతో ఏం లూజు ఊరికే అడిగాను నేను బయట కారు దగ్గర ఉంటాను వచ్చేయ్‌ అంటూ అమర్‌ బయటకు వెళ్లిపోతాడు. మిస్సమ్మకు అందరికీ చెప్పి బయటకు వెళ్తుంది.

బయట గుమ్మం దగ్గరు ఆరు నిలబడి మిస్సమ్మ రాగానే ఆగుమని చెప్తుంది. దీంతో అక్కా నేను మా ఆయన బయటకు వెళ్తున్నాం. ఈవెనింగ్‌ వచ్చాక కలుస్తాను. బై..  ఈవెనింగ్‌ కాదు కానీ నైట్‌ వచ్చాకా కలుస్తాను. …  నైట్‌ కూడా కాదు కానీ పొద్దున్నే కలుస్తాను అంటుంది మిస్సమ్మ. అయ్యో మిస్సమ్మ అంటే రేపు పొద్దునే వరకు రారా? నువ్వెందుకు ఇంతలా సిగ్గుపడుతున్నావు. అని ఆరు అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఏం లేదు అక్కా ఆయన ఏం ప్లాన్‌ చేశారో తెలియదు కదా? రాత్రే రావొచ్చు. లేదా? రాత్రంతా కలిసి ఉండి పొద్దునే రావొచ్చు. నాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పు అంటూ సిగ్గుపడుతుంది మిస్సమ్మ.

Advertisement

దీంతో ఆరు నో నేను ఒప్పుకోను.. అని గట్టిగా అరుస్తుంది. దీంతో మిస్సమ్మ  నేను మా ఆయనతో కలిసి బయటకు వెళ్లి సరదాగా  ఉంటానంటే మీరెందుకు ఒప్పుకోరు అక్కా..? చెప్పండి అంటూ నిలదీస్తుంది మిస్సమ్మ. ఇంతలో తేరుకున్న ఆరు.. అది కాదు మిస్సమ్మ నేను ఒప్పుకోను అంటే అది నువ్వు లేకుంటే ఇల్లు బోసి పోతుంది కదా? బాగోదు కదా? అంటున్నాను అని ఆరు చెప్పగానే నాకు మాత్రం ఆయనతో వెళ్తుంటే అదీ కూడా తెలియకుండా వెళ్తుంటే చాలా బాగుంది అక్కా అంటూ సంతోషంతో మెలికలు తిరుగుతుంది. ఆరు మాత్రం పక్కను ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లి తల చెట్టుకు బాదుకుని మళ్లీ ఏం తెలియనట్టు వస్తుంది. అక్కా మీరు ఇప్పుడు ఎటైనా వెళ్లి వచ్చారా? అని అడుగుతుంది మిస్సమ్మ.  ఏంలేదే ఇక్కడే ఉన్నానే అంటుంది ఆరు. అయితే బాయ్‌ అక్కా అంటూ మిస్సమ్మ కారు దగ్గరకు వెళ్లిపోతుంది.

కారు దగ్గర ఉన్న రాథోడ్‌ తన దగ్గర ఉన్న రివాల్వర్‌ తీసి అమర్‌కు ఇవ్వడం మిస్సమ్మ చూసి భయపడుతుంది.  ఎందుకు అది ఇస్తున్నారు అని అడుగుతుంది. ఏదో ఫార్మాలిటీ మిస్సమ్మ అంటాడు రాథోడ్‌. తర్వాత అమర్‌ కారు స్టార్ట్‌ చేశాక కారు ఎక్కబోతున్న మిస్సమ్మకు రాథోడ్‌ జాగ్రత్తలు చెప్తాడు. ఎప్పుడూ సార్‌ పక్కనే ఉండు. సార్‌ కు దూరంగా వెళ్లకు ముఖ్యంగా ఆ టేబుల్‌ నెంబర్‌ గుర్తు పెట్టుకో అని చెప్తుంటే మిస్సమ్మ నెగ్లెక్టుగా వెళ్లిపోయి కారు ఎక్కుతుంది. కారు వెళ్లిపోతుంది. వాళ్లిద్దరూ వెళ్లిపోయాక రాథోడ్‌ టెన్షన్‌తో అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఆరు విషయం ఎంటో చెప్పు రాథోడ్‌ అంటూ అడుగుతుంది. కానీ రాథోడ్‌ ఏమీ వినిపించదు.

దీంతో ఆరు  కూడా టెన్షన్‌ పడుతుంది. ఇంతకీ ఆయన  మిస్సమ్మను ఎక్కడికి తీసుకెళ్లాడు అని కంగారుపడుతుంది. ఇంతలో లోపలి నుంచి నిర్మల, శివరాం వస్తారు. మార్కెట్‌ కు వెళ్లాలి కారు తీయ్‌ అంటారు. వాళ్ల మాటలు పట్టించుకోకుండా రాథోడ్‌ అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఏదో తనలో తానే మాట్లాడకుంటుంటాడు. శివరాం గట్టిగా రాథోడ్‌ అని పిలవగానే తేరుకుని ఏంటి సార్‌ మీరు నా టెన్షన్‌ లో నేను ఉంటే మీరు మధ్యలో ఇలా అంటాడు. నీకు టెన్షన్‌ ఎందుకయ్యా అంటూ శివరాం అడగ్గానే సారుతో మిస్సమ్మతో వెళ్లింది కదా సార్‌ అందుకే నాకు టెన్షన్‌ గా ఉందని చెప్తాడు.

దీంతో శివరాం నాకు కొడకు కోడలు హ్యాపీగా బయటకు వెళితే నువ్వు కుళ్లుకుంటావా? అంటూ తిడతాడు. దీంతో ఊరుకోండి సార్‌ నేను కుళ్లుకోవడం ఏంటి? అసలు మిస్సమ్మ ఏ పరిస్థితుల్లో ఉందో తెలిస్తే మీరు టెన్షన్‌ పడతారు అంటాడు. ఇంతకీ విషయం ఎంటో చెప్పు రాథోడ్‌. అమర్‌, మిస్సమ్మను ఎక్కడికి తీసుకెళ్లాడు అని నిర్మల అడుగుతుంది. దీంతో రాథోడ్‌ విషయం మొత్తం చెప్పేస్తాడు. దీంతో ఆరు దీనంగా అయ్యో మిస్సమ్మ నిన్ను ఆయన బలివ్వడానికి తీసుకెళ్తుంటే నవ్వు మాత్రం ఎగిరి గంతులేశావా? అనుకుంటుంది. నిర్మల, శివరాం ఈ విషయం ఎలాగైన మిస్సమ్మకు చెప్పాలని రాథోడ్‌కు చెప్తారు. అలాగే సార్‌ అంటూ రాథోడ్‌ వెళ్లిపోతాడు.

రూంలో మనోహరి టెన్షన్‌తో అటూ ఇటూ తిరుగుతుంది. అమర్‌, మిస్సమ్మను ఎక్కడికి తీసుకెళ్లాడని ఆలోచిస్తుంది. ఈ బాబ్జీ గాడిని ఫాలో అవ్వమని చెప్పాను ఫాలో అవుతున్నాడో లేదో అసలు వీడు ఎక్కడున్నాడో అనుకుంటుంది. ఇంతలో ఆరు మను రూంలోకి వచ్చి ఒసేయ్‌ మను నువ్వైనా ఏదైనా చెయ్యవే అని చెప్తుంది. కానీ ఆరు మాటలు మనోహరికి వినిపించవు. ఇంతలో బాబ్జీ ఫోన్‌ చేస్తాడు. మనోహరి ఏంటి బాబ్జీ అమర్‌ కారును ఫాలో అయ్యావా? అని అడుగుతుంది.

అయ్యాను మేడం వాళ్లు ఇప్పటికే సిటీ దాటి వచ్చేశారు. ఇక్కడ దగ్గరలో రిసార్ట్స్‌ ఉన్నాయి. బహుశా వాళ్లిద్దరూ కలిసి రిసార్ట్స్‌ కు వెళ్లొచ్చు అని చెప్తాడు. దీంతో మనోహరి అమర్‌, మిస్సమ్మను రిసార్స్ట్‌ కు ఎందుకు తీసుకెళ్తున్నాడు అని అడుగుతుంది. ఏమో మేడం నాకేం తెలుసు అంటాడు బాబ్జీ. అయితే వాళ్లు ఉండే ప్లేస్‌ నాకు షేర్‌ చేయ్‌ నేను వస్తాను అంటుంది మనోహరి. సరేనని బాబ్జీ కాల్‌ కట్‌ చేస్తాడు. ఆరు మాత్రం విషయం అది కాదే మను అంటు చెప్తుంది కానీ మనోహరికి వినబడదు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×