BigTV English

KTR: బీజేపీ ట్రాప్‌లో కేటీఆర్‌, డామిట్.. కథ అడ్డం తిరిగింది?

KTR: బీజేపీ ట్రాప్‌లో కేటీఆర్‌, డామిట్.. కథ అడ్డం తిరిగింది?

KTR: బీజేపీ ట్రాప్‌లో కేటీఆర్ పడ్డారా? అమృత్ టెండర్ల వ్యవహారంలో అధికార పార్టీకి ఎందుకు దొరికిపోయాడు? ఛాలెంజ్ ప్రకారం కేటీఆర్ రాజీనామా చేస్తున్నారా? కేవలం రేవంత్ సర్కార్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారా? పరిణామాలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది.


తెలంగాణలో అమృత స్కీమ్ టెండర్ల వ్యవహారం అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టెండర్ల వ్యవహారంలో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు కేటీఆర్. అసలు నిజాలు తెలుసుకోకుండా ఏకంగా కేంద్రమంత్రికి సైతం లేఖ రాశారాయన.  ఎట్టకేలకు టెండర్ల వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది.

కేటీఆర్ పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టేనా? రాజకీయాల్లో సవాల్-ప్రతి సవాళ్లు సహజమేనని సరిపెట్టుకుంటారా? సింపుల్‌గా చెప్పాలంటే బీజేపీ ట్రాప్‌లో పడి ఇరుక్కుపోయారు కేటీఆర్. నిజాలు తెలుసు కోకుండా అమృత్ టెండర్ల అంశాన్ని బీజేఎల్సీ నేత మహేశ్వర్‌రెడ్డి తెరపైకి తెచ్చారు. రేవంత్ సర్కార్‌పై బురద జల్లేందుకు ప్లాన్ చేశారు. కాకపోతే టెండర్ల లోగుట్టు తెలిసి ఆయన సైలెంట్ అయిపోయారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ అందుకున్నారు.


అమృత్ స్కీమ్ టెండర్ల వ్యవహారంపై కేటీఆర్‌ను ఎవరో తప్పుదోవ పట్టించారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. టెండర్లకు సీఎం రేవంత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ALSO READ: హైదరాబాద్ బిజినెస్ టైమ్ అంటే టైమ్.. తేడా వస్తే ఇక అంతే

తన అల్లుడు సృజన్‌రెడ్డి.. సీఎంకు సొంత బావమరిది కాదని తేల్చేశారు మాజీ ఎమ్మెల్యే కందాల. సృజన్‌కు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. బిజినెస్‌లో జాయింట్ వెంచర్లు సహజమేనని, అమృత్ టెండర్‌లో అదే జరిగిందన్నారు.

శోధ కంపెనీలో తన కుమార్తె డైరెక్టరని, అమృత్ టెండర్లలో శోధ కంపెనీకి 29శాతం వాటా ఉందన్నారు. అసలు టెండర్ల విలువ 8 వేల కోట్లు కాదన్నది కందాల మాట. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరంటూ కేటీఆర్‌కు చెప్పకనే చెప్పేశారు. మరోవైపు నిబంధనల ప్రకారమే ఆన్ లైన్ ద్వారా టెండర్ దక్కిందని సృజన తండ్రి మనోహర్‌రెడ్డి వెల్లడించారు.

మొత్తానికి రేవంత్ సర్కార్‌‌పై బురద జల్లాలని చూసి కేటీఆర్ అందులో ఇరుకున్నారు. ఆరోపణలు చేయడం ఎవరికైనా సులువే.. నిరూపించడమే కష్టమని ఆయనకూ తెలుసు, అయినా బీజేపీ నేతలు దీన్ని తెరపైకి తెచ్చారంటూ ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

Related News

Kavitha: లక్ష మందితో బతుకమ్మ పండుగ చేసి చూపిస్తా.. కవిత కీలక వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!

Telangana Politics: అనిరుధ్ రెడ్డి vs కేటీఆర్, ప్రతీది రాజకీయమే.. స్వేచ్ఛ మీ దగ్గరెక్కడ?

Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన

Minister Uttam: తెలంగాణలో ఈసారి రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.. దేశంలో మరోసారి అత్యధికంగా..?

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Free Bus Ticket: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని.. బస్సు కింద పడుకుని మహిళ హల్ చల్

Rains Effect: ఓరుగల్లులో చినుకు పడితే చిత్తడే.. ఎన్నాళ్లీ వరద కష్టాలు..

Big Stories

×