BigTV English

Urmila Matondhkar : విడాకుల కోసం కోర్టు మెట్లేక్కిన హీరోయిన్ ఊర్మిళ?

Urmila Matondhkar : విడాకుల కోసం కోర్టు మెట్లేక్కిన హీరోయిన్ ఊర్మిళ?

Urmila Matondhkar : ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకొనే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోతున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా విడాకుల ముచ్చట వినిపిస్తుంది. స్టార్ కపుల్స్ గా ఉన్న జంటలే విడాకులు తీసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా అదే తంతు కొనసాగుతుంది. ఎటువంటి అనౌన్స్ మెంట్ లేకుండా విడిపోయినట్లు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. స్టార్ హీరోయిన్ ఊర్మిళ మతోంద్కర్ విడాకులు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వీరిద్దరి డివోర్స్ గురించి అటు మీడియాలో..  ఇటు ఫిల్మ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది.. కానీ దీనిపై ఒక క్లారిటీ అయితే రాలేదు.. అసలు విషయం ఏంటంటే..


తన భర్త అయినటువంటి మోసిన్ అక్తర్ మీర్‌తో వివాహ బంధంను తెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె విడాకుల కూడా ముంబై కోర్టులు అప్లై చేసుకుందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఊర్మిళ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. కానీ నాలుగు నెలల క్రితమే ఊర్మిళ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ కు గురవుతున్నారు. అసలు ఏమైంది.. ఇన్నేళ్ల తర్వాత విడాకులు ఎందుకు అని ఫీల్ అవుతున్నారు.

Heroine Urmila went to court for divorce?
Heroine Urmila went to court for divorce?

అయితే ఈ విడాకులు ఇద్దరు అంగీకారంతో జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఊర్మిళ మాత్రమే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని.. అందుకు గల కారణం మాత్రం తెలియరాలేదు.. ఈమె హీరోయిన్ గా, నటిగా పలు సినిమాల్లో నటించి అభిమానుల మనసు దోచుకుంది. హిందీతోపాటు ఇటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకుల ను కట్టిపడేశారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకు మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.. ఇక 2016 లో ఆమె మోసిన్ అక్తర్ ను పెళ్లి చేసుకుంది. మోసిన్ కంటే ఊర్మిళ 10 ఏళ్లు పెద్ద. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.


ఈమె ఇప్పటివరకు రంగీలా, సత్య, అనగనగా ఒక రోజు, గాయం వంటి తెలుగు సినిమాలు చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1995లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘రంగీలా’లో హీరోయిన్‌గా ఊర్మిళకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్‌తో ఓవర్ నైట్‌లో సెక్సియస్ట్ హీరోయిన్‌గా పాపులారిటీ సొంతం చేసుకుంది. సినిమాలోని ‘రంగీలారే’ సాంగ్ దేశాన్ని ఒక ఊపు ఊపింది. రంగీలా తరువాత జుదాయి, సత్య, ఖూబ్‌సూరత్ వంటి హిట్‌ మూవీస్‌లో హీరోయిన్‌గా నటించింది. అలాగే హిందీలో కూడా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఎన్నో అవార్డులను అందుకుంది. అయితే ఎందుకు విడాకులు తీసుకుంటుంది మాత్రం చెప్పలేదు. ఒకవేళ విడాకులు వచ్చిన తర్వాత ఏమైనా నిజం చెబుతుందేమో చూడాలి.. ఏది ఏమైనా ఈ వార్త హాట్ టాపిక్ అవుతుంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×