E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ మెడపై కత్తి పెట్టిన అరవింద్‌ – రాథోడ్‌ వల్ల ప్లాన్‌ అంతా అట్టర్‌ ప్లాప్‌

Nindu Noorella Saavasam Serial Today September 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ మెడపై కత్తి పెట్టిన అరవింద్‌ – రాథోడ్‌ వల్ల ప్లాన్‌ అంతా అట్టర్‌ ప్లాప్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  రాథోడ్‌ వచ్చి నిజం చెప్పగానే మిస్సమ్మ షాక్‌ అవుతుంది. చాటు నుంచి వింటున్న ఆరు కూడా మిస్సమ్మ పరిస్థితి తలుచుకుని ఫీలవుతుంది. పాపం మిస్సమ్మ మా ఆయన బయటకు వెళ్దాం అనగానే ఎంత సంతోషించింది అని జాలి పడుతుంది. అమర్‌ దగ్గరకు వెళ్లిన మిస్సమ్మ కోపంగా చూస్తుంది. ఎందుకు అలా చూస్తున్నావు అని అమర్‌ అడగ్గానే మీ గురించి ఇప్పుడే నిజం తెలిసింది. మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అవును ఇంతకీ నన్ను చుడిదారే వేసుకోమని ఎందుకు చెప్పారు అని మిస్సమ్మ అడుగుతుంది.

అమర్‌ రన్నింగ్‌, జంపింగ్‌ లాంటివి చేయడానికి కంఫర్ట్‌ గా ఉంటుందని చెప్పాను అంటాడు. దీంతో కోపంగా మిస్సమ్మ నేనేమైనా ఒలంపిక్స్‌ కు వెళ్తున్నానా? అవన్నీ ప్రాక్టీస్‌ చేయడానికి అంటుంది. ఇన్ని రోజులు నన్ను  లూజు లూజు అంటుంటే ఏమో అనుకున్న కానీ నిజంగా నేను లూజే అని బాధపడుతుంది. మరోవైపు  మిస్సమ్మకు నిజం తెలిస్తే నిదానంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా కారాలు మిరియాలు నూరుతుంది అనుకోలేదు అని ఆరు బాధపడుతుంది.

Advertisement

ఇంకోవైపు మిస్సమ్మను ఎయిమ్‌ చేసిన అరవింద్‌ గన్‌ పేలదు. దీంతో అరవింద్ షాక్ అవుతాడు. ఇప్పుడెలా అని ఆలోచిస్తుంటాడు. ఇక మిస్సమ్మ  మాత్రం తనకు చాలా పనులున్నయాని మీ పనులు ముగించుకుని వచ్చేయండి అని అక్కడి నుంచి వెళ్తుంది. మిస్సమ్మ వెనకాలే అమర్‌ ఆగు అంటూ వెళ్తుంటాడు. ఇంతలో అరవింద్‌ వచ్చి కత్తితో మిస్సమ్మను బెదిరిస్తూ చంపేస్తానంటాడు. అమర్‌  రేయ్‌ నీకు కావాల్సింది నేను కదా? నేను వచ్చేస్తాను. మిస్సమ్మను వదిలిపెట్టు అంటాడు.

దీంతో అరవింద్‌  నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు. నువ్వు ఏడవడం. నీ ఓటమి కావాలి అంటూ మిస్సమ్మను చంపేస్తాను అంటాడు. దీంతో అమర్‌, మిస్సమ్మకు ధైర్యం చెప్తాడు. నీకేం కాదని నేను చూసుకుంటాను అంటాడు. దీంతో అరవింద్‌ వెటకారంగా ఇప్పుడు కూడా భలే చెప్తున్నావు అన్నట్లుగా అమర్‌ ను చూస్తూ.. రేయ్‌ ఆఖరిసారిగా నీ భార్యకు ఏదైనా చెప్పేది ఉంటే చెప్పుకో అంటాడు. నేను చెప్పడం కాదురా? నీవాళ్లకు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు చెప్పుకో.. ఎందుకంటే ఈరోజు నువ్వు చచ్చిపోతావు కాబట్టి అని తన పక్కనే ఉన్న ఖాళీ బకెట్‌ ను అరవింద్‌ మీదకు తన్నగానే బకెట్‌ తగిలి కిందపడిపోతాడు అరవింద్‌.

Advertisement

అమర్‌ వెంటనే మిస్సమ్మను పక్కకు లాక్కుంటాడు. ఇంతలో అరవింద్‌ అనుచరుడు కూడా వస్తాడు. ఇద్దరూ కలిసి అమర్‌ పై దాడి చేయడానికి మిస్సమ్మను చంపడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరిని అమర్‌ కొడుతుంటాడు. ఇంతలో అరవింద్‌ వెళ్లి రాథోడ్‌ మీద పడతాడు. వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని రాథోడ్‌కు పెట్టి మా వాణ్ని వదిలేయ్‌ అంటాడు అరవింద్‌. అమర్‌ వాడిని వదిలేయగానే రాథోడ్ ను అడ్డుపెట్టుకుని అరవింద్‌ కూడా అక్కడి నుంచి పారిపోతాడు. రాథోడ్‌ ను వదిలేస్తాడు.

మిస్సమ్మ నెత్తిన తడిగుడ్డ వేసుకుని కుర్చీలో కూర్చుని భయపడుతుంది. అందరూ మిస్సమ్మ చుట్టూ చేరి చిన్నగా నవ్వుకుంటుంటారు. ఇంతలో అంజు అందరినీ తిడుతూ ఏయ్‌ ఎవ్వరూ నవ్వకండి. ఇది చాలా సీరియస్‌ మాటర్‌. ఇలాంటి విషయాల్లో ఎవరైనా నవ్వుతారా? పాపం మిస్సమ్మ ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అంటూ తాను మాత్రం చిన్నగా నవ్వుతుంది. అది గమనించిన అంజు పాపాత్మురాలా? నువ్వే నవ్వుతూ మళ్లీ నువ్వే నవ్వొద్దని చెప్తావా? చూశావా మిస్సమ్మ దీని డబుల్‌ యాక్షన్‌ అంటుంది.

దీంతో మిస్సమ్మ  మీ అందరికీ నేను లోకువై పోయాను కదా? ఆయనేమో నా ప్రాణాన్ని పణంగా పెట్టారు. అంజుకేమో నన్ను చూస్తే జోకర్ లా అనిపిస్తుంది. అంతే కదా? అంటూ ఏడుస్తుంది. దీంతో అంజు మిస్సమ్మ ప్లీజ్‌ మిస్సమ్మా నీ ఫేస్‌ కాస్త వేరే సైడుకు తిప్పుకోవా? నాకు నవ్వు ఆగడం లేదు. అడగకుండా డాడ్‌ నిన్ను బయటకు తీసుకెళ్తా అన్నప్పుడే నీకు డౌట్‌ రాలేదా అంటుంది. మనోహరి కూడా  బయటకు వెళ్దాం. చుడీదార్‌ వేసుకో అనగానే భూమ్మీద ఆగావా మిస్సమ్మ. ఎంత బిల్డప్‌ ఇచ్చావు. ఎన్ని మాటలు మాట్లాడావు అంటూ వెటకారంగా తిడుతుంది.

మిస్సమ్మ మా డాడ్‌ ఓవర్‌ టైం డ్యూటీ చేస్తారు కానీ ఆఫీస్‌ వదిలేసి ఔటింగ్‌ కు వెళ్లరమ్మా.. ముందు అది తెలుసుకో అమ్మా.. అంటుంది అంజు. శివరాం వచ్చి చాల్లే ఆపండి పాపం మిస్సమ్మ అసలే హడలిపోయి ఉంటే మీ మాటలతో ఇంకా బాధపెడుతున్నారు అంటాడు. నిర్మల కూడా అంజును తిడుతూ  ఏయ్‌ పొట్టి నువ్వు మిస్సమ్మను ఓదార్చకపోయినా పర్వాలేదు. బాధపెట్టకుండా ఉండు చాలు. ముందు నువ్వు లోపలకి వెళ్లు అంటుంది. దీంతో కోపంగా మిస్సమ్మ లేచి లోపలికి వెళ్లాల్సింది అంజు కాదత్తయ్యా నేను నేనే ఆయన దగ్గరకు వెళ్లి తేల్చుకుంటాను అని పైకి వెళ్తుంది.

అమర్‌ రూంలో అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకుంటుంటే కోపంగా రూంలోకి వచ్చిన మిస్సమ్మ కింద పడిపోయిన నీళ్లలో కాలు పెట్టి జారి కిందపడబోతుంటే అమర్‌ పట్టుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్‌ క్రియేట్ అవుతుంది. ఆరు బయటి నుంచి చూసి సిగ్గుపడుతుంది. నాకెప్పుడూ ఇలాంటి సన్నివేషాలే కనిపించాలా అనుకుంటుంది. తర్వాత మిస్సమ్మ అమర్‌ ను తిడుతూ అక్కలా నేను కూడా  చనిపోయి ఉంటే.. అంటుంటే వెంటనే అమర్‌ మిస్సమ్మ నోరు మూస్తాడు. మాట వరసకు కూడా ఇంకోసారి ఆ మాట అనకు మిస్సమ్మ. నీకేం కాదు కాకూడదు. కానివ్వను అంటాడు అమర్‌  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×