E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 1st  ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ ఆపేందుకు చంద్ర కొత్త ప్లాన్      

Ninnu kori Serial Today Episode September 1st  ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ ఆపేందుకు చంద్ర కొత్త ప్లాన్      
Advertisement

Ninnu kori serial today Episode:  విరాజ్‌కు ఎదురుగా వెళ్లి రొమాంటిక్ గా చూస్తూ.. చంద్ర మాట్లాడుతుంటే.. విరాజ్‌ కోపంగా చంద్ర అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా..? అని కోప్పడితే అయ్యో వెనక్కి చూడకండి మదన్‌ మనల్ని చాటు నుంచి గమనిస్తున్నాడు. అతడు ఫుల్‌ జలసీగా ఫీలవుతాడు. అతన్ని అలాగే ఉడుక్కోనిద్దాం అంటూ రొమాంటిక్‌గా దగ్గరకు తీసుకుని ఇంకో విషయం గుర్తుందా విరాజ్‌ సార్‌..

ఒకసారి సడెన్‌గా వర్షం పడినప్పుడు నన్ను దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకున్నావు.. అలాగే ఇంకోసారి కరెంట్‌ పోయినప్పుడు క్యాండిల్‌ లైట్‌ వెలుతురులో నాకు గోరు ముద్దలు తినిపించావు అప్పుడు నా కళ్లల్లోకి కళ్లు పెట్టి ఎంత ప్రేమగా చూసుకున్నావు అంటూ మాట్లాడుతుంటే.. మదన్‌ తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మదన్‌ వెళ్లిపోవడం చూసిన చంద్ర వెంటనే విరాజ్‌కు దూరంగా జరిగుతుంది. విరాజ్ మాత్రం చంద్ర ఇవన్నీ నీకు ఇంకా గుర్తుకున్నాయా..? మన పాత విషయాలు గుర్తు పెట్టుకున్నావు అంటే నీకు కోపం పోయిందా చంద్ర నన్ను క్షమించేశావా..? అని అడిగితే అదేం లేదని మీ మీద నాకు ఇంకా కోపం ఉంది ఆ మదన్‌ జలసీగా ఫీల్‌ అవ్వాలని ఇలా చేశాను అంటూ వెళ్లిపోతుంది. అసలు చంద్ర మనసులో ఏముందిరా దేవుడా అంటూ అయోమయంగా చూస్తుంటాడు విరాజ్‌.

Advertisement

షాలిని ఏవో డిజైన్స్‌ తీసుకొచ్చి చంద్రకు చూపిస్తుంది. ఎలా ఉన్నాయని అడుగుతుంది. అప్పుడే అక్కడకు విరాజ్‌ వస్తాడు. విరాజ్‌ను చూసిన చంద్ర ఆ డిజైన్స్‌ సూపర్బ్‌ గా ఉన్నాయని చెప్తుంది. మీ దగ్గర ఉన్న అన్ని డిజైన్స్‌ సెలెక్ట్‌ చేయండని చెప్తుంది. మండపం చూడటానికి ఇంద్రధనస్సులా ఉండాలి అని చెప్తుంది. అప్పుడే క్రాంతి వచ్చి డిజైన్స్‌ చూసి చాలా బాగున్నాయి అంటాడు. క్రాంతి మాటలకు చంద్ర కూడా అవును నాకు చాలా బాగా నచ్చాయి అని చెప్తుంటే విరాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. విరాజ్‌ను చంద్ర పిలిచి డిజైన్స్‌ చూపిస్తుంది. వాటిలో ఏవి బాగున్నాయని అడుగుతుంది. మీ చాయిస్‌ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని చెప్పాడు అనగానే.. విరాజ్‌ కోపంగా ఈ దరిద్రం అంతా నేనెందుకు చూడాలి. చంద్ర నువ్వెన్ని రంగులు అద్దినా ఆ మండపం చివరకు మదన్‌ రక్తంతో ఎరుపెక్కుతుంది అంటూ వెళ్లిపోతాడు. నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎలా ఉంటారో నేను చూస్తాను విరాజ్‌ సార్‌ అంటూ మనసులో అనుకుంటుంది చంద్ర.

మాయ దగ్గరకు వెళ్లిన షాలిని అయోమయంగా చంద్ర పెళ్లి మండపం డిజైన్స్‌ చేసిన విషయం చెప్తుంది. అలాగే పెళ్లి కోసం చేసే హడావిడి గురించి చెప్తుంది. క్రాంతి మాత్రం ఈ పెల్లి జరగదు అంటున్నాడని తనకు అంతా కన్ఫీజ్ గా ఉందని చెప్తుంది. అందుకు కాంత్రి ఎలాగైనా ఎంగేజ్‌మెంట్‌ ఆపాలని చూస్తాడని మాయ అంటుంది. నీ మొగుడే కదా నేరుగా అడగొచ్చు కదా అంటుంది వాళ్ల పిన్ని. కానీ చంద్ర ప్లాన్‌ చూస్తుంటే.. తనకు ఏదో అనుమానంగా ఉందని దీని వెనక ఏదో ప్లాన్‌ ఉందని అంటుంది షాలిని.. ఏది ఏమైనా కానివ్వండి కానీ పెళ్లై అది ఇంట్లోంచి వెళ్లిపోతే దరిద్రం పోతుంది అంటుంది వాళ్ల పిన్ని. కానీ ఈ ఎంగేజ్‌మెంట్ ఆపడానికి కామాక్షి, శృతిలు ప్లాన్‌ చేస్తున్నారు అని షాలిని చెప్పగానే.. మాయ వాళ్ల అమ్మను వెళ్లి వాళ్ల ప్లాన్‌ చెడగొట్టమని చెప్తుంది.

Advertisement

మరోవైపు కామాక్షి, శృతిలు ఎంగేజ్‌మెంట్‌ ఎలా చెడగొట్టాలా..? అని ఆలోచిస్తుంటారు. ఏవేవో ప్లాన్లు చేస్తుంటారు. ఏదీ కరెక్ట్‌ కాదని డిస్సపాయింట్‌ అవుతుంటారు. చివరకు మందరను చంపేస్తే శుభకార్యం ఆగిపోతుందని కామాక్షి చెబితే.. ఆ మందర అంటే అందరికీ శత్రువే అది చస్తే అందరూ సంతోషంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటారు అంటూ శృతి చెబితే మరి ఇప్పుడు ఈ ఎంగేజ్‌ మెంట్‌ ఎవరు చెడగొడతారే అంటూ ఫీలవుతుంది కామాక్షి.

మరోవైపు చంద్ర ఎంగేజ్‌ ఎలా ఆపాలని ఆలోచిస్తుంది. మరోవైపు విరాజ్‌ కత్తి పట్టుకుని మదన్‌ను చంపేస్తానని చెప్తాడు. కత్తితో కోపంగా వెల్లిపోతాడు విరాజ్. మరోవైపు కామాక్షి, శృతిలను రెచ్చగొడితే ఎంగేజ్‌మెంట్‌ ఆపేస్తారని డిసైడ్‌ అవుతుంది చంద్ర. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి తన మాటలతో వాళ్లను రెచ్చగొడుతుంది చంద్ర. చంద్ర మాటలకు ఎలాగైనా ఎంగేజ్‌మెంట్‌ ఆపేయాలని కామాక్షి, శృతి మరింత ఆలోచిస్తారు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

Big Stories

Advertisement
×