E-Paper
Advertisement

స్క్రీన్ లేకుండానే ఇన్ని పనులా? URBAN ARC NOTE AI బ్యాండ్ ఫీచర్లు ఇవే!

స్క్రీన్ లేకుండానే ఇన్ని పనులా? URBAN ARC NOTE AI బ్యాండ్ ఫీచర్లు ఇవే!
Advertisement

URBAN ARC NOTE: స్మార్ట్‌వాచ్‌లకు భిన్నంగా, స్క్రీన్ లేకుండా AI ఫీచర్లపై ఫోకస్ చేసిన కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్‌ను URBAN భారత మార్కెట్లో విడుదల చేసింది. ARC NOTE పేరుతో వచ్చిన ఈ డివైస్ మీటింగ్‌లను రికార్డ్ చేయడంతో పాటు వాటిని ఉపయోగకరమైన సమాచారంగా మార్చడం ఈ బ్యాండ్ ప్రత్యేకత.

16 గంటల వరకు రికార్డింగ్:

ARC నోట్‌లో AI మీటింగ్ రికార్డర్ ప్రధాన ఫీచర్. బ్యాండ్‌పై డబుల్ క్లిక్ చేస్తే రికార్డింగ్ ప్రారంభమవుతుంది. సింగిల్ ప్రెస్‌తో ఆపేయవచ్చు. పూర్తి ఛార్జ్‌పై 16 గంటల వరకు రికార్డింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. రికార్డింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం జరగదు.

Advertisement

Also Read: Vivo X500 Pro Max వచ్చేస్తోంది.. 200MP కెమెరా, భారీ డిస్‌ప్లేతో అదరగొట్టే ఫీచర్లు!

రికార్డింగ్‌కు AI సపోర్ట్:

రికార్డ్ చేసిన సంభాషణలను ఏఐ ద్వారా సెర్చ్ చేయగల ట్రాన్స్‌క్రిప్ట్‌లుగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా.. మీటింగ్ సారాంశాలు, అనువాదాలు, ఏఐ జనరేట్ చేసిన మైండ్ మ్యాప్‌లను కూడా పొందొచ్చు. దీంతో మొత్తం ఆడియోను మళ్లీ వినాల్సిన అవసరం తగ్గుతుంది.

స్క్రీన్ లేకుండానే ఉపయోగం:

Advertisement

ఈ ARC నోట్‌లో ఎలాంటి డిస్‌ప్లే ఉండదు. మీటింగ్ సమయంలో నోటిఫికేషన్లు లేదా ఇతర స్క్రీన్ డిస్ట్రాక్షన్లు లేకుండా అవసరమైనప్పుడు నేరుగా రికార్డింగ్ ప్రారంభించడమే దీని ఉద్దేశం. దీంతో పాటు 24 గంటల వెల్‌నెస్ ట్రాకింగ్, యాక్టివిటీ మానిటరింగ్ వంటి ఫిట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి.

ధర, సేల్ వివరాలు:

భారత్‌లో ARC నోట్ ధర రూ.6,999. ఆగస్టు 31 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముందుగా బుక్ చేసుకునే వారికి రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.5,999కే లభిస్తుంది. సెప్టెంబర్ 7, 2026 నుంచి రెగ్యులర్ సేల్ ప్రారంభం కానుంది.

Also Read: 5 ఏళ్ల తర్వాత కూడా 80% బ్యాటరీ కెపాసిటీ.. Honor 600S 5Gలో మరెన్నో అదిరిపోయే ఫీచర్లు!

Tags

Related News

స్టూడెంట్స్, ఆఫీస్ వర్క్‌కు బెస్ట్.. ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా 5 బడ్జెట్ టాబ్లెట్స్!

ఇంటర్నెట్ లేకపోయినా UPI పేమెంట్.. PhonePe తీసుకొచ్చిన ఈ సదుపాయం గురించి తెలుసా?

చెత్తలో పడేసే ప్లాస్టిక్ బాటిళ్లతో.. అద్భుతమైన ఇల్లు.. కెనడా బిల్డర్ల క్రేజీ ఆవిష్కరణ!

సాధారణ ఫ్యాన్ vs బీఎల్‌డీసీ.. రెండింటికి తేడా ఏంటి? పవర్ ఆదాకు ఏది పర్ఫెక్ట్?

రూ.2,390లకే డైమండ్ కట్ డిజైన్ స్మార్ట్‌వాచ్..పెబుల్ వియన్నా స్పెషల్ లుక్!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..4 మైక్ ENC ఫీచర్‌తో కొత్త బౌల్ట్ ఇయర్‌బడ్స్!

క్యాబేజీ, పండ్ల తొక్కలతో నివాసాలు.. ఉంటే నీడ, తింటే ఆహారం.. ఇదెక్కడి టెక్నాలజీ సామీ!

Big Stories

Advertisement
×