Ninnukori serial Virat: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సీరియల్స్ లో నిన్ను కోరి(Ninnukori) సీరియల్ ఒకటి. ఈ సీరియల్ మధ్యాహ్నం ప్రసారం మొత్తం మంచి ప్రేక్షకు ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్ లో నటుడు శివకుమార్(Shiva Kumar)విరాట్ అనే పాత్రలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ సీరియల్ నుంచి నటుడు శివకుమార్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. అతనికి ప్రమాదం జరిగి తన రూపురేఖలను మారుస్తున్నట్టు కథను మలుపుతిప్పి విరాట్ పాత్రలో మరొక హీరోని ఈ సీరియల్లో తీసుకున్నట్టు ఇటీవల ప్రోమో ద్వారా తెలియచేశారు.
ఇలా ఉన్నఫలంగా శివకుమార్ ఈ సీరియల్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులలో చర్చలు మొదలయ్యాయి. అయితే శివకుమార్ ఉన్నఫలంగా ఈ సీరియల్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం బిగ్ బాస్ అని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ ఆరవ తేదీ ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా 16 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి వెళ్లారు.
ఇలా ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న నేపథ్యంలోనే వైల్డ్ కార్డు ఎంట్రీకి సంబంధించి కంటెస్టెంట్ల వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నటుడు శివకుమార్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని అందులో భాగంగానే సీరియల్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఈయనకు బిగ్ బాస్ అవకాశం వచ్చినప్పటికీ నిన్ను కోరి సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం ఇష్టం లేక బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మాత్రం వైల్డ్ కార్డు ద్వారా శివకుమార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టమవుతుంది.
ఇకపోతే శివకుమార్ ప్రేయసి నటి ప్రియాంక జైన్ (Priyanka Jain) సైతం ఇదివరకే బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ప్రియాంక కార్యక్రమాలు టీవీ షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. మరి సీజన్ 10 కార్యక్రమంలో భాగంగా తన ప్రియుడు శివకుమార్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మరి శివకుమార్ నిన్ను కోరి సీరియల్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఇదేనా? లేదంటే మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే వివరాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.
Also Read: యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!