E-Paper
Advertisement

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!
Advertisement

Bigg Boss 10 Commoners: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం ఇటీవల ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఆదివారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది అదే రోజు నాగార్జున (Nagarjuna)హౌస్ లోకి ఏకంగా 16 మంది కంటెస్టెంట్లను పంపించారు. ఇలా సెలబ్రిటీలు పదిమందితో పాటు కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన ఆరుగురు కామనర్స్ (Commoners)ను బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. ఇక ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఎప్పటిలాగే గొడవలు పోట్లాటలు, టాస్కులు అంటూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

యాటిట్యూడ్ చూపిస్తున్నారు..

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 10 హౌస్ లోకి వెళ్లిన కామనర్స్ గురించి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి(Tamanna simhadri) చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనగా మారాయి. తమన్నా సింహాద్రి తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ కామనర్స్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించిన కొన్ని వీడియోలను తాను చూస్తున్నానని అయితే ఈ సీజన్ లో భాగంగా కామనర్స్ చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నారని ఈమె తెలిపారు. సెలబ్రిటీలు ఎన్నో సినిమాలు సీరియల్స్ చేసి ఈ షోలో పాల్గొన్నారు. కానీ కామనర్స్ మాత్రం అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చి అదేదో పెద్ద సెలబ్రిటీలమని ఫీల్ అవుతున్నారు.

కెమెరాల కోసమే యాక్టింగ్..

Advertisement

ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరిలో వచ్చిన వీళ్లు సెలబ్రిటీలపై గొడవలకు వెళుతూ వారిని మరి తక్కువ చేసి మాట్లాడుతున్నారని, బలుపు చూపిస్తున్నారని తమన్నా సింహాద్రి మాట్లాడారు. సెలబ్రిటీలుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినవారు చాలా సింపుల్ గా ఉంటే ఈ కామనర్స్ మాత్రం కేవలం కెమెరాలు కోసం, కంటెంట్ క్రియేట్ చేస్తున్నారని బయట వాళ్ళు తమని చూస్తుంటారంటూ బిల్డప్ కొడుతున్నారంటూ తమన్నా సింహాద్రి కామనర్స్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

?stkn=MTA0Zjd2NXJ5OXI3Mg%3D%3D

Advertisement

ఇలాగే తాను బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తనపై చాలామంది విమర్శలు చేశారు. అప్పుడు విమర్శలు చేసిన వారందరికీ ఇప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ కనిపించలేదా అంటూ ఈమె ప్రశ్నించారు. ముఖ్యంగా రోహిత్ నాయుడు, అమన్ మసూద్ సెలబ్రిటీల మీదకు గొడవకు వెళ్లడం పట్ల ఈమె స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా తమన్నా సింహాద్రి కామనర్స్ గురించి వారికి బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం ఇవ్వడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు ఈమె మాటలకు సమర్థించగా మరికొందరు మాత్రం ముందు మీరు బిగ్ బాస్ చూసి మాట్లాడండి అంటూ తమన్నా వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ఫైనల్లీ వైష్ణవి చైతన్యతో రిలేషన్ పై ఆనంద్ క్లారిటీ.. అన్న వదిననే ఫాలో అవుతున్నాడుగా?

Related News

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 

Big Stories

Advertisement
×