Nagababu: మెగా వారసుడు.. ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) దంపతుల తనయుడు వాయువ్ తేజ్ (Vaayuv Tej) తొలి పుట్టిన రోజు ఈ రోజు.. ఈ సందర్భంగా నాగబాబు (Nagababu ) తీసుకున్న సంచలన నిర్ణయం అందరిని సంతోష పరుస్తోంది. ముఖ్యంగా చిన్నారి కోసం నాగబాబు చేసిన ఈ పని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కూడా.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నాగబాబు తన కుటుంబంలో ఎవరి పుట్టినరోజు జరిగినా సరే వారి పేరు మీద ఒక మొక్క నాటుతున్న విషయం తెలిసిందే. మొన్నటికీ మొన్న తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ పేరు మీద మొక్కలు నాటిన ఈయన.. ఇప్పుడు తన మనవడు వాయువ్ తేజ్ (Vaayuv Tej) పేరు మీద కూడా ఒక మొక్క నాటి ఆ మొక్కకు తన మనవడి పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ పంచుకుంటూ, వీడియో సందేశం పంపించారు. “నా ప్రియమైన మనవడు వాయువ్ కి తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ చిన్ని చేతుల్లో నాకు భవిష్యత్తు కనిపిస్తోంది. నీ అమాయకపు చిరునవ్వుల్లో ఈ విశ్వపు స్వచ్ఛమైన ఆనందాన్ని నేను అనుభవిస్తాను. మా రోజులను ప్రకాశవంతం చేసే వెలుగు నువ్వే. జీవితాన్ని పరిపూర్ణం చేసే ఆశీర్వాదంవి నువ్వే.. నీ ప్రయాణం, ప్రేమ, నవ్వులు.. అంతులేని అద్భుతాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం నీ మొదటి పుట్టినరోజును మాత్రమే కాకుండా మన మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని, కాలానికి, మాటలకు అతీతమైన ప్రేమను కూడా జరుపుకుంటున్నాం” అంటూ క్యాప్షన్ జోడించారు.
వాయువ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా పునాస రకం మామిడి మొక్కను నాటిన నాగబాబు మాట్లాడుతూ.. “మై డియర్ వాయువ్ తేజ్ బాబు.. నీ బర్తడే కి పునస చెట్టు నాటాను. సంవత్సరానికి రెండు సార్లు కాసే ఈ చెట్టు నాటాను. నీకు ఒక 7, 8 సంవత్సరాలు వచ్చాక నీకు తెలుస్తుంది. నీ పేరు మీద నేను ఈ మొక్కను నాటాను అని. నీకు ఏడు, ఎనిమిదేళ్లు వచ్చాక.. ఈ చెట్టు విపరీతమైన కాయలు ఇస్తుంది. నీకు ఎంతైనా మంచి గిఫ్ట్ ఇవ్వగలను. కానీ అంతకుమించి అద్భుతమైన గిఫ్ట్ ఇది. ఎంత విలువైన గిఫ్ట్ అయినా ఎవరైనా ఇవ్వగలరు. కానీ ఈ మొక్క లాంటి విలువైన గిఫ్ట్ ఎవరు ఇవ్వలేరు.. నా మనవడి కోసం ఈ చెట్టు నాటాను అంటూ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
also read: ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?
సినిమా నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నాగబాబు.. జనసేన పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన ఈయన ప్రస్తుతం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Happy 1st Birthday, my precious grandson #Vayuv❤️
In your tiny hands, I see the future,in your innocent smile, I feel the universe’s purest joy. You are the light that brightens our days, the blessing that makes life complete. May your journey be filled with love, laughter, and… pic.twitter.com/AGPgAfeBJB— Naga Babu Konidela (@NagaBabuOffl) September 10, 2026