E-Paper
Advertisement

పొదరిల్లు.. ఏప్రిల్2: పెద్ది పెళ్లి కోసం మహా ప్లాన్.. చక్రీ, మహా ను అంతా హ్యాపీ.. మహాను ఘోరంగా అవమానించిన పురుషోత్తం..

పొదరిల్లు.. ఏప్రిల్2: పెద్ది పెళ్లి కోసం మహా ప్లాన్.. చక్రీ, మహా ను అంతా హ్యాపీ.. మహాను ఘోరంగా అవమానించిన పురుషోత్తం..
Advertisement

Podarillu Today Episode April 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి  హారిక మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది.. ఇక మహాలక్ష్మి హారికకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. తన భార్యను చంపి జైలుకు వెళ్లాడో లేదో తెలియదు కానీ నీ భర్తను మాత్రం జైలుకు వెళ్లకుండా ఆయనే కాపాడాడు. దేవుడి దయవల్ల ఆయనకు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది లేదంటే మాత్రం నీ భర్తకి జైలు శిక్ష ఉరి శిక్ష పడేది అని మహాలక్ష్మి హారికతో అంటుంది.. ఇక మహాలక్ష్మి ఫోన్ పెట్టగానే హారిక.. వాళ్లందరితో మంచిగా ఉంటుంది అంటే ఆ చిన్న ఇంట్లో మహా ఉండాలనే అనుకుంటుందా..? చక్రి తో పెళ్లి బంధం నిజమే అనుకుంటున్నా అని ఆలోచిస్తూ ఉంటుంది.. రాత్రి అయితే నారాయణకు టాబ్లెట్స్ ఇవ్వాలి అని మహా అలారం పెట్టుకుని మరీ పడుకుంటుంది. అందరూ పడుకున్న తర్వాత మాధవ్ గాయత్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

మా నాన్న గనుక లేకపోతే మీ పరిస్థితి ఏంటి.? అంత పెద్ద బొట్టు ఉంది కాబట్టి మా నాన్నకి ఏమీ కాలేదు అని చక్రి అనగానే.. మహాలక్ష్మి ఎప్పుడు చూసినా ఆయన పొట్ట మీద పడతారు. ఆయనే లేకుండా ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఊహించుకో లేకపోతున్నాను అని అంటుంది.. మా అన్నయ్య ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని మహాలక్ష్మి అంటుంది.. మమ్మల్ని ఎవర్ని వద్దని వెళ్లారు ఏం చేశారు. చంప దెబ్బతిని వచ్చారు అని చక్రి అనగానే మహా సీరియస్ అవుతుంది.. ఇక రాత్రి మహాలక్ష్మి టాబ్లెట్స్ కోసమని లేచినప్పుడు అక్కడ పెద్ది కనిపించకపోవడంతో టెన్షన్ పడిపోతుంది. గాయత్రీ పెద్ది ఇద్దరు మాట్లాడుకోవడం చూసి వాళ్ళిద్దర్నీ ఎలాగైనా కలపాలని ప్లాన్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అందరూ ఇక్కడే ఉన్నారు గాని పెద్ది ఎక్కడ కనిపించడం లేదు అని మహా అనుకుంటుంది.. బయటికి వెళ్లి చూడగానే గాయత్రి మాధవ్ ఇద్దరు మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది బావ అని గాయత్రి అనడంతో మాధవ్ బాధ పడిపోతాడు. మీ అమ్మ వల్ల మనిద్దరం కలవలేక పోతున్నాము అని ఇద్దరు కూడా బాధపడిపోతూ ఉంటారు. నా జీవితంలోకి వస్తే నాకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు అని మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు అది చూసిన మహాలక్ష్మి బాధపడుతుంది.. నా తమ్ముళ్లు నా పెళ్లి కోసం ఎంత దూరమైనా వెళ్తారు కాబట్టి నేను బయట పెట్టడం లేదు అని మాధవ్ అంటాడు. ముగ్గురు అన్నదమ్ములని బయటికి తీసుకుని వెళ్లి మాధవ్ గాయత్రీల విషయాన్ని బయటపెడుతుంది మహా… మనం పోలీసులుకు చెప్పి ఉంటే బాగుండేది పోలీసులు వాళ్ళకి పెళ్లి చేసే వాళ్ళు కదా అనేసి మహాలక్ష్మి అంటుంది.. పెద్దికి ఎలాగైనా పెళ్లి చేయాలి అని మహా అంటుంది..

పెద్ది గాయత్రీల పెళ్లి కోసం మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే.. ఆ ముగ్గురు కూడా ఏం చేయడానికి లేదు వాళ్ల గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికే భయపడుతుంటారు అని అంటాడు.. మనము వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడదామని మహా ఎంత చెప్తున్నా సరే చెక్రి మాత్రం మా అత్త ఉన్నంతవరకు అది జరగదు అని అంటాడు. మా అత్తని చంపేస్తే తప్ప వాళ్ళిద్దరు పెళ్లి జరగదు అని చక్రి అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇప్పటికే ఒక తరం మీ నాన్న మీ అమ్మని చంపేశాడు అని అంటున్నారు. ఇప్పుడు మరో తరం కూడా మిమ్మల్ని అలానే అనుకోవాలా అని మహాలక్ష్మి అంటుంది. ఇదంతా జరిగే పని కాదులే మనం వెళ్ళిపోదాం పద అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ మహా మాత్రం పెద్ది కోసం ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement

ఇక కేశవ మెకానిక్ షాప్ లోకి వెళ్లి అక్కడ ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన శైలు అక్కడున్న వస్తువులన్నిటినీ పడేసి కోపంగా ఉంటుంది ఏంటి బుర్ర లేదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని తిడతాడు. మా ఇంట్లో నన్ను ఇరికించాలని చూస్తావా నీకు కొంచమైన బుద్ధుందా అని శైలు కేశవ పై సీరియస్ అవుతుంది. మా నాన్న నమ్మలేదు కాబట్టి సరిపోయింది. నమ్మింటే నా పరిస్థితి ఏంటి నన్ను కాలేజీకి పంపిస్తారా? నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. మీ అమ్మాయిలకి ధైర్యం లేదే నీకు అంతగా ఫోన్ కావాలనుకుంటే వెళ్లి మీ ఇంట్లో ధైర్యంగా ఈ విషయాన్ని చెప్పు అని కేశవ అంటాడు ఆ మాట వినగానే శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మా అన్నయ్య పెళ్లి ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా అని మహాలక్ష్మిని చక్రి అడుగుతాడు అది కాక ఈ ప్రపంచం ఎలా ఉద్ధరిద్దామని ఆలోచిస్తున్నానా? ఏంటి అని మహాలక్ష్మి కూడా సరదాగా మాట్లాడుతుంది. ఏంటో మీరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియడం లేదు అని చక్రి అంటాడు. ఇక ఇద్దరు కూడా సరదాగా నవ్వుకోవడం చూసి మాతో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు.. ఇకపోతే ఈ జంటతో పాటు మనకు ఇంకొక జంట కూడా కనిపిస్తుంది అని కేశవ కన్నా ఇద్దరూ అనుకుంటారు. ఇక అందరూ కలిసి ఉదయం లేవగానే మనం వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటారు.

Also Read :భాగ్యం ప్లాన్ సక్సెస్.. చందుకు నిజం చెప్పిన శ్రీవల్లి.. అమూల్య నిజాలు బయటపెడుతుందా..?

మీ నాన్నగారిని ఒక మాట అడిగి వెళ్దాము పెద్ద మనిషి ఇంటికి ఉండగా మనం వెళ్తే ఏదైనా అనుకుంటారేమో అని మహాలక్ష్మి అంటుంది. కానీ నారాయణ మాత్రం వల్ల ఎలాంటి వాళ్ళు మీకు తెలియదా వాళ్ళ ఇంటికి వెళ్లి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళందరూ మాత్రం వాళ్ళింటికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి అని పూలు పండ్లు తీసుకొని వెళ్తారు. వాళ్ళందరిని చూసిన తాయారు రెచ్చిపోయి తిడుతుంది.. మీరు మంచివాళ్ళు అనుకొని మీతో మాట్లాడడానికి వచ్చాను కానీ మీరు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు అని మహాలక్ష్మి కూడా అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×