Podarillu Today Episode December 10th: చక్రి అందరికీ పెళ్లి అయిపోతుంది నాకు మాత్రం ఇంకా పెళ్లి కాలేదు అని తన కారులో ఎక్కేస్తాడు అమ్మాయిలకు 50 శాతం ఫ్రీ అని బోర్డు పెట్టేస్తాడు.. తనకు ఎలాగైనా అమ్మాయి దొరకాలని దేవుడు నీ ప్రార్థిస్తూ ఉంటాడు.. ఇంట్లో మాధవ్ కి మాత్రం పెళ్లిచూపులు అని కన్నా రెడీ చేస్తూ ఉంటాడు.. అన్నయ్య నువ్వు చాలా అందంగా రెడీ అయితే నీకోసం ఏ అమ్మాయి అయినా వచ్చేస్తుంది నీ పెళ్లి జరిగిపోతుంది అని కన్నా ఎటు వెళ్ళనివ్వకుండా అందంగా రెడీ చేస్తాడు.. చక్రి తన కారును తీసుకొని గ్యారేజ్ కెళ్ళి కలెక్షన్లను ఇస్తాడు.. అయితే ఆ కలెక్షన్లను చూసినా ఓనరు ఏంట్రా నువ్వు? పెళ్లి కోసం 50% ఫ్రీ అని పెట్టావు ఇలా అయితే నా పరిస్థితి ఏంట్రా అని అడుగుతాడు.. కారు ఓనర్ తో గొడవ పడతాడు. ఆ తర్వాత మహా తన కారులో ఎక్కడంతో ఫుల్ ఖుషి అవుతాడు. ఆమె అందానికి ఫిదా అవుతాడు. కేశవ, చక్రీ గొడవతో మాధవ పెళ్లి చూపులు ఆగిపోతాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంటిని చూసి ఎవ్వరు కూడా మనకి పిల్లనివ్వడానికి ఒప్పుకోవడం లేదు.. తన దాంట్లో తప్పు లేదు కదా అని కేశవ కోపంగా అంటాడు.. ఆ మాట విన్న చక్రి.. బయట అన్నమాట బయటే వదిలేసి రావాలి. ఇంట్లో అన్నయ్య పెళ్లి చూపులు కదా మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని సీరియస్ అవుతాడు.. దానికి ఇద్దరూ కొట్టుకుంటారు కూడా… మహా తన ప్రాజెక్ట్ ని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా ఓకే అవుతుందని బయటకు వచ్చేస్తుంది.. మహా తన ప్రాజెక్టు ఎలాగైనా సరే ఓకే అవుతుందని చాలా సంతోషంగా తన ఫ్రెండ్ తో బయటకు వెళ్తుంది.. మహా వాళ్ల నాన్న తన ఫ్రెండ్ చెప్పింది ఆలోచిస్తూ ఉంటాడు.
తన కారు డ్రైవరు వేరే కారు తో డాష్ కొట్టడంతో కాస్త గొడవ జరుగుతుంది. ఆ గొడవలు మహా తన ఫ్రెండ్ తో ఉండడం చూస్తాడు. అక్కడో పక్కన పెట్టి ముందు ఆ బైక్ని ఫాలో అవ్వు అనేసి అంటాడు. మహా తన ఫ్రెండ్ ను చాలా దూరం వరకు ఫాలో అవుతాడు. కానీ మధ్యలోనే తప్పించుకుని వెళ్ళిపోతారు. అదే ఆలోచిస్తూ ఇంటికి వస్తాడు.. ఇక మాధవ్ పెళ్లిచూపులు క్యాన్సిల్ అయ్యాయని ఇంట్లోని వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. బయట జరిగిన విషయాలను బయట వదిలేయాలి ఇంటికి తీసుకువచ్చి ఇలా గొడవలు జరుగుతాయని చెప్పాను కదా అని చక్రి అంటాడు.. అయినా పెళ్లి సంబంధం చెడిపోవడం మనకి కొత్తవి కాదు కదా.. మనకు ఇల్లు మాత్రమే లేదు.. లేని వాళ్ళమైతే కాదు కదా అని మాధవ్ తన తమ్ములని అందరినీ ఒకటి చేస్తాడు.
కన్నా మాత్రం తల్లి లేదని బాధపడుతూ ఉంటాడు. నువ్వెందుకురా బాధపడుతున్నావ్… మనకి అమ్మ ఉంటే ఇట్లా జరిగేది కాదు కదా మీ అందరికీ పెళ్లిళ్లు అయ్యేవి కదా అని కన్నా కన్నీళ్లు పెట్టుకుంటాడు.. నాకు అమ్మ ఎలా ఉంటుందో ఫోటోలో చూడడం తప్ప ఎప్పుడూ నిజంగా తెలియదు. నాన్న ఉన్న తాగుబోతు కాబట్టి అమ్మ నాన్న నువ్వే ఈ నన్ను పెంచావు. నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత భోజనానికి అందరూ రండి అని మాధవ్ పిలుస్తాడు.. అప్పుడే పెళ్లిళ్ల పేరయ్య ఫోన్ చేయడంతో ఏమని చెప్పాలి వీళ్ళకు అని మాధవ్ అనుకుంటూ ఉంటాడు..
కేశవ అబద్దాలు చెప్పడం మాయలు చేయడం వీడికి మాత్రమే వచ్చు వాడికి ఇవ్వు అన్నయ్య అనేసి అంటాడు.. మా అన్నయ్యకు ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందండి దానివల్ల ఫోన్ చేయలేకపోయాడు పెళ్లిచూపులు ఈరోజు కాకపోయినా రేపైనా పెట్టుకోవచ్చు కదా అనేసి చక్రి అబద్దం చెప్తాడు. అన్నదమ్ముల అనుబంధం సీన్ ను చూపించడంతో ఎపిసోడ్ కాస్త ఎమోషనల్ గా సాగుతుంది. మొత్తానికి అన్నదమ్ములు అందరూ కూడా మళ్లీ సంతోషంగా ఉంటారు.. మన ఇల్లు బాగుంటే మనకి ఎప్పుడో పెళ్లిళ్లు అయ్యేవి కదా అని అనుకుంటారు..
ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు రా ఏదో ఒక రోజు మనకు కూడా మారిపోతాయి.. ఆ రోజు కోసం వెయిట్ చేయాలి అంతే అని మాధవ్ తన తమ్ములతో అంటాడు.. మహా ఇంటికి రాగానే తన ప్రాజెక్టు ఓకే అయిందని వదినతో చాలా సంతోషంగా చెప్తుంది.. ఈ విషయాన్ని మీ నాన్నతో చెప్తావా అంటే లేదు ప్రాజెక్ట్ అంత ఓకే అయిన తర్వాత నేను చెప్తాను అని అంటుంది.. ఇక మహా ఎవరితోనో తిరుగుతుంది అని అనుమాన పడతాడు ప్రతాప్.. అయితే తన కూతురు కూడా తన ఫ్రెండ్ కూతురు లాగా వెళ్ళిపోతుందేమో అని భయపడతాడు.
ప్రతాప్ పెళ్లిళ్ల పేరయ్య కి ఫోన్ చేసి ఉదయం కెనడా సంబంధం ఏదో ఉంది అన్నావు కదా.. ఆ సంబంధం ఎవరికీ చూపించలేదు కదా అని అడుగుతాడు. నువ్వు అమ్మాయి చదువు అయిపోయిందని అన్నావు కదా అందుకే నేను ఇంకా ఎవరికీ చెప్పలేదు మీ అమ్మాయి అయితే వాళ్లకి బాగా నచ్చింది అని అతను అంటాడు. ప్రతాప్ మంచి సంబంధం అన్నావ్ కదా వాళ్ళని ఒకసారి పెళ్లిచూపులకి రమ్మని చెప్పు అని అంటాడు.. ఆ మాట విన్న తన భార్య ఏమైందండీ ఎందుకు ఇంత సడన్గా నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది.. నా ఫ్రెండు సత్యం కూతురు తెలుసు కదా ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది అంట వాడు బాధపడుతున్నాడు.
Also Read : అక్షయ్ దగ్గర నిజం దాచిన అవని.. కమల్, పల్లవి రొమాన్స్.. చక్రధర్ ప్లాన్ సక్సెస్..
మహాని నేను ఇవాళ ఒక అబ్బాయి బండి మీద చూశాను. అతని గురించి ఎంక్వయిరీ చేస్తే మహా కి ఫ్రెండ్ అని తెలిసింది. కానీ ఇది మంచి సంబంధం కదా వద్దనుకోవడం ఎందుకు పెళ్లి చేసేస్తే మనకు ఒక టెన్షన్ తగ్గిపోతుంది కదా అని ప్రతాప్ అంటాడు. మీరు ఎలా అనుకుంటే అలానే చేయండి అని ఆమె అంటుంది. ఉదయం మహా లేచి కిందికి వచ్చేలోగా హారిక వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండడంతో ఏం జరుగుతుందని అయోమయంలో ఉంటుంది. మహా కి పెళ్లి చూపులు మరి కాసేపట్లో వాళ్ళు వస్తారు అని అనడంతో షాక్ అవుతుంది. పెళ్లిచూపులు కి ఎట్టి పరిస్థితులను కూర్చోవాల్సిందే అని ప్రతాప్ చెప్పడంతో మహా ఎమోషనల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో మహా పెళ్లి సంబంధాన్ని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…