E-Paper
Advertisement

Podarillu Today Episode : పెళ్లి వద్దని మహా గోల.. మాధవ్ కోసం గాయత్రి పూజలు..చక్రి, మహా కలుస్తారా..?  

Podarillu Today Episode : పెళ్లి వద్దని మహా గోల.. మాధవ్ కోసం గాయత్రి పూజలు..చక్రి, మహా కలుస్తారా..?  
Advertisement

Podarillu Today Episode December 11th: ఇంటిని చూసి ఎవ్వరు కూడా మనకి పిల్లనివ్వడానికి ఒప్పుకోవడం లేదు.. తన దాంట్లో తప్పు లేదు కదా అని కేశవ కోపంగా అంటాడు.. ఆ మాట విన్న చక్రి.. బయట అన్నమాట బయటే వదిలేసి రావాలి. ఇంట్లో అన్నయ్య పెళ్లి చూపులు కదా మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని సీరియస్ అవుతాడు.. దానికి ఇద్దరూ కొట్టుకుంటారు కూడా… మహా తన ప్రాజెక్ట్ ని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా ఓకే అవుతుందని బయటకు వచ్చేస్తుంది.. మహా తన ప్రాజెక్టు ఎలాగైనా సరే ఓకే అవుతుందని చాలా సంతోషంగా తన ఫ్రెండ్ తో బయటకు వెళ్తుంది.. మహా వాళ్ల నాన్న తన ఫ్రెండ్ చెప్పింది ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతాప్ మహాను తన ఫ్రెండ్ తో చూసి షాక్ అవుతాడు. తన కూతురు తన చేయి జారిపోకుండా ఉండాలంటే కచ్చితంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు.. రేపు పెళ్లి చూపుల కి వస్తారని తన భార్యతో చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానీకొస్తే.. ఉదయం మహా లేచి కిందికి వచ్చేలోగా హారిక వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండడంతో ఏం జరుగుతుందని అయోమయంలో ఉంటుంది. మహా కి పెళ్లి చూపులు మరి కాసేపట్లో వాళ్ళు వస్తారు అని అనడంతో షాక్ అవుతుంది. పెళ్లిచూపులు కి ఎట్టి పరిస్థితులను కూర్చోవాల్సిందే అని ప్రతాప్ చెప్పడంతో మహా ఎమోషనల్ అవుతుంది… ఇప్పుడు నాకు అర్జెంట్గా పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారా నాన్న.. నేను మీకు అంత భారం అయిపోయాను అని మహా ప్రతాప్ ని అడుగుతుంది. గదిలోకి వెళ్లి తాను సాధించిన మెడల్స్ అన్నిటిని తీసుకొని వస్తుంది..

Advertisement

నేను ఇన్ని మెడల్స్ నేను సాధించాను నీ కూతురుగా నా కాళ్ళ మీద నేను నిలబడడం నీకు ఇష్టం లేదా అని మహా అడుగుతుంది.. పెళ్లయిన తర్వాత కూడా నువ్వు జాబ్ చేయొచ్చు అని అనడంతో మహా షాక్ అవుతుంది.. ఎంత చెప్పినా ఎందుకు మీరు వినట్లేదు అని మహా బాధపడుతుంది.. దానికి ప్రతాప్ నువ్వు బాధపడాల్సిన పని లేదు నాన్న.. పెళ్లిచూపులు జరగాలి వాళ్ళకి నచ్చాలి ఎంగేజ్మెంట్ అవ్వాలి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది అని అంటాడు.. వచ్చే టైం అయింది నువ్వు వెళ్లి రెడీ కానీ ప్రతాప్ వెళ్ళిపోతాడు.. మహా మాత్రం ఎందుకు నా బాధను వీళ్లు అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటుంది..

చక్రి అన్నయ్య తో పాటి నాకు కూడా పెళ్లి అయిపోతే బాగుంటుంది ఒక మంచి అమ్మాయిని చూపించి దేవుడా అని అనుకుంటాడు. కన్నా మాధవ్ ని మంచిగా రెడీ అవ్వు అని దగ్గరుండి రెడీ చేస్తాడు.. నారాయణ పాటలు వింటూ బయట కూర్చుని ఉంటాడు. నా రేడియోలో వస్తున్న పాటలు విన్న కేశవ దాన్ని పగలగొట్టేస్తాను అని అంటాడు.. చక్రి కూడా ఆ రేడియోను నా కారు కింద వేసి తొక్కించేస్తాను అని కోపంగా ఉంటాడు.. నేను అనట్లేదు రా నా రేడియో అంటుంది అని నారాయణ అంటాడు. వీళ్ళందరి సీన్ కాస్త కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..

Advertisement

ఇక గాయత్రి తాయారు ఇద్దరు కలిసి గుడిలో పెళ్లి కోసం అని ముడుపు కట్టడానికి పూజలు చేస్తూ ఉంటారు. గాయత్రి ఫ్రెండ్ గుడికి వచ్చి మాధవ్ పెళ్లి చూపులకు వెళ్తున్న విషయాన్ని చెప్తుంది.. ఎలాగైనా సరే మా అమ్మ దగ్గర నుంచి తప్పించుకొని మాధవ్తో మాట్లాడాలి అని ప్లాన్ వేసి బయటకు వచ్చేస్తుంది… గాయత్రి వచ్చి మాధవ్ తో మాట్లాడటం చూసిన కన్నా మీరిద్దరు పెళ్లి ఇప్పట్లో కాదు గాని మీ అమ్మతో నువ్వు మాట్లాడు అని సెటైర్లు వేస్తాడు. గాయత్రి నీకు చిన్నప్పుడు ముడ్డి కడిగాను రా అది కూడా నీకు విశ్వాసం లేదా అని మాట్లాడుతుంది. మాట్లాడితే అదే టాపిక్ తీసుకురావద్దు అని కన్నా అంటాడు..

Also Read :అడ్డంగా బుక్కయిన తిరుపతి.. శ్రీవల్లి పై రివేంజ్.. చందుకు దొరికిపోయిన అమూల్య..

మహని హారిక రెడీ అవమని చెప్తుంది.. ఎందుకు వదిన వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని మహా అంటుంది.. దానికి హారిక నేను బయటి నుంచి వచ్చాను ఇంట్లో పుట్టి పెరిగింది. నువ్వు మీ వాళ్ల గురించి అర్థం చేసుకోవాలి అని అంటుంది. మహా వాళ్ళ అమ్మ ఎరుపు రంగు చీర కాకుండా ఏదైనా కట్టండి.. ఆ రంగు అంటే అబ్బాయికి అస్సలు ఇష్టం లేదంట అబ్బాయి చాలా బాగున్నాడు సినిమా హీరో లాగా ఉన్నాడు అని అంటుంది.. ఇక మహా అయిష్టంగానే పెళ్లి చూపులకి కూర్చుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మహా పెళ్లి ఫిక్స్ అవుతుందా లేదా చూడాలి…

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×