E-Paper
Advertisement

Delhi Crime: కార్లలో నోట్ల కట్టలు.. మూడున్నర కోట్లపైనే, షాకైన ఢిల్లీ పోలీసులు

Delhi Crime: కార్లలో నోట్ల కట్టలు.. మూడున్నర కోట్లపైనే, షాకైన ఢిల్లీ పోలీసులు
Advertisement

Delhi Crime: ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో భారీగా కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు. అక్రమంగా నగదు తరలిస్తున్నట్లు పక్కాగా సమాచారం పోలీసులకు వచ్చింది.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, తనిఖీలు మొదలుపెట్టారు. రెండు కార్లలో మూడున్నర కోట్లు క్యాష్ పట్టుబడింది. 

రెండు కార్లలో రద్దయిన నోట్ల కట్టలు

Advertisement

ఉత్తర ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో పోలీసులు పెద్ద సంఖ్యలో రద్దు చేసిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నగదు తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు.. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రతీ వాహనాన్ని చెక్ చేశారు. రెండు కార్లలో దాదాపు మూడున్నర కోట్ల విలువైన కరెన్సీ పట్టుబడింది.

Advertisement

2016 నవంబర్‌లో కరెన్సీ రద్దు చేసింది కేంద్రప్రభుత్వం.  ఆ తర్వాత ఆయా నోట్లను చెల్లవని ప్రకటించింది ఆర్బీఐ. పట్టుబడిన నగదు రూ. 500, రూ. 1,000 నోట్లు ఉన్నాయి. అవన్నీ బ్యాగుల్లో ఫుల్ చేశారు. దీనికి సంబంధించి నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

షాకైన ఢిల్లీ పోలీసులు

నగదు ఎక్కడి నుండి వస్తోంది? దీనివెనుక ఎవరున్నారు? దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు పాత నోట్లు అక్రమంగా తరలించడం వెనుక ఏం జరిగింది? ఈ నెట్‌వర్క్‌ వెనుక ఎవరున్నారు? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నలుగురిలో ముగ్గురు ఢిల్లీ ప్రాంతానికి చెందినవారు. ఒకడు హిమాచల్ ప్రదేశ్‌కి చెందినవాడు. 22 ఏళ్ల హర్ష్, 25 ఏళ్ల చంద్, 28 ఏళ్ల లక్ష్య, 38 ఏళ్ల విపిన్ కుమార్. నాలుగో నిందితుడు కుమార్ షాలిమార్ బాగ్ మెట్రో స్టేషన్‌లోని గేట్ నంబర్-4 సమీపంలోని ఫిరోజ్ షా రోడ్‌లోని ఒక సర్వెంట్ క్వార్టర్‌లో ఉంటున్నాడు.

ALSO READ: భాగ్యనగరంలో భారీ చోరీ.. బంగారం, వెండి, ఆపై క్యాష్

నిందితులు ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రద్దయిన నోట్లను RBI లో మార్చుకోవచ్చని చెప్పినట్టు తెలుస్తోంది. కొంత మార్పిడి చేసినట్లు అంగీకరించారు. వారిపై మోసం, కుట్ర, బ్యాంక్ నోట్స్ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.

రద్దయిన నోట్లను కలిగి ఉండటం చట్ట విరుద్ధమని నిందితులకు తెలుసు. త్వరగా డబ్బు సంపాదించడానికి ఆలోచనతో వీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. ఆయా నోట్లు ఎవరిచ్చారు? అనే విషయాన్ని పోలీసులు ఎక్కడా బయటపెట్టలేదు. మొత్తానికి పాత నోట్ల వెనుక తీగలాగితే డొంక కదలడం ఖాయం. 

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×