Podarillu Today Episode December 16th: మాధవ్ తనకు పెళ్లి సంబంధం ఓకే అవ్వలేదు అని బాధపడుతూ ఉంటాడు. అందరం మొగోళ్ళు వెళ్తే ఏం బాగుంటుంది ఒక నలుగురు ఆడవాళ్ళు అన్న వెళ్తే మనకి మర్యాద ఇస్తారు అని నారాయణ అంటాడు.. నలుగురు ఆడవాళ్ళని ఎక్కడినుంచి తీసుకొస్తావు నువ్వేమైనా లైన్లో పెట్టావా అని చక్రి అంటాడు.. మీ అమ్మ వెళ్ళిన తర్వాత నేను అలాంటి పనులు చెయ్యను మీ అమ్మ మీద ఒట్టు అని అంటాడు.. మా అమ్మ మీద ఒట్టు వేసి మా అమ్మని చంపేసావు కనీసం పైనున్నప్పుడైనా ప్రశాంతంగా ఉండనివ్వవా అని చక్రి అంటాడు.. అమ్మాయికి దగ్గరుండి గారెలు నేర్పించాడు అని అనగానే చక్రి గారెలు వంకతో ఆమె చేయి పట్టుకున్నాడు అని అంటాడు. ఆ మాట వినగానే మాధవ్ సీరియస్ అయ్యి చక్రిపై టమోటా విసిరేస్తాడు.. సరే నాకు ట్రిప్ వచ్చింది నేను వెళ్తున్నాను అని చక్రి అంటాడు. కేశవ కూడా నాకు పని ఉంది నేను వెళ్తాను అని అంటాడు.. గాయత్రి, మాధవ్ తో మాట్లాడటం చూసిన తాయారు పెద్ద రచ్చ చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆ ప్రాజెక్టు దాదాపు పూర్తి అయిపోయింది అది గనక ఓకే అయితే నేను మంచి ఇంజనీర్ అవుతాను అని అనుకుంటుంది.. ఈ విషయం ఎలాగైనా నాన్నకు చెప్పి పెళ్లిని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయించాలి అని. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్ ఏమైంది అమ్మ ఇంకా ఇలా ఉన్నావు వెళ్లి పడుకోవా అని అడుగుతాడు.. నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను నాన్న మీకు ఒక విషయం చెప్పాలి అని తన ప్రాజెక్టు గురించి చెప్తుంది. ఆ మాట వినగానే ప్రతాప్ నువ్వు పెళ్లయిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టు అలాంటివి చేసుకోవచ్చు అని అంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన లలిత నువ్వు అల్లుడు గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని అంటుంది.. మహా ఎంతగా ఈ పెళ్లి వద్దు అని అంటున్నా సరే వాళ్ళు మాత్రం బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తారు..
చక్రి తన కారులో ఒక అమ్మాయి ఎక్కితే బాగుంటుంది అని అనుకుంటాడు.. అప్పుడే ఒక అమ్మాయి కారు ఆపి ఎక్కుతుంది. ఏంటి 50% ఆఫర్ అని పెట్టారు. పెళ్లి కాని వాళ్ళు కారెక్కితే నిజంగానే ఆఫరిస్తారని అడుగుతారు.. అయితే అమ్మాయి కరెక్ట్ గానే చక్రి చాలా అందంగా ఉన్నారు మీకు పెళ్లయిందా అని అడుగుతాడు. నాకు పెళ్లి కాలేదు.. నాకు 20 కార్లు ఉన్నాయి మేడం నేను డ్రైవర్ని కాదు అని అంటాడు.. మరి నువ్వెందుకు డ్రైవింగ్ చేస్తున్నావని ఆ అమ్మాయి అడుగుతుంది.
ఇవాళ డ్రైవర్ల అందరూ బిజీగా ఉన్నారు మేడం అందుకే నేను డ్రైవర్గా వచ్చాను. మీకు పెళ్లి కాలేదు కదా నా మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. మీకు ఇరవై కార్లు ఉన్నాయి కదా.. పెళ్లి వద్దు కానీ, కలిసి ఉందాం అని అంటుంది.. నేను నా ఇంటికి మంచి ఆడపిల్ల రావాలని అనుకున్నాను కానీ మీరు ఇలా అంటారని నేను అసలు అనుకోలేదు అని కారు మధ్యలోనే ఆపేసి అమ్మాయిని దింపేస్తాడు. మహా బట్టలు నగలు కొనడానికి భూషణ్ తో వెళ్లడానికి అంతా రెడీ చేస్తారు ప్రతాప్.. ఆది హారిక ఇద్దరు కిందికి వచ్చేస్తారు.. మేమిద్దరం రెడీ అయ్యాము. ఇంకా ఆ మహాతల్లి రెడీ కాలేదు అని ఆది అంటాడు.. వస్తుంది లేరా రెడీ అవుతుంది కదా అని ప్రతాప్ అంటాడు..
ఈమె కావాలనే ఇలా చేస్తున్నట్లుంది.. ఇంకెప్పుడు వస్తుందో అని ఆది అంటాడు ఆ మాట వినగానే ప్రతాప్ నువ్వు అబ్బాయి దగ్గర అలా మాట్లాడొద్దు మహా ఫీల్ అవుతుంది అని అంటాడు.. ఈ పెళ్లి తనకి ఇష్టం లేదు కదరా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ప్రతాప్ అంటాడు. మహా నాన్న నేను ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు నా ఇష్టం లేకుండా పెళ్లి చేయాలనుకుంటున్నావు నీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అద్దం ముందు నిల్చొని మాట్లాడుతుంది.. అమ్మో నాన్న మీద పోలీస్ కంప్లైంట్ అంటే బాధపడతాడు వేరేలా అడగాలి అని అనుకుంటుంది..
ఆ తర్వాత నాన్న నువ్వు నా ప్రాజెక్ట్ అయిపోయింది వరకు పెళ్లి ఏమి పెట్టుకోవద్దు నాన్న లేకపోతే నేను చచ్చిపోతాను నాన్న అని మరో డైలాగు ప్రాక్టీస్ చేస్తుంది.. ఈ పెళ్లి ని క్యాన్సల్ చేయడానికి నేనెందుకు చచ్చిపోవాలి అని తనలో తానే తిట్టుకుంటూ ఉంటుంది మహా.. ఆ తర్వాత మహాను ప్రతాప్ కిందకి రమ్మని పిలుస్తాడు.. కింద భూషణ్ వాళ్ళు ఉండడం చూసి షాక్ అవుతుంది.. వీడొచ్చి సచ్చాడా నన్ను ఇరికించాడు అని అనుకుంటుంది.. టైం అవుతుంది అమ్మ బయలుదేరండి అని ప్రతాప్ అంటాడు.. అమ్మాయిని ఎప్పుడు ఎవరి ఇంటికి పంపించలేదు మొదటిసారి మీ ఇంటికి పంపిస్తున్నాము అని లలిత అంటుంది.. చాలా పంపించకపోవడం వల్లే ఇలా తయారయింది మేము చూసుకుంటాం లేండి మీరేం బాధపడకండి అని భూషణ్ అంటాడు.
ఇక మహా పక్కన కారులో భూషణ్ కూర్చోవడంతో మహా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.. హారికను ఎలాగైనా సరే వెనక్కి రమ్మని చెప్తుంది.. భూషణ్ మీరు డ్రైవింగ్ చేయండి అని అంటుంది హారిక. అదేంటి అది డ్రైవింగ్ చేస్తున్నాడు కదా అని భూషణ్ అడుగుతాడు.. డ్రైవింగ్ మధ్యలో నిద్రపోతాడు కూడా అని హారిక చెప్పడంతో భూషణ్ వాళ్ళ అమ్మ పొద్దున మంచి శుభకార్యం కోసం వెళ్తున్నాం కదా ఏమైనా జరుగుతుందేమో నువ్వే వెళ్లి డ్రైవింగ్ చేయ అని అంటుంది.. నారాయణ ఇంటికి వచ్చిన పెళ్లిళ్ల పేరయ్య తో దారుణంగా మాట్లాడతాడు.. కానీ మాధవ్ అమ్మాయికి నచ్చింది అని చెప్పడంతో అందరూ సంతోషంగా ఉంటారు.
Also Read : తాగి రచ్చ చేసిన సాగర్.. ప్రేమకు ముద్దుపెట్టేసిన ధీరజ్.. వణికిపోయిన శ్రీవల్లి..
ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు చేస్తే సరిపోతుంది అని అంటారు..తర్వాత మహా వాళ్ళు షాపింగ్ అని వెళ్తారు.. మధ్యలో పెళ్ళికొడుకు కారు చక్రీ కారును ఢీ కొడుతుంది.. ఏంట్రా ఇడియట్ అసలు రోడ్డు కనిపించట్లేదా నీకు కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావు అని తిడతాడు. చక్రి మాటకు మాట సమాధానం చెప్తాడు.. కారులో ఉన్న మహా ఈ గొడవేంటి అని బయటకు వస్తుంది. ఆపండి అని అనగానే చక్రి ఆమెను చూసి నా అదృష్టదేవత ఇక్కడ ఉందా అని సంతోషపడతాడు.. తప్పు మన వైపే ఉంది కాబట్టి మనమే క్షమాపణ చెప్పాలి అని మహా అంటుంది.. ఇండియాలో కొన్ని రూల్స్ ఉంటాయి వాటి ప్రకారమే ఫాలో అవ్వాలని మహా చక్రికి సపోర్ట్ గా మాట్లాడుతుంది. మహా వల్ల గొడవ ఆగిపోతుంది. చక్రి ఈ అమ్మాయి నా సొంతమైతే చాలా బాగుంటుంది ఈమె మనసులో ఎలాగైనా సరే చోటు సంపాదించుకోవాలి అని అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఎపిసోడ్లో ఇంటికి మరమ్మతులు చేయాలని నారాయణ కుటుంబం అనుకుంటుంది.. అది చూడగానే తాయారు గొడవకు దిగుతుంది.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..