E-Paper
Advertisement

Telangana: రేపే మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, ముగిసిన ప్రచారం!

Telangana: రేపే మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, ముగిసిన ప్రచారం!

Telangana: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోరుకు తెర పడింది. సోమవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియడంతో, చివరి రోజు పల్లెల్లో ప్రచారాల హోరు పతాక స్థాయికి చేరింది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ తమ మద్దతుదారులతో కలిసి గ్రామాల వీధుల్లో విస్తృతంగా తిరిగారు. తమను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటూ హామీల వర్షం కురిపించారు. తాము చేపట్టబోయే అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను ముద్రించిన పాంప్లెట్‌లను ఓటర్లకు పంచిపెట్టారు. అభ్యర్థుల ప్రసంగాలు, నినాదాలతో గ్రామాలు సందడిగా మారాయి.

ఈ మూడో విడత ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ రేపు(మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. నోటిఫికేషన్ ఇచ్చిన 4,157 గ్రామాలకు గానూ, 394 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే, 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 7,916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,752 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాల కోసం 12,640 మంది అభ్యర్థులు, 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 11 గ్రామాలు, 112 వార్డులకు మాత్రం వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు.

పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం సిద్దమైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం, పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే రేపు సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలకు బంద్ చేశారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన పోలింగ్ సామగ్రి మొత్తం మండల కేంద్రాలకు చేరింది. అక్కడ నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, గస్తీని పటిష్టం చేశారు.

పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో, విజయం కోసం రాజకీయ పార్టీల మద్దతుదారులు, అభ్యర్థులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి డబ్బు, మద్యం, మహిళలకు చీరలు వంటివాటిని పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల అధిష్టానాలు సైతం తమ మద్దతు ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం గ్రామ స్థాయి నేతలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన వ్యూహాత్మక సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. గ్రామంలోని వర్గాలను ఏకం చేయడం, ప్రత్యర్థి వర్గాల ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం ఎత్తులు, పైఎత్తులు జోరుగా సాగుతున్నాయి.

Also Read: మెక్సికోలో పెను విషాదం.. కుప్పకూలిన విమానం.. స్పాట్‌లో 10 మంది మృతి

మొదటి రెండు విడతల్లో మాదిరిగానే, ఈ మూడో విడత పోరు కూడా రాజకీయ పార్టీల బలాబలాలకు ఒక అగ్నిపరీక్షగా నిలవనుంది. 3,752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో, ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకొని హవా కొనసాగిస్తుందా, లేక ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి మెజారిటీ సాధిస్తుందా, లేక బీజేపీ ఈసారి తమ పట్టును పెంచుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×