Podarillu Today Episode December 23rd : చక్రి ఎలాగైనా సరే మహా మనసులో చోటు సంపాదించాలని అక్కడున్న షర్ట్లు అన్నిటిని ట్రై చేస్తూ ఉంటాడు. మహా మాత్రం అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పెద్దగా పట్టించుకోదు. ఏంటి కనీసం చూడను కూడా చూడలేదు అని అనుకుంటాడు. ఇక అక్కడున్న భూషణ్ వాళ్ళ అమ్మ అన్ని చీరలు చూస్తుంది. కానీ అక్కడ ఉన్న రెడ్ కలర్ సారీ అతను చూపించమని ఏ కలర్ అయినా చూపించండి ఈ రెడ్ కలర్ మాత్రం చూపించకండి అని అంటుంది. అవునా రెడ్ కలర్ ఇప్పుడు చూడు వీడ్ని ఆడుకుంటాను అని మహా అంటుంది. రెడ్ కలర్ సారీ చాలా బాగుంది అని అంటుంది. రెడ్ కలర్ అంటే మా వాడికి ఇష్టం లేదమ్మా అందుకే నేను యెల్లో కలర్ సెలెక్ట్ చేసానని భూషణ్ వాళ్ళమ్మ అంటుంది. కానీ మహా మాత్రం నాకు రెడ్ కలర్ చాలా బాగా నచ్చింది తీసుకుంటే దీన్ని తీసుకోండి లేకపోతే ఈ చీరలు వద్దు వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. ఏంటమ్మా షాపింగ్ ఇంకా ఎంతసేపు అని భూషణ్ అడుగుతాడు. మహా కి పెళ్లి అని తెలుసుకొని చక్రి షాక్ అవుతాడు. కానీ మహా మాటలు విన్న తర్వాత తనకి ఈ పెళ్లి కొడుకు అంటే ఇష్టం లేదని అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహా భూషణ్ తో మాట్లాడాలని అనుకుంటుందని ఆదితో హారిక అంటుంది.. మహా భూషణ్ ని బయటికి పంపిస్తే వీళ్లిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని హారిక అంటుంది. భూషణ్ దగ్గరికి వెళ్లి చక్రి హారిక ఇద్దరు కూడా ఈ విషయం గురించి మాట్లాడతారు. అతనికి భూషణ్ ప్రశ్నలతో విసిగించి మరి ఒప్పుకుంటాడు.. మహా భూషణ్ ఇద్దరు కలిసి బయటికి వెళ్లేందుకు చక్రిని కారు తీయమని అంటారు. ఇక ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకోవాలని అనుకుంటారు. మహా తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ భూషణ్ మాత్రం తాను చెప్పిందే వినాలని కండిషన్స్ పెడుతూ వస్తాడు.. నాకు జాబ్ చేయాలనిపిస్తుంది నేను కొద్ది రోజులు జాబ్ చేస్తాను అని మహా భూషణ్ ని అడుగుతుంది.. మాట వినగానే భూషణ్ నువ్వు జాబ్ కి వెళ్తే నేను చెక్కభజన చేయాలని సీరియస్ అవుతాడు. మహా మాత్రం ఇలాంటి వాడు నాకు వద్దు అని మనసులో అనుకుంటుంది.
ఇక చక్రి ఆ జుట్టు పోలిగాడి గురించి కన్నాకి చెప్తూ ఉంటాడు.. అప్పుడే గాయత్రి అక్కడికి వస్తుంది. కేశవా నారాయణ పై సీరియస్ అవుతాడు.. ఎప్పుడూ ఇదే పనా నీకు అని అంటాడు.. నేను ఇంక మారను నేను ఇలానే ఉంటాను అని నారాయణ అంటాడు.. కేశవ కన్నా చక్రితో ఉండడం చూసి వాడితో నువ్వుంటే చెడిపోతావ్ రా అని అంటాడు. అయితే అవునన్నయ్య నీతో ఉంటే నేను కూడా చెడిపోతాను అని అంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మహా పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడికి గాయత్రి వస్తుంది. తనను చూసిన కన్నా వచ్చిందమ్మా వయ్యారి అంటాడు.
బావని పలకరించి పోదామని వచ్చాను అని గాయత్రి అంటుంది. మాధవ్ రాగానే ఈ పెళ్లి సంబంధం కూడా చెడిపోయింది అంట కదా బావ అని అడుగుతుంది. నీకు నాకు రాసిపెట్టి ఉందేమో.. ఏంటి ఈ పెళ్లి సంబంధం చెడిపోయిందా అని అడుగుతాడు. అవును ఈ పెళ్లి సంబంధం కూడా చెడిపోయింది. ఇంకెక్కడిది వీళ్ళ అమ్మ వీళ్ళ పెద్ద మామ కలిసి చెడగొట్టారు అని నారాయణ అంటాడు.. నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలంటే ముందు నీకు ధైర్యం ఉంటే మీ అమ్మను ఒప్పించు అని నారాయణ గాయత్రి పై అరుస్తాడు. చక్రి గాయత్రి ఆశలు పెట్టుకుంటుంది ఇది జరగదని తనకు తెలియదు అని అంటాడు. అందరు కలిసి గాయత్రి మాధవ్ గురించి ఆలోచిస్తారు.
ఇక మహా కోసం ప్రతాప్ భూషణ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏమైందిరా ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు అని అడుగుతాడు. మహా ఎంత చెప్పినా కూడా భూషణ్ ని పెళ్లి చేసుకోను అని అంటుంది.. ఆ మాటలు విన్నా ప్రతాప్ మహా తో నేను మాట్లాడతాను అని అక్కడికి వెళ్తాడు. భూషణ్ వాళ్ళ తల్లి నీ గురించి ఏదైనా చెప్తుంది ఏమోరా నువ్వు వెళ్ళు అనేసి అంటుంది. ఇక భూషణ్ నేను ఏమైనా మర్డర్ చేశానా ఖూనీ చేశానా సరే వెళ్తాలే ఆగు అని అంటాడు.. మహా వాడు నాకు కరెక్ట్ కాదు నాన్న మీరు నన్ను ప్రేమగా పెంచారు వాడిన నువ్వు బెదిరిస్తున్నాడు అని అంటారు.. నా డ్రీమ్స్ గురించి నా కలల గురించి అతను ఏమీ ఆలోచించడం లేదు నాన్న నాకు అతను నచ్చలేదు నాన్న.. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని మహా అంటుంది.. ఎంత చెప్పినా సరే మహా మాత్రం ఏది వద్దు అని అంటుంది.
మహా కి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా ఇలా తొందర పెడితే తనైనా ఎలా ఉంటుంది మావయ్య గారు అని హారిక అంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన భూషణ్ నా గురించి నువ్వు ఏం తెలుసుకోవాలి మహా అని అంటాడు.. ఇది ఒక జిత్తుల మారి నక్కలా ఉన్నాడు ఎలాంటి నాటకాలు ఆడుతున్నారో చూసారా అని మనసులో అనుకుంటుంది.. ఆది భూషణ్ ని కిందకి తీసుకొని వెళ్తాడు. మహాకే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు ప్రతాప్. మహాతో మాట్లాడుతున్న సమయంలో ఒక ఫోన్ కాల్ రావడంతో ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి వారిని చంపేయండి అని సీరియస్ అవుతాడు. ఇక మహా కూడా చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతుంది.
తర్వాత రోజు ఉదయం భూషణ్ మహాను కూడా పిలుచుకు రండి మాట్లాడాలి అని అంటారు. పెళ్లయి వీసా వచ్చేలోగా చాలా టైం పడుతుంది. అందుకే నేను వీసా కోసం ట్రై చేయాలి కదా అంకుల్.. ముందుగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఈ పనులన్నీ పూర్తి అవుతాయి అని అంటాడు. మీరు ఏమంటారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మేలు కదా అని భూషణ్ అంటాడు ఆ మాట వినగానే మహా నాకు ఈ పెళ్లి ఇప్పుడే ఇష్టం లేదు ఇంత సడన్గా చెప్తే ఎలా అంటుంది. మహాకు హారిక కూడా సపోర్ట్ గా నిలుస్తుంది. ఆది ప్రతాప్ మాత్రం వాళ్ళు చెప్పిందే చేయాలి అని అనుకుంటారు.
Also Read : శ్రీవల్లిని అడ్డంగా ఇరికించిన నర్మద.. టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి.. ధీరజ్ వల్ల గొడవలు..
పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాలని భూషణ్ అడుగుతాడు. మీరు షాపింగ్ కి రమ్మన్నారు ఇవన్నీ తీసుకురమ్మని మాకు చెప్పలేదు కదా ఎలా తీసుకొస్తామని అని మహా సీరియస్ అవుతుంది. ఫోటోలు ఫైవ్ మినిట్స్ పని ఇక్కడ కూడా తీసుకోవచ్చు మహాను కూల్ గా వెళ్లి ఫోటోలు తీసుకురా అని చక్రితో మహనీ పంపిస్తారు. చక్రి మహా కి పెళ్లి ఇష్టం లేదేమో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. అతని అడిగే విధానం అతని మాట తీరు మహాకి బాగా నచ్చుతుంది. దాంతో మహా చక్రిపై ప్రేమను పెంచుకుంటుందేమో ముందు ముందు చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మహా నిర్ణయానికి చక్రీ సపోర్ట్ గా నిలుస్తాడు. పెళ్లి జరగకుండా చేస్తానని అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..