E-Paper
Advertisement

Telangana politics: జగన్ దారిలో మాజీ సీఎం కేసీఆర్, ఈసారి అదే పద్దతి

Telangana politics: జగన్ దారిలో మాజీ సీఎం కేసీఆర్, ఈసారి అదే పద్దతి
Advertisement

Telangana politics: రెండేళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చారు మాసీ సీఎం కేసీఆర్. పార్టీకి మైలేజ్ వచ్చేటట్లుగా చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారు. ఆ తర్వాత మాట్లాడిన అంశాలపై మీడియాలో వరుస డిబేట్లు. కేసీఆర్ చేసిన మాటలపై ప్రజలకు వివరణ ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే సోమవారం నుంచి మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాల్లో నీటి ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేకంగా చర్చించనుంది. మాజీ సీఎం వేసిన ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? లేదా? లేకుంటే జగన్ దారిలో నడుస్తారా?

జగన్ దారిలో మాజీ సీఎం కేసీఆర్

Advertisement

తెలంగాణలో ఈనెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సమావేశాల్లో కేసీఆర్ ఛాలెంజ్ చేసిన అంశాలపై చర్చించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులపై చేసిన ఖర్చు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? నదీ జాలల వ్యవహారంలో బీఆర్ఎస్ చేసిన పనుల గురించి గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై ప్రధానంగా మాట్లాడనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి మొత్తం డేటాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా మాజీ సీఎం కేసీఆర్.. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు రావడం కష్టమని ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. అందుకు ఆ పార్టీ నేతలు రకరకాల కారణాలు చెబుతున్నారు. అధినేత అసెంబ్లీకి రావడం కష్టమేనని, కేవలం సభలు, మీడియా సమావేశాల ద్వారా ప్రజల ముందు వస్తారని అంటున్నారు. ఈ లెక్కన శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టే ఛాన్స్ ఉంది.  ఒకవేళ వస్తే కవిత లేవనెత్తిన అంశాలపై సభ్యులు ప్రశ్నలు ప్రశ్నించే అవకాశముందని కొందరు నేతలు గుసగుసలు ఆడేసుకుంటున్నారు. ఈ లెక్కన అసెంబ్లీ సమావేశాల విషయంలో జగన్ బాటలో కేసీఆర్ నడవనున్నారట.

Advertisement

ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో కేవలం ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. ఆ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు కారణంగా హాజరుకాలేదు. ఈ విషయంలో ఏపీలో జగన్‌ని ఆయన ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకుంటే ఆయన సభ్యత్వం రద్దు అయ్యే అవకాశముందని కొందరి వాదన. ఒకవేళ వచ్చినా కేవలం హాజరు వేయించుకోవడానికి రావచ్చని అంటున్నారు. బీఆర్ఎస్‌లో జరగనున్న పరిణామాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు.

ALSO READ: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి..  పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఏపీలో ఒక్కసారి మాత్రమే  అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు మాజీ సీఎం జగన్.  అది ప్రమాణ స్వీకారం సమయంలో మాత్రమే. ఆ తర్వాత జగన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. ఈసారి రాకుంటే సభ్యత్వం రద్దు అయ్యే అవకాశముందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలో జగన్ రాకపోయినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారో లేదో చూడాలి.  ఏపీలో ఆలోచనను తెలంగాణలో ఇప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు లేకపోలేదు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×