E-Paper
Advertisement

Driving Habits: బైక్ ను దెబ్బతీసే 10 డ్రైవింగ్ హాబీస్, మీరు అస్సలు ఇలా చేయకండి!

Driving Habits: బైక్ ను దెబ్బతీసే 10 డ్రైవింగ్ హాబీస్, మీరు అస్సలు ఇలా చేయకండి!

Best Driving Habits: మోటార్ సైకిల్ కొనుగోలు చేయగానే సరిపోదు. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే, అంత ఎక్కువ కాలం చక్కగా పని చేస్తుంది. బైక్ రైడింగ్‌ లో చేసే పొరపాట్ల కారణంగా బైక్ ఇంజిన్, క్లచ్, బ్రేక్స్, ఇతర భాగాలను త్వరగా డ్యామేజ్ చేస్తాయి. ఇవి బైక్ లైఫ్ తగ్గిస్తాయి. రిపేర్ ఖర్చులను పెంచుతాయి. బైక్ రైడింగ్ సమయంలో చేయకూడని 10 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బైక్ లైఫ్ తగ్గించే అలవాట్లు   

⦿ హాఫ్ క్లచ్‌తో రైడింగ్

క్లచ్‌ను మామూలుగా పట్టుకుని రైడ్ చేయడం వల్ల క్లచ్ ప్లేట్ త్వరగా చెడిపోతాయి.

⦿ రియర్ బ్రేక్ మాత్రమే ఉపయోగించడం

ఫ్రంట్, రియర్ బ్రేక్స్ బ్యాలెన్స్‌ గా ఉపయోగించకపోతే రియర్ బ్రేక్ ప్యాడ్స్ త్వరగా డ్యామేజ్ అవుతాయి. బైక్ కంట్రోల్ తగ్గుతుంది.

⦿ సడన్ యాక్సిలరేషన్, హార్ష్ బ్రేకింగ్

థ్రాటిల్‌ ను సడెన్ గా ట్విస్ట్ చేయడం, బ్రేక్స్‌ ను గట్టిగా పట్టడం వల్ల ఇంజిన్, డ్రైవ్‌ ట్రైన్‌ పై ఒత్తిడి పెరుగుతుంది.

⦿ ఇంజిన్ వార్మప్ చేయకుండా రైడ్ చేయడం

కోల్డ్ ఇంజిన్‌లో హై స్పీడ్‌లో రైడ్ చేయడం వల్ల ఇంజిన్ భాగాలు త్వరగా చెడిపోతాయి.

⦿ చైన్‌ను పట్టించుకోకపోవడం

చైన్ లూజ్, డర్టీగా ఉంటే స్ప్రాకెట్స్, చైన్ త్వరగా డ్యామేజ్ అవుతాయి.

⦿ టైర్ ప్రెషర్ సరిగా చెక్ చేయకపోవడం

లో ప్రెషర్ టైర్స్ వల్ల ఇంజిన్‌పై ఎక్స్‌ ట్రా లోడ్ పడుతుంది. టైర్స్ త్వరగా అరిగిపోతాయి.

⦿ హై గేర్‌లో లో స్పీడ్‌లో రైడ్ చేయడం

హై గేర్ లో లో స్పీడ్ నడపడం, తప్పు గేర్ ఉపయోగించడం వల్ల ఇంజిన్‌పై అనవసర ఒత్తిడి పెరిగి డ్యామేజ్ అవుతుంది.

⦿ స్పీడ్ బ్రేకర్స్ దాటేటప్పుడు గేర్ డౌన్ చేయకపోవడం

స్పీడ్ తగ్గించినప్పుడు కచ్చితంగా గేర్స్ డౌన్ చేయాలి. లేదంటే ఇంజిన్, క్లచ్‌ మీద స్ట్రెస్ పెరుగుతుంది.

⦿ ఓవర్ లోడింగ్

బైక్ లిమిట్ మించి ఉపయోగించడం వల్ల ఇంజిన్, ఫ్రేమ్ డ్యామేజ్ అవుతుంది.

⦿ రెగ్యులర్ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం

ఆయిల్ చేంజ్, ఫిల్టర్స్ క్లీనింగ్ చేయకపోతే ఇంజిన్ లైఫ్ తగ్గుతుంది.

బైక్ లైఫ్ పెంచే టిప్స్

సరైన డ్రైవింగ్, మెయింటెనెన్స్ తో బైక్ లైఫ్ పెంచుకోవచ్చు. బైక్ లైప్ పెంచే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ రెగ్యులర్ ఆయిల్ చేంజ్ చేయించండి

ఇంజిన్ ఆయిల్‌ను మాన్యుఫ్యాక్చరర్ సిఫారసు ప్రకారం మార్చాలి.

⦿ చైన్‌ను గమనించాలి

చైన్ టెన్షన్ సరిగా ఉంచి, లూబ్రికెంట్స్ వాడాలి. డ్రైవ్‌ ట్రైన్ లైఫ్ పెరుగుతుంది.

⦿ టైర్ ప్రెషర్, కండీషన్ చెక్ చేయండి

సరైన ప్రెషర్ ఉంచడం వల్ల టైర్స్, ఫ్యూల్ ఎఫిషియెన్సీ మెరుగుపడుతుంది.

⦿ ఇంజిన్ వార్మప్ చేసి రైడ్ చేయండి

కోల్డ్ స్టార్ట్ తర్వాత కొద్దిసేపు ఐడిల్‌లో ఉంచి రైడ్ చేయండి.

⦿ స్మూత్ డ్రైవింగ్ అలవాటు చేసుకోండి

సడన్ యాక్సిలరేషన్,  బ్రేకింగ్ వాడకూడదు. సరైన గేర్ షిఫ్టింగ్ చేయండి.

⦿ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయండి

క్లీన్ ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్, లైఫ్ పెంచుతుంది.

⦿ బ్యాటరీని సరిగా మెయింటైన్ చేయండి

టెర్మినల్స్ క్లీన్ ఉంచి, లాంగ్ టైమ్ నాన్ యూజ్‌లో ట్రికిల్ ఛార్జర్ వాడండి.

⦿ బైక్‌ను  క్లీన్ చేయండి

డస్ట్, మడ్ తొలగించి, కవర్ వాడి స్టోర్ చేయండి. రస్ట్ నివారిస్తుంది.

⦿ సర్వీస్ షెడ్యూల్ ఫాలో చేయండి

ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించడం వల్ల హిడెన్ ఇష్యూస్ తొందరగా గుర్తిస్తారు.

⦿ సరైన స్టోరేజ్

లాంగ్ టైమ్ యూజ్ చేయనప్పుడు డ్రై, కూల్ ప్లేస్‌లో కవర్‌తో ఉంచండి.  ఫ్యూల్ స్టెబిలైజర్ వాడండి.

ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మోటార్‌ సైకిల్ ఎక్కువ కాలం మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. సేఫ్టీ కూడా పెరుగుతుంది.

Read Also: మాన్యువల్ VS ఆటోమేటిక్.. ఏ కారు బెస్ట్? ఎందుకు?

Related News

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

Big Stories

×